S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

02/16/2018 - 03:51

బెల్లంకొండ, ఫిబ్రవరి 15: గుంటూరు జిల్లా బెల్లంకొండ మండలం కందిపాడు గ్రామంలో జ్వరం మాత్ర గొంతులో ఇరుక్కుని మూడేళ్ల బాలుడు మృతిచెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... తిరుమళ్ల పైడిరాజు, మారమ్మల పెద్ద కుమారుడు సారరాజు గత రెండు రోజుల నుంచి జ్వరంతో బాధపడుతున్నాడు. గురువారం ఉదయం వైద్యులు ఇచ్చిన మాత్రను మింగించే క్రమంలో జ్వరం మాత్ర సారరాజు నోట్లో వేయగా గొంతులో ఇరుక్కున్నట్లు తెలిపారు.

02/16/2018 - 03:49

విజయవాడ, ఫిబ్రవరి 15: వివిధ శాఖల బడ్జెట్ ప్రతిపాదనలపై రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు సానుకూలంగా స్పందించారు. డ్వాక్రా మహిళలకు రెండు వేల రూపాయల చెల్లింపు, ఐటీఐ విద్యార్థులకు ఉద్యోగ భరోసా, కొత్త బస్సుల కొనుగోలు వంటి ప్రతిపాదనలకు ఆయన ఆమోదం తెలిపారు. ప్రజల సంతృప్తి స్థాయి పెంచే విధంగా సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని యనమల తెలిపారు.

02/16/2018 - 03:46

అమరావతి, ఫిబ్రవరి 15: గ్రామీణ ప్రజల తలసరి ఆదాయం పెరిగే విధంగా బడ్జెట్ రూపొందించాలని అధికారులకు ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు సూచించారు. సచివాలయంలో గురువారం ఉదయం వ్యవసాయం దాని అనుబంధ శాఖలు, మార్కెటింగ్, పశుసంవర్ధక, సహకార శాఖలు, మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖల బడ్జెట్ ప్రతిపాదనలను మంత్రి సమీక్షించారు.

02/16/2018 - 03:45

మంగళగిరి, ఫిబ్రవరి 15: సంక్షోభం కూరుకుపోయిన చేనేత పరిశ్రమను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోకుంటే మనుగడ కష్టమేనని హిందూపురం ఎంపీ, టీడీపీ చేనేత విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నిమ్మల కిష్టప్ప అన్నారు. గురువారం గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలోని మార్కండేయ కల్యాణ మండపంలో జరిగిన టీడీపీ చేనేత విభాగం రాష్ట్ర ప్రతినిధుల సమావేశానికి ఆయన అధ్యక్షత వహించి మాట్లాడారు.

02/16/2018 - 03:44

కొత్తగూడెం, ఫిబ్రవరి 15: ఆంధ్ర, తెలంగాణా రాష్ట్రాలకు విస్తరించి ఉన్న సుబాబుల్, జామాయిల్ రైతాంగం నిర్వహించనున్న ఆందోళన కార్యక్రమానికి రాజకీయ పార్టీల దూరమవుతున్నాయి. సుబాబుల్, జామాయిల్ రైతులకు మద్దతు ధర కల్పించేందుకు అవసరమైన ఏర్పాట్లను 15 రోజుల్లో నిర్ణయిస్తామని రాష్ట్ర మంత్రివర్గ ఉప సంఘం నిర్ణయించింది.

02/16/2018 - 03:44

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15: కాపులను బీసీ జాబితాలో చేర్చి రిజర్వేషన్లు కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై వెనకబడిన సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈమేరకు ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబడుతూ రాష్టప్రతి రామ్‌నాధ్ కోవింద్‌కు పలు బిసీ సంఘాలు ఫిర్యాదు చేశాయి. గురువారం నాడు ఏపీలోని పలు బీసీ సంఘాలు రాష్టపతి రామ్‌నాధ్ కోవింద్, కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో సమావేశమయ్యాయి.

02/16/2018 - 03:43

విజయవాడ (కార్పొరేషన్), ఫిబ్రవరి 15: జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ అధ్యక్షతన ఏర్పాటైన జేఎఫ్‌సీ (జాయింట్ ఫ్యాక్ట్స్ ఫైండింగ్ కమిటీ) సమావేశానికి కాంగ్రెస్ పార్టీ నేతలు హాజరుకానున్నారు.

02/16/2018 - 03:43

విజయవాడ, ఫిబ్రవరి 15: విజయవాడలోని ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ సీట్లను వంద నుంచి 150కి అలాగే ఎంఎస్ జనరల్ సర్జరీ కోర్సులో అదనంగా నాలుగు పీజీ సీట్లను పెంచుతూ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి.

02/16/2018 - 03:42

విజయవాడ, ఫిబ్రవరి 15: ఉపాధి హామీ పథకం కింద చేపడుతున్న పనుల్లో నాణ్యత, కచ్చితత్వం పెంపొందించేందుకు గ్రామాలకూ జీఐఎస్ ఆధారిత థీమాటిక్ మ్యాప్‌లు తయారు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. 1521 గ్రామాలకు సంబంధించి జీఐఎస్ మ్యాప్‌లను తయారు చేసేందుకు వీలుగా ఏపీ స్పేస్ అప్లికేషన్ సెంటర్‌తో పంచాయితీరాజ్ శాఖ గురువారం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు 1.59 కోట్ల రూపాయలను కేటాయించింది.

02/16/2018 - 03:41

విజయవాడ, ఫిబ్రవరి 15: పలువురు డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. అనంతపురం జెసి-2 సయ్యద్ ఖాజా మోహిద్దీన్‌ను శాసన మండలి చైర్మన్ ఓఎస్డీగా, ముడ కార్యదర్శి సుబ్బరాజును అనంతపురం జెసి-2గా బదిలీ చేసింది.

Pages