S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

02/19/2018 - 05:40

ఒంటిమిట్ట, ఫిబ్రవరి 18: కడప జిల్లా ఒంటిమిట్ట చెరువులో ఆదివారం ఐదు మృతదేహాలు బయటపడ్డాయి. మృతులంతా పురుషులే కావడం గమనార్హం. వీరి ఒంటిపై లుంగీలు, చొక్కాలే ఉన్నాయి. సాయంత్రం వరకు మృతదేహాల కోసం ఎవరూ రాలేదు. వీరంతా తమిళనాడుకు చెందిన ఎర్రచందనం కూలీలా? లేక వ్యవసాయ పనులకు వెళ్లే కూలీలా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విషయం తెలియగానే రంగంలోకి దిగిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేశారు.

02/18/2018 - 03:00

అమరావతి, ఫిబ్రవరి 17: మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరి పరిథిలో వారుండాలని టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబునాయుడు ఆదేశించారు. వైసీపీ మూలంగా రాష్ట్రంలో ఎదురవుతున్న సమస్యలను గ్రామ స్థాయిలో ప్రచారం చేయడంతోపాటు, ప్రభుత్వ పథకాలకు విస్తృత ప్రచారం కల్పించాలని సూచించారు. శనివారం శ్రీకాకుళం, విజయనగరం జిల్లా పార్టీ నేతలతో ఆయన సమీక్ష నిర్వహించారు.

02/18/2018 - 02:58

అమరావతి, ఫిబ్రవరి 17: బహిరంగంగా అవినీతికి పాల్పడి నేరం చేస్తూ దోషిగా దొరికి కూడా నిస్సిగ్గుగా ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగటం వైఎస్ జగన్ అనైతిక రాజకీయాలకు పరాకాష్ట అని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, హౌసింగ్ బోర్డు చైర్మన్ వర్ల రామయ్య అన్నారు.

02/18/2018 - 03:48

అమరావతి: రానున్న రాజ్యసభ ఎన్నికలకు టీడీపీలో ఇప్పటి నుంచే వేడి మొదలయింది. సాంకేతికంగా పార్టీకి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉంది. అయితే, మరో ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు త్వరలో టీడీపీలో చేరే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే మూడోసీటు కూడా టీడీపీ ఖాతాలో కలవడం ఖాయంగా కనిపిస్తోంది. దీనితో రాజ్యసభ సీట్ల కోసం కోసం భారీ స్థాయిలోనే పోటీ నెలకొంది. ఈనెలాఖరుకు రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది.

02/18/2018 - 02:53

అమరావతి, ఫిబ్రవరి 17: జనసేన అధినేత పవన్ కల్యాణ్ కోరికను ప్రభుత్వం నెరవేర్చింది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చిన నిధుల వివరాలు, ఇవ్వాల్సినవి, ఇచ్చిన నిధులకు చేసిన ఖర్చుల వివరాలు ఇవ్వాలని పవన్ డిమాండ్ చేశారు. దానికి స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం 118 పేజీలతో కూడిన ఓ నివేదికను తన దూత ద్వారా జేఎస్పీ కార్యాలయానికి పంపించింది. అయితే ఆ సమయంలో ఆయన లేకపోవడంతో అక్కడి పార్టీ బాధ్యుడికి అందించింది.

02/18/2018 - 02:52

విజయవాడ, ఫిబ్రవరి 17: తెలంగాణా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుకు ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు శనివారం ఫోన్ ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవల కేసీఆర్ కంటికి ఆపరేషన్ చేయించుకోటంతో ఆ విషయమై కూడా బాబు వాకబు చేశారు.

02/18/2018 - 02:51

విజయవాడ, ఫిబ్రవరి 17: గన్నవరం విమానాశ్రయం విస్తరణ కోసం ఏలూరు కాలువ మళ్లింపు నిమిత్తం భూములు ఇచ్చిన రైతులకు సీఆర్‌డీఏ పరిధిలో ప్లాట్స్ ఇచ్చేవిధంగా తగు ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి.

02/18/2018 - 02:50

అమరావతి, ఫిబ్రవరి 17: ఆర్థిక వృద్ధిరేటుకు అనుగుణంగా ప్రజల జీవన ప్రమాణాలు పెరిగే విధంగా ప్రభుత్వ పథకాలను అమలు చేయాలని రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అధికారులకు సూచించారు. శనివారం 2017-18కు సంబంధించిన సామాజిక ఆర్థిక సర్వే తయారీపై ప్రణాళిక శాఖ అధికారులతో తన నివాసంలో సమీక్ష నిర్వహించారు.

02/18/2018 - 03:47

అమరావతి: ప్రైవేట్ విద్యుత్ ఉత్పత్తి సంస్థలతో రాష్ట్రంలోని విద్యుత్ సంస్థలు చేసుకున్న ఒప్పందాలకు సంబంధించిన చెల్లింపులపై ఏపీ ట్రాన్స్‌కో, ఏపీ విద్యుత్ పంపిణీ సంస్థలు కొనసాగించిన న్యాయపోరాటం ఫలితంగా రాష్ట్ర ప్రజలపై దాదాపు రూ.4వేల కోట్ల విద్యుత్ ఛార్జీల అదనపు భారం తప్పినట్లయింది.

02/18/2018 - 02:46

విజయవాడ, ఫిబ్రవరి 17: ఆంధ్ర రాష్ట్రంలో బీజేపీ ఇంకా ఎంతో ఎత్తుకు ఎదుగుతుందనుకోవడం అత్యాశేనని టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు ఓ ప్రకటనలో ఎద్దేవా చేశారు. బీజేపీ ఒంటరిగా ఎన్నికల్లో ఎప్పుడూ గెలవలేదన్నారు. 2009లో లోక్‌సభకు సోము వీర్రాజు పోటీ చేస్తే 7 వేల ఓట్లే వచ్చాయని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఏపీకి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించిన ప్యాకేజీలో ఒక్క రూపాయి కూడా రాలేదని ఆరోపించారు.

Pages