S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

02/18/2018 - 02:44

విజయవాడ, ఫిబ్రవరి 17: టెక్నికల్ సర్ట్ఫికెట్ కోర్స్ (టీసీసీ) పరీక్షలు ఈ నెల 26 నుంచి మార్చి 1 వరకు నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ విఎస్ భార్గవ తెలిపారు. డ్రాయింగ్, హ్యాండ్లూమ్, వీవింగ్ అండ్ టైలరింగ్, ఎంబ్రాయిడరీలో లోయర్, హయ్యర్ గ్రేడ్‌లలో ఈ పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు.

02/18/2018 - 02:43

విజయవాడ, ఫిబ్రవరి 17: విజయవాడ, గుంటూరు జిల్లాలతో పాటు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న రమేష్ హాస్పిటల్‌కు జాతీయ స్థాయి అవార్డు దక్కింది. అసోసియేషన్ ఆఫ్ హెల్త్‌కేర్ ప్రొవైడర్స్ ఇండియా సంస్థ ‘పేషెంట్ ఫ్రెండ్లీ’ విభాగంలో రమేష్ హాస్పిటల్స్‌కు ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని ప్రకటించింది.

02/18/2018 - 02:43

విశాఖపట్నం, ఫిబ్రవరి 17: ఆంధ్రప్రదేశ్ స్పీకర్ కోడెల శివప్రసాద్ వ్యవహార శైలి రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని, అధికార పార్టీకి, ప్రభుత్వానికి దాసోహం అన్న రీతిలో స్పీకర్ పనిచేస్తున్నారంటూ వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి ధ్వజమెత్తారు.

02/18/2018 - 02:38

గుంటూరు/నరసరావుపేట, ఫిబ్రవరి 17: రాష్ట్ర విభజన హామీలు అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపైనే ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. తెలుగుజాతికి అన్యాయం జరిగితే ఎలాంటి త్యాగానికైనా సిద్ధమేనన్నారు. రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన నిధులపై చర్చకు సిద్ధమేనన్నారు.

02/18/2018 - 02:36

ఖమ్మం, ఫిబ్రవరి 17: కేంద్ర, రాష్ట్రాలలో పాలకులు అనుసరిస్తున్న విధానాలకు వామపక్షాల ఐక్య ఉద్యమాలతో పాతర వేయాలని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లా సీపీఐ మహాసభల్లో భాగంగా శనివారం ఖమ్మంలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ వామపక్షాలు సమైక్యంగా సమన్వయంతో ఉద్యమించి బీజేపీ, సంగ్ పరివార్ లాంటి వాటిని తరిమివేయాల్సిన అవసరం ఉందన్నారు.

02/18/2018 - 02:35

శ్రీకాకుళం, ఫిబ్రవరి 17: టీడీపీ ప్రభుత్వంపై బీజేపీ ఎమ్మెల్సీ, ఫైర్‌బ్రాండ్ సోమువీర్రాజు మరోసారి మండిపడ్డారు. రాష్ట్రంలో వెనుకబడిన ఏడు జిల్లాల్లో పరిశ్రమల ఏర్పాటుకు కేంద్రం 30 శాతం రాయితీ ఇచ్చినప్పటికీ, ఆ జిల్లాల్లో ముఖ్యమంత్రి ఎన్ని పరిశ్రమలు నెలకొల్పిందీ కేంద్ర ప్రభుత్వానికి సంజాయిషీ చెప్పి, బ్లూప్రింట్ విడుదల చేయాలని డిమాండ్ చేసారు. శనివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు.

02/18/2018 - 02:35

రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 17: జెఎఫ్‌సి ఆధ్వర్యంలో ఆదివారం రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించనున్నట్టు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ చెప్పారు. ప్రత్యేక హోదా కోసం జెఎఫ్‌సీ ఆధ్వర్యంలో హస్తినలోనే యుద్ధరంగమన్నారు. రాజమహేంద్రవరంలో సీపీఐ జిల్లా మహాసభల నేపధ్యంలో రాజమహేంద్రవరం వచ్చిన ఆయన శనివారం విలేఖరుల సమావేశంలో మాట్లాడారు.

02/18/2018 - 02:34

కర్నూలు ఓల్డ్‌సిటీ, ఫిబ్రవరి 17: రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేసేంత వరకు పోరాటం ఉద్ధృతం చేయాలని రాయలసీమ హైకోర్టు సాధన సమితి జేఏసీ తీర్మానించింది. శనివారం కర్నూలులో జరిగిన జేఏసీ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. సీమలో హైకోర్టు ఏర్పాటు చేసేంతవరకు కోర్టు విధులను మార్చి 9 వరకు బహిష్కరించాలని నిర్ణయించారు. అదే విధంగా ర్యాలీలు, రిలే నిరహారదీక్షలు కొనసాగించాలని తీర్మానించారు.

02/18/2018 - 02:34

రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 17: పశ్చిమ గోదావరి జిల్లా గుండుగొలను-కొవ్వూరు రోడ్డు భారీ వాహనాలతో అధ్వాన్నంగా తయారు కావడంతో నిత్యం ఏదో ప్రమాదం జరుగుతూ రక్తమోడుతోంది. నెలకు సుమారు 25 ప్రాణాల వరకు ఈ రోడ్డుపై జరిగే ప్రమాదాల్లో చనిపోతున్నారు. దీంతో ప్రజలు రోజుల తరబడి రహదారిని దిగ్బంధిస్తూ ఆందోళనకు దిగడం, సమస్యను పరిష్కరించడం అధికార యంత్రాంగానికి తలకుమించిన భారంగా మారింది.

02/18/2018 - 02:33

రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 17: తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం శివారు లాలాచెరువులో శనివారం ఒక చెప్పుల గోదాములో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ సంఘటనలో సుమారు రూ. కోటిన్నరకు విలువైన చెప్పులు దగ్ధమైనట్లు అంచనా వేస్తున్నారు. రెండతుస్థుల గోదాము పైభాగంలో షెడ్డు వేసేందుకు ఇనుప రాడ్లు వెల్డింగ్ చేస్తుండగా ప్రమాదవశాత్తూ నిప్పురవ్వలు ఎగిసి మంటలు వ్యాపించినట్లు భావిస్తున్నారు.

Pages