S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

12/14/2017 - 01:05

విశాఖపట్నం, డిసెంబర్ 13: విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేసే విషయంలో ఒడిశా ప్రభుత్వం నుంచి ఎటువంటి అభ్యంతరాలు లేవని, ఆ అంశం ఏదీ తన దృష్టికి రాలేదని రైల్వే బోర్డు చైర్మన్ లొథానీ స్పష్టం చేశారు. కేకే లైన్‌లో కూలిపోయిన బ్రిడ్జిని రికార్డు సమయంలో పునర్నిర్మించారు.

12/14/2017 - 00:39

జయవాడ ( ఇంద్రకీలాద్రి) డిసెంబర్ 13: సీ ప్లేన్‌లు ప్రపంచ మంతా అందుబాటులో ఉన్నాయని, అలాంటి వాటిని ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణా నదిలో తీసుకువచ్చి కొత్తదనానికి శ్రీకారం చుట్టినట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. బుధవారం పున్నమి ఘాట్‌లో ఏర్పాటుచేసిన సీ ప్లేన్ విన్యాసాలను సీఎం చంద్రబాబునాయుడు లాంఛనంగా ప్రారంభించారు.

12/14/2017 - 00:36

రాజమహేంద్రవరం, డిసెంబర్ 13: పోలవరం ప్రాజెక్టు భూసేకరణ వ్యయం తడిసి మోపెడవుతోంది. కొత్త చట్టం ప్రకారం భూసేకరణ ఖర్చు అమాంతం పెరగడంతో ప్రాజెక్టు అంచనా వ్యయం ఇంతలింతలుగా పెరిగిపోయింది. ప్రాజెక్టు ప్రారంభించేటపుడు భూసేకరణ, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీకి సుమారు రూ.2900 కోట్లు ఖర్చవుతుందని అంచనావేశారు. అయితే కొత్త చట్టం ప్రకారం భూసేకరణ, ఆర్ అండ్ ఆర్‌కు సుమారు రూ.36వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా.

12/14/2017 - 00:35

అనంతపురం, డిసెంబర్ 13: గత ఎన్నికల మేనిఫెస్టోలో పలు పథకాలు ప్రకటించిన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చాక ప్రతి సంక్షేమ పథకాన్నీ సర్వనాశనం చేశారని వైసీపీ అధినేత వైఎస్.జగన్మోహన్‌రెడ్డి ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో తన పబ్బం గడుపుకునేందుకు సినిమా యాక్టర్లు, డైరెక్టర్లను వెంటబెట్టుకుని వస్తారని.. వాళ్లను చూసి మోసపోవద్దని ప్రజలకు పిలుపునిచ్చారు.

12/14/2017 - 00:33

బిక్కవోలు, డిసెంబర్ 13: తూర్పు గోదావరి జిల్లాలో ఒక ప్రైవేటు పాఠశాల బస్సుకు పెను ప్రమాదం తప్పింది. 40 మంది విద్యార్థులతో వెళుతున్న బస్సు హఠాత్తుగా సాంకేతికలోపంతో అదుపుతప్పి పొలాల్లోకి దూసుకుపోయింది. ఈప్రమాదంలో విద్యార్థులు స్వలగాయాలతో బయటపడ్డారు. వివరాలిలావున్నాయి...

12/14/2017 - 00:33

హైదరాబాద్, డిసెంబర్ 13: ముఖ్యమంత్రి పదవిని అడ్డుపెట్టుకుని చంద్రబాబునాయుడు పేదలు, చిరువ్యాపారుల కడుపుకొట్టి కార్పోరేట్ శక్తులకు ప్రజా సొమ్మును ధారపోస్తున్నారని వైకాపా ఎమ్మెల్యే ఆర్‌కె రోజా ధ్వజమెత్తారు. బుధవారం ఇక్కడ విలేఖర్లతో మాట్లాడుతూ, రాష్ట్రంలో ధరలు మండిపోతుంటే ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. గతంలో మాదిరిగా రేషన్ షాపుల్లో 10 సరుకులు ఇచ్చి పేద ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచాలన్నారు.

12/14/2017 - 00:32

అమరావతి, డిసెంబర్ 13: పోలవరం ప్రాజెక్టు ఆలస్యానికి జరుగుతున్న కారణాలను అనే్వషించాలే తప్ప, ఒకరికొకరు సాకులతో రాజకీయాలు చేసుకుంటే ఉభయులమూ నష్టపోతామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కలిసిన బీజేపీ నేతలు స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టు తమ పార్టీకీ ముఖ్యమైనందున, తమ పార్టీ సహకారం తప్పనిసరిగా ఉంటుందని వారు సీఎంకు హామీ ఇచ్చారు.

12/14/2017 - 00:31

విజయవాడ, డిసెంబర్ 13: వారం రోజుల్లో రాజధాని అమరావతిలో పాలనా నగర భవనాల నిర్మాణానికి టెండర్లను ఆహ్వానించనున్నట్లు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ వెల్లడించారు. వెలగపూడి సచివాలయంలో నార్మన్ ఫోస్టర్ బృందం ఇచ్చిన అసెంబ్లీ, హైకోర్టు భవనాల డిజైన్లను సీఎం చంద్రబాబు నాయుడుతో కలిసి ఆయన బుధవారం పరిశీలించారు.

12/13/2017 - 23:31

కాంట్రాక్టర్‌ను మారిస్తే పని కాదు సాంకేతిక ఇబ్బందులు కొనితెచ్చుకోలేం
గడువిచ్చి, పనులు పూర్తి చేయిద్దాం చంద్రబాబుకు నచ్చచెప్పిన నితిన్ గడ్కరీ

12/13/2017 - 23:15

షెడ్యూల్ ప్రకటించిన మంత్రి గంటా పాసైనవారికి ఏడేళ్ల వరకు అర్హత
దరఖాస్తుల స్వీకరణకు జనవరి 1 గడువు జనవరి 17 నుంచి 27 వరకు పరీక్షలు
ఫిబ్రవరి 8న ఫలితాల ప్రకటన పేపర్ 1కు డీఎడ్ అభ్యర్థులే అర్హులు
పేపర్ 2కు బీఈడీ అర్హత భర్తీ బాధ్యత ఏపీపీఎస్సీకి అప్పగించే యోచన
నారాయణకు రూ 50 లక్షల జరిమానా విద్యార్థి ఆత్మహత్యపై విచారణకు ఆదేశం

Pages