S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

09/20/2017 - 02:06

విశాఖపట్నం, సెప్టెంబర్ 19: ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకూ కోస్తా మీదుగా ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు మంగళవారం రాత్రి తెలిపారు. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో రాష్ట్రం అంతటా ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. అలాగే దక్షిణ కోస్తాలో తీరం వెం బడి గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ దిశగా గాలులు వీస్తాయన్నారు.

09/20/2017 - 02:05

శ్రీకాకుళం, సెప్టెంబర్ 19: గనులు, ఖనిజ శాఖలో అసిస్టెం ట్ జియాలిజిస్టుగా పనిచేస్తున్న బట్టు హనుమంతురావు మం గళవారం రాత్రి ఇక్కడి ఒక హోటల్‌లో ఐదు లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ సెంట్రల్ ఇన్విస్టిగేషన్ యూని ట్-అవినీతి నిరోధకశాఖ, అమరావతి అధికారుల బృందానికి దొరికిపోయాడు.

09/20/2017 - 02:05

జూపాడుబంగ్లా, సెప్టెంబర్ 19: శ్రీశైలం జలాశయం నీటిమట్టం 860 అడుగులకు చేరడంతో కర్నూలు జిల్లా జూపాడుబంగ్లా మండలంలోని పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ నుంచి అధికారులు మంగళవారం సాగు, తాగునీటి అవసరాల నిమిత్తం నీరు విడుదల చేశారు. ప్రత్యేక పూజల అనంతరం 5 వేల క్యూసెక్యుల నీటిని విడుదల చేశారు.

09/20/2017 - 02:03

తిరుపతి/నాయుడుపేట, సెప్టెంబర్ 19: నెల్లూరు జిల్లా నాయుడుపేట నగర పంచాయతీ కమిషనర్ అవినేని ప్రసాద్ నివాసాలు, ఆయన బంధువులు, స్నేహితుల ఇళ్లల్లో మంగళవారం ఏకకాలంలో ఎసిబి అధికారులు దాడులు నిర్వహించారు. నెల్లూరు, నాయుడుపేట, తిరుపతి, శ్రీకాళహస్తి, కడప, కడప జిల్లా రాజంపేట ప్రాం తాల్లో ఎసిబి అధికారులు దాడులు చేపట్టారు.

09/20/2017 - 02:03

గుంటూరు, సెప్టెంబర్ 19: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసే క్రమంలోనే రాజధానిలో ఆయన స్మృతివనం ఏర్పాటు చేస్తున్నట్లు గిరిజన, సాంఘిక సంక్షేమశాఖ మంత్రి నక్కా ఆనంద్‌బాబు తెలిపారు. నవ్యాంధ్ర రాజధానిలో 125 అడుగుల భారీ విగ్రహంతో పాటు అంబేద్కర్ పేరిట స్మృతివనాన్ని ఏడాదిలోపు నిర్మించాలనేది ప్రభుత్వ లక్ష్యంగా చెప్పారు.

09/20/2017 - 02:01

నూజివీడు, సెప్టెంబర్ 19: రాష్ట్రంలో రాజీవ్‌గాంధీ సాంకేతిక వైజ్ఞానిక విశ్వవిద్యాలయం పరిధిలో నడుస్తున్న ఇడుపులపాయ, నూజివీడు, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీల్లో పర్మినెంట్ సిబ్బంది నియామకానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు ఉన్నత విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు.

09/19/2017 - 23:46

విజయవాడ, సెప్టెంబర్ 19: ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, విశ్రాంత ఉద్యోగుల సమస్యలపై ప్రతి జిల్లాలో సంయుక్త సిబ్బంది మండలి సమావేశం ఏర్పాటుచేసి పరిష్కారానికి కృషి చేయాలని అధికారులను ప్రభుత్వం ఆదేశింది.

09/19/2017 - 23:46

విజయవాడ (క్రైం), సెప్టెంబర్ 19: ప్రముఖ రచయిత, ప్రొఫెసర్ కంచె ఐలయ్యపై ఆంధ్రప్రదేశ్ సిఐడి పోలీసులు కేసు నమోదు చేసినట్టు సమాచారం. వైశ్యవర్గంపై ఐలయ్య రచించిన పుస్తకం తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం కలకలం రేపుతున్న విషయం తెలిసిందే.

09/19/2017 - 23:45

విజయవాడ, సెప్టెంబర్ 19: ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ వేమూరి ఆనంద్ సూర్య హైదరాబాద్ రాజ్‌భవన్‌లో గవర్నర్ సలహాదారు ఎపివిఎన్ శర్మను మంగళవారం మర్యాద పూర్వకంగా కలిశారు.

09/19/2017 - 23:45

విజయవాడ, సెప్టెంబర్ 19: ప్రత్యామ్నాయ వివాద పరిష్కార పద్ధతులు అనే అంశంపై రెండురోజులపాటు జలవనరులశాఖ ఇంజనీర్లకు వర్క్‌షాప్ నిర్వహించనున్నారు. విజయవాడలోని నీటిపారుదలశాఖ కార్యాలయ ఆవరణలో ఈనెల 20, 21 తేదీల్లో నిర్వహించనున్నట్లు ప్రత్యామ్నాయ వివాద పరిష్కార అంతర్జాతీయ కేంద్రం జెఎల్‌ఎన్ మూర్తి తెలిపారు. ఈ వర్క్‌షాప్‌నకు ముఖ్య అతిధిగా జలవనరులశాఖ కమిషనర్ గిరిధర్‌రెడ్డి హాజరవుతారని తెలిపారు.

Pages