S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

02/04/2018 - 03:46

రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 3: కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని విభజించి అన్యాయం చేస్తే..ఆదుకుంటామని హామీలిచ్చిన బీజేపీ మోసం చేసిందని, తెలుగు రాష్ట్రానికి మొత్తం మీద కుడి ఎడమల దగా జరిగిందని, ఇది తెలుగువారి ఆత్మగౌరవానికి జరిగిన అవమానమని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి కేంద్రం వైఖరిపై నిప్పులు చెరిగారు.

02/04/2018 - 03:45

ఒంగోలు,్ఫబ్రవరి 3:ఆంధ్రప్రదేశ్‌కు పోలవరం ప్రాజెక్టు జీవనాడని అలాంటి ప్రాజెక్టును కేంద్రప్రభుత్వమే వందశాతమే పూర్తిచేస్తుందని ఎమ్మెల్సీ సోము వీర్రాజు స్పష్టం చేశారు. ఇప్పటివరకు ఈప్రాజెక్టుకు 4300కోట్లరూపాయల నిధులు కేంద్రప్రభుత్వం మంజూరు చేసిందని ఆ నిధులకు సంబంధించిన పనులు ఎంత చేశారో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

02/04/2018 - 03:44

విజయవాడ, ఫిబ్రవరి 3: అగ్రిగోల్డ్ సంస్థ చేసిన మోసం కారణంగా ఆత్మహత్యలు, అసహజ మరణాలపాలైన వారికి ఒక్కొక్కరికి ప్రభుత్వం రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియాను ఈనెల 12వ తేదీన ఇవ్వాలని శుక్రవారం జరిగిన మంత్రిమండలి సమావేశంలో ఆమోదించడం పట్ల అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు హర్షం వ్యక్తం చేశారు.

02/04/2018 - 03:43

విజయవాడ, ఫిబ్రవరి 3: ప్రజా వ్యతిరేక కేంద్ర బడ్జెట్, అందులో రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 8న రాష్ట్ర బంద్ నిర్వహించాలని సీపీఎం రాష్ట్ర కార్యాలయంలో శనివారం జరిగిన వామపక్ష పార్టీల సమావేశం నిర్ణయించింది. సీపీఐ (ఎంఎల్) లిబరేషన్ రాష్ట్ర నాయకుడు డీ హరినాథ్ అధ్యక్షతన సమావేశం జరిగింది. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్, అనంతరం పరిణామాల్ని ఈ సమావేశం సమీక్షించింది.

02/04/2018 - 03:43

అమరావతి, ఫిబ్రవరి 3: కేంద్రంలో కొనసాగడం వల్ల అవమానాలు కొనసాగడమే తప్ప, నయాపైసా ఉపయోగం లేదని టీడీపీ ఎంపీలు స్పష్టం చేస్తున్నారు. అదే వైఖరిని తమ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఎదుట వ్యక్తీకరించేందుకు సిద్ధమవుతున్నారు. ఆదివారం బాబుతో జరగనున్న ఎంపీల భేటీలో కేంద్రం తీరుపై గళం విప్పేందుకు సిద్ధమవుతున్నారు.

02/04/2018 - 03:42

విజయవాడ, ఫిబ్రవరి 3: కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టిన 2018-19 వార్షిక బడ్జెట్ వ్యవసాయం, గ్రామీణాభివృద్ధికి ఊతం ఇచ్చేదిగా ఉందని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు పూడి తిరుపతిరావు పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం ఉదయం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీజేపీ 2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చేనాటికి దేశంలో రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందన్నారు.

02/04/2018 - 03:41

విశాఖపట్నం, ఫిబ్రవరి 3: యువతకు మార్గదర్శకం లభిస్తే యువ పారిశ్రామిక వేత్తలకు నెలవుగా భారత్ రూపుదిద్దుకుంటుందని బోస్టన్‌లోని నార్త్ ఈస్ట్రన్ యూనివర్శిటీ అంతర్జాతీయ విభాగం ప్రొఫెసర్ గ్రెగరీ కొల్లియర్ అభిప్రాయపడ్డారు. విశాఖ గీతం డీమ్డ్ యూనివర్శిటీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ ఆధ్వర్యంలో ‘బిజినెస్ మోడల్ ఇన్నోవేషన్’ అంశంపై శనివారం జరిగిన కార్యక్రమంలో ఆయన కీలక ప్రసంగం చేశారు.

02/04/2018 - 03:38

మచిలీపట్నం, ఫిబ్రవరి 3: బడ్జెట్ కేటాయింపుల్లో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై ఎన్డీఎ భాగస్వామ్య పక్షాలతో కలిసి కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తామని రాష్ట్ర న్యాయ, క్రీడ, యువజన సంక్షేమ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు.

02/04/2018 - 03:37

రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 3: జనసేన పార్టీ స్థాపించి నాలుగు సంవత్సరాలు పూర్తయినప్పటికీ ఆ పార్టీకి పటిష్టమైన కమిటీ లేకపోవడంతో ఆదిలోనే ఆ పార్టీ అభాసుపాలవుతోంది. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు తెలుగు రాష్ట్రాల్లో కమిటీ లేకపోవడం వల్ల నాయకత్వ లోపం కొట్టొచ్చినట్టు కనబడుతోంది. ఈ క్రమంలో ఎవరికి వారే తామేనంటూ జనసేన కార్యకర్తలుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

02/04/2018 - 03:35

ఒంగోలు,్ఫబ్రవరి 3: రామాయపట్నం పోర్టుకు చంద్రగ్రహణం పట్టిందని ఒంగోలు పార్లమెంటుసభ్యులు వైవి సుబ్బారెడ్డి ధ్వజమెత్తారు. జిల్లా అభివృద్ధి వేదిక ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లాకలెక్టరేట్ ఎదుట శనివారం భారీ ధర్నా జరిగింది. ఈ ధర్నాకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన వైవి మాట్లాడుతూ విభజన బిల్లులో దుగరాజపట్నం పోర్టుపెట్టారని, సాంకేతిక కారణాలరీత్యా అది సాధ్యంకాదని కేంద్రప్రభుత్వం తెలిపిందన్నారు.

Pages