S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

12/12/2017 - 00:23

విజయవాడ, డిసెంబర్ 11: రాష్ట్రంలో లక్షా 80వేల మంది ఉపాధ్యాయ, ఉద్యోగ, కార్మికుల పాలిట శాపంలా మారిన కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని (సీపీఎస్) రద్దుపరచి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని, కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ విధానాలకు స్వస్తిచెప్పి రెగ్యులర్ సాంప్రదాయ నియామకాలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ డిమాండ్ చేసింది.

12/12/2017 - 00:22

తిరుపతి, డిసెంబర్ 11: అంగన్‌వాడీ కార్యకర్తల స్వయం సంపూర్ణ అభివృద్ధికి తోడ్పడటంతో పాటు అంగన్‌వాడీ కేంద్రాల్లోని పిల్లలకు, గర్భిణులకు ఎంతగానో ప్రయోజనాన్ని సమకూర్చే యశోద డిప్లమో కోర్సులను రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అమలుచేయడంపై దృష్టి సారిస్తామని రాష్ట్ర మహిళా సాధికారత, శిశు సంక్షేమ శాఖామంత్రి పరిటాల సునీత ప్రకటించారు.

12/12/2017 - 00:21

విజయవాడ, డిసెంబర్ 11: ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించి అర్హత టెస్టు (టెట్)ను ఇకపై కంప్యూటర్ బేస్డ్ టెస్టు(సీబీటీ)గా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2017-18 సంవత్సరం నుంచి అన్ని ఉమ్మడి ప్రవేశ పరీక్షలను కంప్యూటర్ బేస్డ్ టెస్టులుగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఈ పరీక్షను కూడా అదే తరహాలో నిర్వహించనున్నారు.

12/12/2017 - 00:21

అమరావతి, డిసెంబర్ 11: ‘రాబోయే ఖరీఫ్ సేద్యానికి ఇప్పటి నుంచే అన్ని శాఖలు సన్నద్ధం కావాలి. గోదావరి, కృష్ణాడెల్టాలలో రబీ పనులు త్వరగా ముగించేలా చూడాలి. ఖరీఫ్ మూడు వారాలు ముందుకు వచ్చింది కాబట్టి రబీ కూడా మూడు వారాలు ముందే ముగించాలి. అప్పుడు ఆదా అయ్యే నీటిని వచ్చే ఏడాది ఖరీఫ్ అవసరాలకు వినియోగించుకోగలమని’ ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.

12/12/2017 - 00:20

విజయవాడ, డిసెంబర్ 11: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధులతో సోమవారం అమరావతి సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ సమావేశమయ్యారు. రాష్ట్రంలో వ్యవసాయం, రవాణా, జల రవాణా, విద్య, గనుల తవ్వకం, మాన్యుఫ్యాక్చరింగ్ వంటి వివిధ రంగాల్లో తోడ్పాటుకు ఆస్ట్రేలియా - ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ గ్రూప్ ఏర్పాటైంది.

12/11/2017 - 04:48

కళ్యాణదుర్గం, డిసెంబర్ 10: కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్‌కు తప్పకుండా ప్రత్యేక హోదా సాధిస్తామని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(పీసీసీ) అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి తెలిపారు. రఘువీరా ఆదివారం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో పర్యటించి ‘ఇందిరమ్మ రాజ్యం- ఇంటింటా సౌభాగ్యం’ గురించి ప్రజలకు తెలియజేసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

12/11/2017 - 04:41

కాకినాడ, డిసెంబరు 10: కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకు 5 శాతం రిజర్వేషన్లు కల్పించడం వలన వెనుకబడిన వర్గాలకు ఏ విధమైన నష్టం వాటిల్లదని ఉప ముఖ్యమంత్రి, హోంశాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. విద్య, ఉద్యోగ, ఆర్థిక రంగాలలో మాత్రమే కాపులకు 5 శాతం రిజర్వేషన్లు ప్రకటించి తమ అధినేత చంద్రబాబు మాట నిలబెట్టుకున్నారన్నారు.

12/11/2017 - 04:39

విజయవాడ, డిసెంబర్ 10: రాష్ట్రంలోని లక్షా 80 వేల మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులకు పాత పెన్షన్ విధానం కొనసాగించాలనే డిమాండ్‌పై ఇక ప్రత్యక్ష పోరుకు సన్నద్ధం కావాలని ఆదివారం నాడిక్కడ రెవెన్యూ భవన్‌లో జరిగిన ఏపీ జేఏసీ అమరావతి, ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య జాక్టో, కాంట్రిబ్యూటరీ పెన్షన్ ఎంప్లారుూస్ అసోసియేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన విస్తృత సమావేశం ఏకగ్రీవంగా నిర్ణయించింది.

12/11/2017 - 04:33

ఇబ్రహీంపట్నం, డిసెంబర్ 10: విజయవాడ నగర సమీప ఇబ్రహీంపట్నంలోని డాక్టర్ నార్ల తాతారావు థర్మల్ విద్యుత్ కేంద్రం (ఎన్‌టీటీపీఎస్)లో 500 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 7వ యూనిట్ ట్రాన్స్‌ఫార్మర్ ఆదివారం పేలిపోయింది. దీంతో విద్యుత్ ఉత్పాదన నిలిచిపోయింది. అదృష్టవశాత్తూ అందరూ సురక్షితంగా బయటపడటంతో కార్మికులు, ఇంజనీర్లు ఊపిరి పీల్చుకున్నారు.

12/11/2017 - 04:26

రాజమహేంద్రవరం, డిసెంబర్ 10: రాష్ట్రానికి జీవనాడిగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణ అంచనా వ్యయం అనూహ్యంగా పెరిగిపోవడం వల్ల తలెత్తిన గందరగోళం అందరిలోనూ సందేహాలను రేకెత్తిస్తోంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి కేంద్రం లేవనెత్తుతున్న అభ్యంతరాలు, వ్యక్తంచేస్తున్న సందేహాలు చర్చనీయాంశాలుగా మారాయి.

Pages