S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

11/07/2018 - 01:54

అమరావతి, నవంబర్ 6: కర్ణాటక ఉప ఎన్నికల ఫలితాలపై మంగళవారం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కుమారస్వామితో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోన్‌చేసి వివరాలడిగి తెలుసుకున్నారు. ఉప ఎన్నికల్లో జేడీఎస్, కాంగ్రెస్ కూటమి విజయం సాధించటం పట్ల అభినందనలు తెలిపారు. బలహీన అభ్యర్థి కనుకే ఒక స్థానంలో పరాజయం పాలయ్యామని కుమారస్వామి వివరించారు.

11/07/2018 - 01:24

అమరావతి, నవంబర్ 6: ప్రజల ఆహారపు అలవాట్లు మారుతున్నాయి.. ప్రభుత్వంలో నూతన విధానాన్ని అమలు చేయనున్నాం.. పశు సంపత్తితోనే అభివృద్ధి జరుగుతుంది.. పాడిపరిశ్రమకు రాష్ట్రం చిరునామా కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉద్ఘాటించారు. మంగళవారం రాత్రి ఉండవల్లి ప్రజావేదికలో గోపాలమిత్ర సభ్యులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు.

11/06/2018 - 17:07

అమరావతి: కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు ఏపీ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఈ పరిశ్రమ ఏర్పాటుకు రూ.18వేల కోట్లు ఖర్చు అవుతుందిన అంచనా వేశారు. ఈ మొత్తాన్ని రుణ సమీకరణ ద్వారా సేకరించాలని నిర్ణయించారు. దొనకొండలో మెగా ఇండస్ట్రియల్ హాబ్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. రాష్టవ్య్రాప్తంగా 366 అన్న క్యాంటీన్లు ఏర్పాటుచేయాలని నిర్ణయించారు.

11/06/2018 - 13:46

అమరావతి: కర్ణాటకలో ఎన్నికల ఫలితాలు బీజేపీకి గట్టి గుణపాఠాన్ని బోధించాయని ఏపీ మంత్రులు సోమిరెడ్డి, ఆదినారాయణ రెడ్డి అన్నారు. వారు మీడియాతో మాట్లాడుతూ ఇది మోదీ పతనానికి నాందీ అని అన్నారు. అక్కడ కూటమిని చీల్చేందుకు బీజేపీ ఎన్నో కుట్రలు పన్నిందని అన్నారు.

11/06/2018 - 12:35

ఖాజీపేట: కడప జిల్లా నాగేశ్వర కోన సమీపంలోని లంకమల అటవీప్రాంతంలో టాస్క్ఫోర్స్ పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. ఇద్దరు తమిళనాడు కూలీలను అరెస్టు చేశారు. ఈసందర్భంగా స్మగ్లర్లు తరలిస్తున్న రూ.52 లక్షల విలువ చేసే ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు.

11/06/2018 - 12:32

అమరావతి: ఏపీ మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో మంత్రివర్గ సహచరులు పాల్గొన్నారు. ప్రతిపక్ష నేత జగన్‌పై దాడి తదనంతర పరిణామాలపై చర్చించనున్నారు. కడపలో 3 మిలియన్ టన్నుల ఉక్క కర్మాగారానికి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

11/06/2018 - 04:50

రాజమహేంద్రవరం, నవంబర్ 5: ఈ రోజు నుంచి తాను రెల్లి కులాన్ని స్వీకరిస్తున్నాని, తను ఇక రెల్లి కులస్థుడిని’ అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. రాజకీయల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించడానికే తాను వచ్చానన్నారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడలోని జీ కనె్వన్షన్ కళ్యాణ మండపంలో సోమవారం రెల్లి కులస్థులతో పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు.

11/06/2018 - 04:46

శ్రీకాకుళం, నవంబర్ 5: ప్రధాని మోదీకి విపక్షనేత జగన్ దొంగపుత్రుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడని మంత్రి నారా లోకేష్ విమర్శించారు. పక్క జిల్లాలోనే పాదయాత్ర చేస్తూ తిత్లీ బాధితులను పరామర్శించేందుకు కనీసం జగన్ రాలేదన్నారు. కవాతులు చేసేందుకు, ఫాంహౌస్‌కు వెళ్లేందుకు వీరికి సమయం ఉంటుందని, బాధల్లో ఉన్నవారిని మాత్రం పరామర్శించరని లోకేష్ నిప్పులు చెరిగారు.

11/06/2018 - 04:44

విజయవాడ, నవంబర్ 5: జ్ఞాపికల కొనుగోళ్లలో నిధుల దుర్వినియోగానికి పాల్పడిన నలుగురు ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు వేసిన నేపథ్యంలో తనకు రక్షణ కల్పించాలని దుర్గగుడి ఈవో కోటేశ్వరమ్మ సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. జ్ఞాపికల కొనుగోలు వ్యవహారంలో ఏఈవో శ్రవణం అచ్యుతరామయ్య నాయుడును సస్పెండ్ చేయడంతో ఆయన ఈవో కోటేశ్వరమ్మ చాంబర్‌కు వచ్చి పరుష పదజాలంతో, తీవ్ర స్వరంతో హెచ్చరికలు చేశాడని పేర్కొన్నారు.

11/06/2018 - 05:17

అమరావతి: ‘తిత్లీ తుపాను బాధితులకు సహాయం అందించటంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. సొంత వనరులతోనే బాధితులకు సాయం అందించాలనుకున్నాం. ఇచ్చిన హామీ ప్రకారం దీపావళికి ముందే బాధితులకు చెక్కులు పంపిణీ చేస్తున్నాం’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. విపత్తు బాధితులకు సకాలంలో సాయం అందించగలిగామని ఉద్ఘాటించారు.

Pages