S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

07/05/2016 - 18:08

ఏలూరు: తణుకు సమీపాన సజ్జాపురం వద్ద గోస్తని నదిలో తల్లీకూతుళ్ల మృతదేహాలను మంగళవారం స్థానికులు కనుగొన్నారు. మృతులను లక్ష్మీనరసమ్మ (32), ఆమె కుమార్తె లాస్య (7)గా గుర్తించారు. ఈ ఇద్దరూ ఆదివారం నుంచి కనిపించడం లేదు. కుటుంబ కలహాల వల్లే కుమార్తెతో పాటు కాల్వలోకి దూకి తల్లి నరసమ్మ ఆత్మహత్య చేసుకుందని స్థానికులు అనుమానిస్తున్నారు.

07/05/2016 - 18:07

కర్నూలు: అవినీతి, అక్రమ సంపాదనతో కోట్లకు పడగలెత్తిన వైకాపా అధినేత వైఎస్ జగన్ రాష్ట్భ్రావృద్ధిని అడ్డుకుంటున్నారని మంత్రి పల్లె రఘునాథరెడ్డి మంగళవారం ఇక్కడ మీడియాతో అన్నారు. జగన్ వైఖరి నచ్చకే ఆయన పార్టీ ఎమ్మెల్యేలు టిడిపిలో చేరుతున్నారన్నారు. ‘గడప గడపకూ వైకాపా’ కార్యక్రమానికి బదులు గడప గడపకూ వెళ్లి జగన్ క్షమాపణలు చెప్పుకోవాలన్నారు.

07/05/2016 - 17:42

నెల్లూరు : ఏఎస్‌పేట పరిధిలోని పలు కాలనీలలో పిచ్చికుక్క గతరాత్రి నుంచి ఇప్పటివరకు 23 మందిని గాయపర్చింది. ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు రావాలంటే భయపడుతున్నారు. క్షతగాత్రులను ఆత్మకూరు ప్రబుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

07/05/2016 - 17:20

తిరుపతి : తిరుపతి శివారులోని మంగళం అటవీ ప్రాంతంలో టాస్క్ఫోర్స్ పోలీసులు మంగళవారం కూంబింగ్ నిర్వహించారు. ఆ విషయాన్ని గమనించిన ఎర్రచందనం కూలీలు పరారైయ్యారు. 14 ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కూలీల కోసం టాస్క్ఫోర్స్ పోలీసులు గాలింపు చర్యలను చేపట్టారు.

07/05/2016 - 17:17

తూర్పుగోదావరి: కోరుకొండ మండలం దోసకాయలపల్లిలో పోలీసులు గంజాయి తరలిస్తున్న నలుగురిని మంగళవారం అరెస్ట్ చేశారు. రూ. 2.28 లక్షల విలువ చేసే గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

07/05/2016 - 17:15

కడప : అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ పార్తీబన్ కందస్వామిని, ముగ్గురు తమిళ కూలీలను మంగళవారం అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి నుంచి 21 ఎర్రచందనం దుంగలతో పాటు ఓ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.

07/05/2016 - 16:25

హైదరాబాద్: గుంటూరు జిల్లా న్యాయమూర్తిగా సి.సుమలత, కృష్ణా జిల్లా న్యాయమూర్తిగా వై.లక్ష్మణరావు, కర్నూలు జిల్లా న్యాయమూర్తిగా జి.అనుపమ చక్రవర్తి, నెల్లూరు జిల్లా న్యాయమూర్తిగా మౌలానా జునైద్ అహ్మద్, కడప జిల్లా న్యాయమూర్తిగా జి.సునీత, విశాఖ సీబీఐ కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎస్‌.శశిధర్‌రెడ్డిని నియమించారు.

07/05/2016 - 15:37

విజయవాడ: తప్పుడు కథనాలను ప్రచురించారన్న అభియోగంపై రాజమండ్రి పోలీసులు సాక్షి పత్రికపై కేసులు నమోదు చేశారని సమాచారం. కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ఇటీవల ఆమరణ దీక్ష చేసినపుడు ఆయన ఆరోగ్యం గురించి రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు విడుదల చేసిన హెల్త్ బులెటిన్లకు భిన్నంగా సాక్షిలో వార్తలు రాశారన్న ఫిర్యాదులపై పోలీసులు కేసు నమోదు చేశారు.

07/05/2016 - 13:53

విజయవాడ : ఉద్యోగుల సౌకర్యార్థం ప్రవేశపెట్టిన సికిం ద్రాబాద్‌ - విజయవాడ ఇంటర్‌సిటీ ( నెంబర్‌ 12796 ) ఎక్స్‌ప్రెస్‌ రైలు వేళలను దక్షిణ మధ్య రైల్వే స్వల్పంగా మార్పు చేసింది. ఉదయం 5.30 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరే రైలు 10.08 గం టలకు గుంటూరు వచ్చి 10.10 గంటలకు విజయవాడ బయలుదేరి వెళుతోన్నది.

07/05/2016 - 11:58

శ్రీకాకుళం: పొందూరు మండలంలోని పలు గ్రామాల్లో మంగళవారం తెల్లవారుజామున భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. స్వల్ప వ్యవధిలో రెండు సార్లు భూమి కొన్ని సెకన్లపాటు కంపించడంతో ప్రజలు భయాందోళనలకు లోనై ఇళ్లనుంచి బయటకు పరుగులు తీశారు. ఇళ్లలోని సామగ్రి కింద పడినట్లు పలువురు తెలిపారు. కాగా, నెలరోజుల వ్యవధిలో భూమి కంపించడం ఇది మూడోసారి కావడం గమనార్హం.

Pages