S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

03/20/2018 - 03:54

రొంపిచర/్లకొత్తగూడెం, మార్చి 19: రెండు తెలుగురాష్ట్రాల్లో సోమవారం ఈతకెళ్లి ఆరుగురు మృత్యువాత పడ్డారు. గుంటూరు జిల్లాలో ఇద్దరు, బద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నలుగురు మృతి చెందారు. గుంటూరు జిల్లా రొంపిచర్లకు చెందిన పామిశెట్టి కోటేశ్వరరావుకు కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. కుమార్తెకు వివాహం కాగా భర్తతో పాటు చెన్నైలో ఇద్దరూ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు.

03/20/2018 - 04:29

పెదనందిపాడు, మార్చి 19: విభజన అనంతరం రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదాను కేంద్రానికి తాకట్టు పెట్టిన ఘనుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని వైసీపీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహనరెడ్డి ఆరోపించారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ నాడు, నేడు ఒకేమాట చెప్తుంటే అందుకు విరుద్ధంగా చంద్రబాబు మొసలికన్నీరు కారుస్తూ, దగాపడ్డామంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు.

03/20/2018 - 04:25

రాజమహేంద్రవరం, మార్చి 19: అఖండ గోదావరి ఎడమ గట్టుపై సీతానగరం మండలం పురుషోత్తపట్నం గ్రామం వద్ద పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం నిర్మాణం చివరి అంకానికి చేరుకుంది. తాజా బడ్జెట్‌లో రూ.400 కోట్లు కేటాయించడంతో పనులు మరింత ఊపందుకున్నాయి. రూ.1638 కోట్ల అంచనా వ్యయంతో నిర్మాణం చేపట్టిన ఈ పథకం వాస్తవానికి గత ఏడాది నవంబర్ నాటికి పూర్తికావాల్సివుంది.

03/20/2018 - 03:49

విజయవాడ, మార్చి 19: అవిశ్వాస తీర్మానమంటే బీజేపీ ఎందుకు భయపడుతోందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు. సొంత పార్టీ సభ్యులపై నమ్మకం లేకనే భయపడుతున్నారా? అంటూ ఎద్దేవా చేశారు. మోదీపై అసంతృప్తితో ఉన్న బీజేపీ ఎంపీలు అవిశ్వాసంపై చర్చ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేస్తారని బీజేపీ భయపడుతోందని ఆయన సోమవారం ఒక ప్రకటనలో వ్యాఖ్యానించారు.

03/20/2018 - 02:37

విజయవాడ, మార్చి 19: అందరి దృష్టి ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాడి పోలవరం మీదనే ఉందని, ప్రతిష్ఠాత్మకమైన ఈ ప్రాజెక్టు నిర్మాణంలో చిన్న పొరపాటుకూ తావులేకుండా నిర్మించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్మాణ సంస్థలకు విజ్ఞప్తి చేశారు. సోమవారం సచివాలయంలోని తన కార్యాలయంలో ఆయన పోలవరం, ప్రాధాన్యతా ప్రాజెక్టులపై 54వ వర్చువల్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర బడ్జెట్‌లో ఒక్క పోలవరం ప్రాజెక్టుకే రూ.

03/20/2018 - 02:34

విజయవాడ, మార్చి 19: రాష్ట్ర ప్రజలు సంఘటిత శక్తిగా మారాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపిచ్చారు. ‘నాకు అండగా ఉండాలి, మీ సహకారం లభించాలి’ అని కోరారు. ‘మీ ఆశీస్సులతో ఎంతటి కార్యాన్నైనా సాధించే శక్తి నాకుంది. వ్యక్తిగా కాకుండా వ్యవస్థగా పోరాటం చేసినప్పుడే ఫలితాలు సిద్ధిస్తాయి’ అని అన్నారు. ప్రతిఒక్కరూ ఉద్యమ స్ఫూర్తితో పోరాటానికి సంఘీభావం తెలపాలని కోరారు.

03/20/2018 - 02:30

గుంటూరు, మార్చి 19: గత సార్వత్రిక ఎన్నికల్లో తిరుపతిలో జరిగిన సభలో వెంకన్న సాక్షిగా నరేంద్ర మోదీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి, నేడు పెదవి విప్పకపోవడం 5 కోట్ల మంది ఆంధ్రులను అవమానించడమేనని రాష్ట్ర సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనందబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

03/20/2018 - 02:29

విజయవాడ, మార్చి 19: నవ్యాంధ్ర జీవనాడి పోలవరం ప్రాజెక్టు పనుల్లో అవకతవకలకు తావేలేదని, రెండ్రోజుల క్రితం ఢిల్లీ నుంచి వచ్చిన నిపుణుల కమిటీ కూడా ఇదే స్పష్టం చేసిందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. వెలగపూడి సచివాలయంలోని నాలుగో బ్లాక్ పబ్లిసిటీ సెల్‌లో సోమవారం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

03/20/2018 - 04:24

విజయవాడ: ప్రత్యేక హోదా మలిదశ ఉద్యమాన్ని రాజకీయాలకు అతీతంగా దేశవ్యాప్తంగా హోరెత్తేలా నిర్మిద్దామని, ఢిల్లీకి పెద్ద షాక్‌గా ఆ ఉద్యమం నిలవాలని ఏపీ ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి రాష్ట్ర నేత, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు. ఏపీ ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి ఆధ్వర్యాన విజయవాడలో సోమవారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.

03/20/2018 - 03:00

విజయవాడ, మార్చి 19: ప్రాథమిక విద్య దేశమంతటా మాతృభాషలోనే కొనసాగాలని, వివిధ జాతీయ స్థాయి పోటీ పరీక్షలన్నీ ‘నీట్’ తరహాలో ఆంగ్లంతో పాటు భారతీయ భాషల్లో నిర్వహించాలని, పాలనా వ్యవహారాలన్నీ మాతృభాషలోనే కొనసాగాలని, న్యాయ వ్యవహారాలు, వాదనలు, తీర్పులు సైతం మాతృభాషలోనే ఉండాల్సిన అవసరం ఉందని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) అభిప్రాయపడింది.

Pages