S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

02/15/2018 - 06:45

అమరావతి, ఫిబ్రవరి 14: ఎంపీల రాజీనామాలపై వైసీపీ అధ్యక్షుడు జగన్ డ్రామాలు ప్రజలకు చెప్పాలని టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నేతలను ఆదేశించారు. కేంద్రమంత్రులు ప్రభుత్వం నుంచి బయటకు రావడం నిమిషాల మీద పని అన్నారు. అవసరమైతే అంతకంటే పెద్ద నిర్ణయమే తీసుకుందామన్నారు. ఎంపీల రాజీనామాలపై ఇప్పటికి మూడుసార్లు మాట మార్చిన జగన్ పార్టీ అసలు ఎత్తుగడను ప్రచారం చేయాలని సూచించారు.

02/15/2018 - 06:52

అమరావతి, ఫిబ్రవరి 14: జాతీయ ప్రాజెక్టైన పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటి వరకూ 12వేల 910 కోట్ల్లు ఖర్చు చేసి 53 శాతం పనులు పూర్తి చేశామని రాష్ట్ర జలవనరుల మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వెల్లడించారు. ఈమేరకు బుధవారం వెలగపూడి సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ ప్రాజెక్టు వివరాలు ప్రత్యేక వెబ్‌సైట్లో పొందుపర్చామని, వివరాలను ఎవరైనా తెలుసుకోవచ్చన్నారు.

02/15/2018 - 06:35

అమరావతి, ఫిబ్రవరి 14: రాజధాని నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని, చేపట్టిన ప్రతి పనిని నిర్ణీత కాల వ్యవధిలో పూర్తి చేసేలా నిర్మాణ సంస్థలను నిరంతరం పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. గృహ నిర్మాణం, రహదారులు, ఇతర వౌలిక సదుపాయాల ప్రాజెక్టులు సకాలంలో పూర్తి చేయడంలో ఎవరైనా విఫలమైతే ఉపేక్షించేది లేదన్నా రు.

02/14/2018 - 05:27

అమరావతి, ఫిబ్రవరి 13: సాంకేతిక పరిజ్ఞానం, ముందుచూపులో మిమ్మల్ని చూసి ప్రపంచం గర్విస్తోందని సీఎం చంద్రబాబును రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ అభినందించారు. రాష్ట్రంలో వ్యవసాయం, విద్య, వైద్యరంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. మంగళవారం సాయంత్రం సీఎం చంద్రబాబుతో ముఖేష్ అంబానీ భేటీ అయ్యారు.

02/14/2018 - 05:25

విజయవాడ, ఫిబ్రవరి 13: వివిధ ప్రభుత్వ శాఖల నుంచి సేవలు పొందటానికై బ్రిటీష్‌కాలం నుంచీ ఆయా శాఖల ఖాతాలకు సబ్ ట్రెజరీ కార్యాలయం, ఆపై అనుబంధ స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి చెలాన్‌ల రూపంలోనే చెల్లించాల్సి వచ్చేది. ఇక పాత విధానానికి ప్రభుత్వం మంగళం పాడింది. కొద్దిరోజుల్లో సరికొత్త విధానం అమల్లోకి రానుంది.

02/14/2018 - 05:23

విజయవాడ, ఫిబ్రవరి 13: ఆంధ్రప్రదేశ్‌లో మరో రెండు పారిశ్రామిక పార్కులు ఏర్పడనున్నాయి. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ)ను ప్రోత్సహించే దిశగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రూ.66 కోట్ల విలువ చేసే ఐదు ప్రాజెక్టులకు కేంద్రం నుంచి సూత్రప్రాయ అంగీకారం లభించింది. ఆయా ప్రాజెక్టులకు కేంద్రం రూ.36.86 కోట్లు ఇస్తుంది.

02/14/2018 - 05:21

నెల్లూరు, ఫిబ్రవరి 13: రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం మార్చి 5 నుంచి పార్లమెంట్ సమావేశాల్లో ప్రణాళికాబద్ధంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. అప్పటికీ కేంద్రం దిగిరాకుంటే ఏప్రిల్ 6న వైకాపా ఎంపీలు రాజీనామాలు చేస్తారని హెచ్చరించారు.

02/14/2018 - 00:52

రాజవొమ్మంగి, ఫిబ్రవరి 13: వాహనం అందుబాటులో లేకపోవడంతో అనారోగ్యంతో మరణించిన వ్యక్తి మృతదేహాన్ని బైక్‌పై ఇద్దరు వ్యక్తుల నడుమ ఉంచి తరలించిన విషాద ఘటన ఇది. తూర్పు గోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతంలోని వట్టిగెడ్డ గ్రామంలో మంగళవారం ఈ హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. వివరాలిలావున్నాయి..

02/13/2018 - 04:48

విజయవాడ, ఫిబ్రవరి 12: రాష్ట్ర విభజన చట్టంలోని ప్రతి ఒక్క అంశాన్ని కూడా దశలవారీగా తుచ తప్పక కార్యాచరణలోకి తీసుకురావటానికి ప్రయత్నిస్తున్న నేపథ్యంలో టీడీపీకి చెందిన కేంద్ర, రాష్ట్ర మంత్రులతోపాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు మిత్రధర్మాన్ని విస్మరించి ఎవరికి తోచిన విధంగా వారు మాట్లాడుతున్నారంటూ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జమ్ముల శ్యాంకిషోర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

02/13/2018 - 04:47

విజయవాడ, ఫిబ్రవరి 12: ఆధార్ కార్డు వివరాలపై గోప్యతపై చర్చ జరుగుతున్న సమయంలో, ఆధార్ కార్డును గత ఆరు నెలల్లో ఎక్కడ ఉపయోగించారో తెలుసుకునే సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. దీంతో ఆధార్ కార్డు దుర్వినియోగంపై ఆయా కార్డు యజమానులు నిఘా ఉంచే వీలు కలిగింది. యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(యుఐడీఏఐ) అందచేస్తున్న ఈ సౌకర్యాన్ని గూగుల్ సెర్చ్ ద్వారా సులువుగా యాక్సెస్ చేయవచ్చు.

Pages