S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

12/11/2017 - 04:24

అనంతపురం, డిసెంబర్ 10 : రాష్ట్భ్రావృద్ధి కోసం రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీలు నెరవేర్చేలా కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు తమ పోరాటం ఆగదని, రాష్ట్రానికి ఇప్పుడే ప్రత్యేక హోదా ఇస్తామంటే వెంటనే తమ ఎంపీలంతా రాజీనామా చేయడానికి సిద్ధమని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యులు స్పష్టం చేశారు.

12/11/2017 - 01:01

సీలేరు, డిసెంబర్ 10: ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో మావోయిస్టులు పోలీస్ ఇన్‌ఫార్మర్ పేరుతో కిలో సీతారామ్ (45) అనే గిరిజనుడిని శనివారం అర్ధరాత్రి కాల్చి చంపారు. మల్కన్‌గిరి జిల్లా రాళ్లగడ్డ పంచాయతీ పెద్ద టేకుపొదర్ గ్రామానికి చెందిన సీతారామ్ కొంత కాలంగా పోలీస్ ఇన్‌ఫార్మర్‌గా పనిచేస్తున్నాడని, పద్ధతి మార్చుకోవాలని ఎన్నిసార్లు హెచ్చరించినా ఫలితం లేకపోయిందని మావోయిస్టులు పేర్కొన్నారు.

12/11/2017 - 01:01

ఖాజీపేట, డిసెంబర్ 10 : కడప నగరంలో క్రికెట్ పందేలు నిర్వహిస్తున్న స్థావరాలపై ఆదివారం పోలీసులు దాడులు చేసి ముగ్గురు బుకీలను అదుపులోకి తీసుకోవడంతో పెద్దఎత్తున నగదు, గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు సీసీఎస్ డీఎస్పీ నాగేశ్వరరెడ్డి, కడప డీఎస్పీ మాసూంబాషా తెలిపారు.

12/11/2017 - 01:00

విజయవాడ, డిసెంబర్ 10: బడుగు, బలహీన వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ఆనాడు ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించి విప్లవాత్మక సంస్కరణలు తెచ్చారని, ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా తోడ్పాటునందించి వారి అభివృద్ధికి కృషి చేశారని రాష్ట్ర మహిళా సహకార ఆర్థిక సంస్థ అధ్యక్షురాలు పంచుమర్తి అనూరాధ అన్నారు.

12/11/2017 - 01:00

విజయవాడ, డిసెంబర్ 10: రాష్ట్రంలో రేషన్ పంపిణీలో నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించాలన్న ఆశయం కలగానే మిగలనుంది. గణనీయంగా తగ్గిన నగదు రహిత లావాదేవీలతో అది కేవలం ప్రచార ఆర్భాటంగా మారింది. కేంద్ర ప్రభుత్వం పెద్దనోట్లను రద్దు చేశాక, ప్రత్యామ్నాయంగా నగదు రహిత లావాదేవీలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించడం ద్వారా నగదు సమస్యను అధిగమించవచ్చని ప్రభుత్వం భావించింది.

12/11/2017 - 00:59

విజయవాడ, డిసెంబర్ 10: రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పాటు కానున్నాయని సామాజిక మాధ్యమాల్లో పుకార్లు జోరుగా షికారు చేస్తున్నాయి. తెలంగాణ తరహాలో రాష్ట్రంలో కూడా మరో 13 కొత్త జిల్లాలు ఏర్పాటు చేయనున్నారంటూ ప్రచారం జోరందుకుంది. అయితే ఇలాంటి ప్రతిపాదనేమీ లేదని ప్రభుత్వ వర్గాలు కొట్టిపారేశాయి.

12/11/2017 - 00:58

విజయవాడ, డిసెంబర్ 10: అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, ఉత్తమ పాలనతో ముందుకు దూసుకుపోతున్న కృష్ణా జిల్లా ప్రస్తుతం మరో ఘనతను సాధించింది. ఇటీవలే గ్రీవెన్స్‌కు వచ్చే సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్రంలో మొదటి స్థానం సంపాదించుకుని సత్తా చాటిన కృష్ణా జిల్లా యంత్రాంగం మరో అరుదైన రికార్డు నెలకొల్పింది. దాదాపు వంద శాతం పింఛన్లు పంపిణీ చేసి అమోఘమైన రికార్డు సాధించింది.

12/10/2017 - 04:12

విజయవాడ, డిసెంబర్ 9: రాష్ట్రంలో వృద్ధి రేటును మరింతగా పెంచేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఈ నెల 12న వివిధ విభాగాల అధిపతులతో విస్తృత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించేందుకు నిర్ణయించారు. హైదరాబాద్ నుంచి శనివారం వివిధ శాఖల వృద్ధి రేటుపై శాఖాధిపతులు, అధికారులతో టెలీకాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రి సమీక్షించారు.

12/10/2017 - 04:11

మచిలీపట్నం, డిసెంబర్ 9: కార్పొరేషన్ రుణాల మంజూరులో నిర్లక్ష్యంగా వ్యవహరించే బ్యాంకర్లపై చర్యలు తీసుకునేందుకు రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ సిద్ధంగా ఉందని కమిషన్ చైర్మన్ కారం శివాజీ అన్నారు. శనివారం కృష్ణాజిల్లా కేంద్రం మచిలీపట్నం వచ్చిన ఆయన ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో విలేఖర్లతో మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీల ఆర్థికాభివృద్ధి కోసం కార్పొరేషన్ ద్వారా కోట్లాది రూపాయల రుణాలను మంజూరు చేస్తున్నట్లు తెలిపారు.

12/10/2017 - 04:11

విజయవాడ, డిసెంబర్ 9: మాజీ పార్లమెంటు సభ్యురాలు, అలనాటి సినీతార జమునా రమణారావు శనివారం రాష్ట్ర సచివాలయం, శాసనసభ ప్రాంగణాలను సందర్శించారు. పరిసరాల్లోని పచ్చదనాన్ని చూసి ఎంతగానో సంతసించారు. అతి తక్కువ కాలంలో తాత్కాలికమైనప్పటికీ ఎంతో అద్భుతమైన సభా ప్రాంగణాలను తీర్చిదిద్దారంటూ సీఎం చంద్రబాబునాయుడిని అభినందించారు.

Pages