S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

12/15/2017 - 04:42

విశాఖపట్నం, డిసెంబర్ 14: ఏపీకి రైల్వే జోన్ మంజూరు చేసే విషయంపై ప్రధాని మోదీ నిర్ణయం తీసుకుంటారని రైల్వే మంత్రి పీయూష్ గోయల్ అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్‌కు తెలిపారు. ఈ ప్రాంత రైల్వే సమస్యల పరిష్కారం కోరుతూ అవంతి శ్రీనివాస్ రైల్వే మంత్రికి గురువారం ఒక వినతిపత్రాన్ని అందచేశారు. ఈ సందర్భంగా విశాఖ రైల్వే జోన్ అంశం చర్చకు వచ్చింది.

12/15/2017 - 04:40

విశాఖపట్నం, డిసెంబర్ 14: తూర్పు గోదావరి జిల్లా వెంకటాయపాలెంలో 1997లో జరిగిన శిరోముండనం కేసుపై గురువారం తీర్పు వెలువడాల్సి ఉండగా తీర్పుపై హైకోర్టు స్టే ఇవ్వడంతో విశాఖ కోర్టులో విచారణలో ఉన్న ఈ కేసు తదుపరి విచారణ ఈనెల 27కు వాయిదా పడింది. విశాఖలోని ఎస్సీ,ఎస్టీ న్యాయ స్థానం విచారిస్తోంది.

12/15/2017 - 03:50

హైదరాబాద్, డిసెంబర్ 14: విశాఖ జిల్లా వాకపల్లి గ్యాంగ్ రేప్ కేసులో బాధితులకు న్యాయం జరిగే విధంగా విశాఖ ప్రత్యేక కోర్టుకు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను నియమించాలని కోరుతూ వాకపల్లి బాధితులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గిరిజన తెగకు చెందిన 9 మంది మహిళా బాధితులు హైకోర్టులో ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఎస్సీ, ఎస్టీ చట్టం కింద ప్రభుత్వం ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను నియమించేందుకు అధికారం ఉందన్నారు.

12/15/2017 - 03:48

తుగ్గలి, డిసెంబర్ 14: పోలీసు బందోబస్తు మధ్య రాయల కాలం నాటి కోటలో గుప్తనిధుల కోసం అధికారులు తవ్వకాలు జరపడం సంచలనం రేపింది. తవ్వకాలకు పురావస్తుశాఖ, ప్రభుత్వం అనుమతి ఇచ్చిఉంటే చూపాలంచాలని రాజకీయ నాయకులు, ప్రజలు అడ్డుకోవడంతో కొద్దిసేపు గందరగోళం నెలకొంది. తవ్వకాలకు ప్రజలు సహకరించాలని ఆర్డీఓ విజ్ఞప్తి చేయడం గమనార్హం. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం చెన్నంపల్లిలో జరిగిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

12/15/2017 - 03:48

విజయవాడ ( ఇంద్రకీలాద్రి) డిసెంబర్ 14: శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి సన్నిధిలో గురువారం ఉదయం రుత్విక్కులు పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించటంతో అమ్మవారి భవానీదీక్షలు పరిసమాప్తం అయినట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైన భవానీదీక్షల విరమణ కార్యక్రమం ఈనెల 10వ తేదీన అమ్మవారి సన్నిధిలో ప్రారంభమై గురవారం అత్యంత ఘనంగా ముగిసింది.

12/15/2017 - 03:47

నరసన్నపేట, డిసెంబర్ 14: నాలుగేళ్ల సంసారంలో భర్తతో జీవనం సాగించిన తాను కేవలం ఒకే ఒక మాటకు మనస్తాపం చెందిన ఓ వివాహిత ఆత్మహత్య చేసుకోవడమే కాకుండా తన 9 నెలల బిడ్డను చంపడం స్థానికులను కలచివేసింది. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం గొట్టిపల్లిలో నివాసం ఉంటున్న సిహెచ్.కృష్ణప్రసాద్, గౌతమి(26) దంపతులు. అవంతిక, మనోహర్ వీరి పిల్లలు.

12/15/2017 - 03:47

అమరావతి, డిసెంబర్ 14: సమాజం వల్ల లబ్ధి పొందుతున్న సంస్థలు సమాజం రుణం తీర్చుకోవాలని, కార్పొరేట్ సామాజిక బాధ్యతను ప్రతి సంస్థా నిర్వర్తిస్తే అద్భుత ఫలితాలను సాధించవచ్చని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. వైద్యం, వ్యవసాయ రంగాల అభివృద్ధికి కార్పొరేట్ సమాజం స్పందిస్తే తమకు మంచి ఆలోచనలున్నాయని చెప్పారు.

12/15/2017 - 01:27

విజయవాడ (కార్పొరేషన్), డిసెంబర్ 14: ప్రపంచంలో ప్రసిద్ధిచెందిన రాజధాని నగరాల జాబితాలో అమరావతి అగ్రగామి రాజధాని నగరంగా ఉండేలా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేస్తున్న కృషికి ప్రతి ఒక్కరి సహకారం అవసరమని మున్సిపల్‌శాఖ మంత్రి పి.నారాయణ తెలిపారు.

12/14/2017 - 01:32

అమరావతి, డిసెంబర్ 13: హైదరాబాద్‌లో తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈనెల 15 నుంచి నిర్వహిస్తోన్న ప్రపంచ తెలుగు మహాసభలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారిని ఆకర్షిస్తున్నాయి. ఆ సభల విజయవంతం కోసం భాషాభిమాని అయిన తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు స్వయంగా సమీక్షలు నిర్వహిస్తూ, తెలుగు భాషకు పట్టం కట్టిన కవులు, రచయితల పేర్లను వివిధ ప్రాంగణాలకు పెట్టడంలో వ్యక్తిగత శ్రద్ధ వహిస్తున్నారు.

12/14/2017 - 01:32

విజయవాడ, డిసెంబర్ 13: రాష్ట్రంలోని గ్రామాలను వంద శాతం మేర పోషకాహార లోప రహిత గ్రామాలుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ఉద్దేశ్యమని రాష్ట్ర స్ర్తి శిశు సంక్షేమం, సెర్ప్ శాఖ మంత్రి పరిటాల సునీత తెలిపారు. పిల్లలకు ఆటపాటలతో చదువు నేర్పించడమే ప్రీ స్కూల్స్ లక్ష్యమని అన్నారు. వెలగపూడి సచివాలయంలోని తన కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేఖర్ల సమావేశంలో మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణతో కలిసి ఆమె మాట్లాడారు.

Pages