S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

01/17/2018 - 04:24

చంద్రగిరి, జనవరి 16: మన సంస్కృతి, సాంప్రదాయాలు భగవంతుడు ఇచ్చిన వరమని, వాటిని మన ఆస్తిగా భావించాలని ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు అన్నారు. సంక్రాంతి సందర్భంగా ఈనెల 13 నుంచి నాలుగు రోజులపాటు తన స్వగ్రామం నారావారి పల్లెలో వేడుకలు జరుపుకుని, మంగళవారం మధ్యాహ్నం టీటీడీ కల్యాణమండపంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో సిఎం మాట్లాడారు.

01/17/2018 - 04:24

అంబాజీపేట, జనవరి 16:సంక్రాంతి పర్వదినాల్లో ఏటేటా కనుమరోజు తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేట మండలం జగ్గన్నతోటలో నిర్వహించే ప్రభల ఉత్సవం మంగళవారం కన్నుల పండువగా సాగింది. మొసలపల్లి పంచాయతీ పరిధిలోని కొబ్బరితోటలో ఏకాదశరుద్రులు కొలువుదీరి భక్తులను ఆనందపరవశులను చేశారు. సుమారు 400 వందల సంవత్సరాల క్రితం నుండి ఈ ప్రభల ఉత్సవానికి ఏంతో పేరుంది.

01/17/2018 - 04:20

చంద్రగిరి, జనవరి 16: ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా చిత్తూరు జిల్లాలో పాదయాత్రలో ఉన్న వైకాపా అధ్యక్షుడు జగన్ సంక్రాంతి సందర్భంగా తన తండ్రి జ్ఞాపకార్థం పెద్దలకు బట్టలు సమర్పించారు. జిల్లాలోని రామచంద్రాపురం మండలం పారకాల్వ గ్రామ సరిహద్దులో ఏర్పాటుచేసిన విడిదిలో రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని వేదిక పైన ఉంచారు.

01/17/2018 - 04:18

వెంకటాచలం, జనవరి 16 : భారతీయ సంస్కృతి, సంప్రదాయాల్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఉపరాష్టప్రతి ముప్పవరపు వెంకయ్యనాయుడు సూచించారు. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం చవటపాళెం పంచాయతీ సరస్వతి నగర్ వద్ద ఉన్న అక్షర విద్యాలయ పాఠశాలలో సోమవారం సంక్రాంతి పర్వదినం సందర్భంగా గోపూజ కార్యక్రమం నిర్వహించారు.

01/17/2018 - 04:16

పార్వతీపురం (రూరల్), జనవరి 16: పార్వతీపురం తూర్పు వీధిలో విషాదం చోటు చేసుకుంది. ఆ వీధికి చెందిన ఓ కుటుంబం రాయగడలోని మజ్జి గౌరమ్మ పూజ కోసం వెళ్లి సమీపంలోని నాగావళి నదిలో దిగిన కుటుంబంలోని నలుగురు గల్లంతు కాగా, అందులో ఒకరు మృతి చెందారు. మరొకరు గల్లంతయ్యారు.మరొకరి పరిస్థితి విషమంగా ఉండగా, స్థానికులు ఒకర్ని కాపాడారు.

01/17/2018 - 04:16

భీమవరం, జనవరి 16: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆక్వా రంగాన్ని భయపెడుతున్న వివిధ రకాల భయంకరమైన వైరస్, యాంటిబయోటిక్స్ నేపధ్యంలో వీటి పై అధ్యయనం చేసేందుకు విదేశీ ఆక్వా శాస్తవ్రేత్తల బృందం నీలి విప్లవ రాజధానిగా పేరొందిన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో మంగళవారం పర్యటించింది.

01/17/2018 - 04:16

అనంతపురం, జనవరి 16: ఫోన్లు, ఇతర మాధ్యమాల ద్వారా అమాయకులకు వలవేసి మట్కాజూదం ఆడిస్తున్న నిర్వాహకులు, బీటర్లపై అనంతపురం జిల్లా పోలీసులు ఉక్కుపాదం మోపారు. ముంబాయి, హుబ్లీ కంపెనీల నెట్‌వర్క్‌ల ద్వారా హవాలా తరహాలో నిర్వహిస్తున్న మట్కా గుట్టును రట్టు చేశారు. మంగళవారం నిందితులను జిల్లా ఎస్పీ జీవీజీ.అశోక్‌కుమార్ మీడియా ఎదుట హాజరు పర్చి వివరాలు వెల్లడించారు.

01/17/2018 - 04:15

సోంపేట, జనవరి 16: శ్రీకాకుళం జిల్లా సోంపేట సామాజిక ఆసుపత్రి ఎదుట మంగళవారం ఒక యువకుడు ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టించింది. పోలీసుల కథనం మేరకు హైదరాబాద్‌కు చెందిన పి.శ్రీకర్ (30) అనే యువకుడు సోంపేట దగ్గుచెరువువీధికి చెందిన యువతిని గత 10 నెలలుగా ప్రేమిస్తున్నాడు. గత రెండు నెలలుగా పెళ్లి విషయమై ఈ ఇద్దరి మధ్య వివాదం నెలకొన్న నేపథ్యంలో వైజాగ్‌లో ఉంటున్న ప్రేమికురాలు సంక్రాంతి కోసం సోంపేట వచ్చింది.

01/17/2018 - 04:15

ఐ పోలవరం, జనవరి 16: సంక్రాంతి పండగకు సరదాగా గడుపుతూ అమ్మమ్మ ఇంటికి వచ్చి తూర్పుగోదావరి జిల్లా ఐ పోలవరం మండలం పశువుల్లంక - సలాదివారిపాలెం గోదావరిలో సోమవారం సాయంత్రం స్నానానికి దిగిన ముగ్గురు యువకులు ప్రవాహ వేగానికి కొట్టుకుపోయి ఇద్దరు మృతి చెందగా, ఒక యువకుడిని స్థానిక మత్స్యకారులు కాపాడారు. దీనికి సంబంధించి ఐ పోలవరం పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

01/15/2018 - 04:02

అమరావతి, జనవరి 14: అది చక్కగా చదును చేసిన పది ఎకరాలకు పైగా ఉన్న సువిశాల స్థలం. ఇంటి ప్రహరీ మాదిరిగా చుట్టూ ఫెన్సింగ్. అందులో ఓ రెండొందల మంది ప్రైవేట్ సైన్యం. ఆ పది ఎకరాల స్థలంలోకి కార్లలో వెళ్లాలంటే దాని ఫీజు అక్షరాలా వంద రూపాయలు! జనం కిక్కు కోసం అక్కడే ఓ తాత్కాలిక వైన్ షాపు!! అక్కడ కొంచెం ఎక్కువ ధరతో చీప్ లిక్కర్ నుంచి కాస్ట్లీ స్కాచ్ వరకూ అందరికీ అందుబాటులో.

Pages