S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

11/30/2017 - 03:29

న్యూఢిల్లీ, నవంబర్ 29: ఫాతిమా మెడికల్ కళాశాలలో వచ్చే ఏడాది నూతన అడ్మిషన్లు లేకుండా, 2015-16 నుండి వైద్య విద్యను కోల్పోయిన విద్యార్థులను భర్తీచేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ పేర్కొన్నారు.

11/30/2017 - 03:25

శ్రీకాకుళం, డిసెంబర్ 29: ఆబ్కారీశాఖ అసిస్టెంట్ కమిషనర్, ఇన్‌ఛార్జి డిప్యూటీ కమిషనర్ శివప్రసాద్‌ను బుధవారం ఏసీబీ అధికారులు అరెస్టు చేసి, విశాఖపట్నం ఏసీబీ కోర్టుకు తరలించినట్టు డీఎస్పీ కరణం రాజేంద్ర తెలిపారు. మద్యం దుకాణాల లైసెన్స్‌దారుల నుంచి మామూళ్ల రూపేణా రూ.4.50 లక్షల రూపాయలు ఏసీ ఇంట్లో ఉన్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించి, ఆయనపై కేసు నమోదు చేశారు.

11/30/2017 - 02:58

అమరావతి, నవంబర్ 29: రాష్ట్రానికి మరో రెండు ప్రతిష్ఠాత్మక సంస్థలు రానున్నాయి. ఒకటి ఆటోమొబైల్ రంగంలో ప్రతిష్ఠాత్మక సంస్థ అశోక్ లేల్యాండ్, మరొకటి ఎంఎఫ్‌సీజీ తయారీ రంగంలో ముందున్న విప్రో ఎంటర్‌ప్రైజస్ సంస్థ. బుధవారం సచివాలయంలో విప్రో సంస్థ సీఎఫ్‌వో రాఘవ్ స్వామినాథన్, అశోక్ లేల్యాండ్ సీఎండీ వినోద్ కె దాసరి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుతో విడివిడిగా భేటీ అయ్యారు.

11/30/2017 - 02:55

గుంటూరు, నవంబర్ 29: ఒక గిరిజన మహిళా ప్రజాప్రతినిధిని అని కూడా చూడకుండా తనను మానసిక క్షోభను గురిచేసిన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహనరెడ్డిపై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు పెడతానని పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి పేర్కొన్నారు.

11/30/2017 - 02:00

విజయవాడ, నవంబర్ 29: పోలవరం ప్రాజెక్టు పనులు ఆపేందుకు ప్రతిపక్షం రాళ్లు వేసే కార్యక్రమం చేపట్టిందంటూ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు ఆరోపించారు. రాష్ట్ర శాసన మండలిలో పోలవరం ప్రాజెక్టుపై బుధవారం స్వల్పకాలిక చర్చ జరిగింది.

11/30/2017 - 02:00

విజయవాడ, నవంబర్ 29: డిసెంబర్ నెలను ఎయిడ్స్ అవగాహనా మాసంగా ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రఎయిడ్స్ నియంత్రణ సంస్థ (ఎపీఎస్‌ఏసీఎస్) కార్యనిర్వాహక సమితి సమావేశం రాష్ట్ర వైద్య, ఆరో గ్య కుటుంబ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో బుధవారం జరిగింది. ఈ సందర్భంగా ఎయిడ్స్ వ్యాధి నియంత్రణ, నివారణకు సంబంధించిన అంశాలపై చర్చించారు.

11/30/2017 - 01:58

విజయవాడ, నవంబర్ 29: హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు కాంగ్రెస్ ప్రభుత్వ ఘనత అని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ ఎన్ రఘువీరారెడ్డి అన్నారు. మెట్రో ప్రాజెక్టు ఘనత తమదేనంటూ చంద్రబాబు నాయుడు తప్పుడు ప్రచారం చేసుకుంటున్నారని అన్నారు. ప్రపంచంలో ఏ మంచి జరిగినా తానే చేశానని, చెడు జరిగితే ప్రతిపక్షాలకు అపాదించడం చంద్రబాబుకు అలవాటుగా మారిందన్నారు.

11/30/2017 - 01:57

విజయవాడ, నవంబర్ 29: ఎర్ర చందనం స్మగ్లింగ్ నిరోధానికి స్మగ్లర్లు కనిపిస్తే కాల్చివేసేందుకు వీలుగా ఉత్తర్వులు జారీ చేయాలని ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు కోరారు. రాష్ట్ర శాసన మండలిలో బుధవారం ఆయన ఎర్ర చందనం విక్రయాలపై ప్రశ్నించారు. తమిళనాడు ప్రభుత్వం నామమాత్రంగా కొన్ని ఎర్ర చందనం చెట్లను నాటి, ఎర్ర చందనం ఎగుమతులకు నిరభ్యంతర సర్ట్ఫికెట్లను జారీ చేస్తోందన్నారు.

11/30/2017 - 01:56

విశాఖపట్నం, నవంబర్ 29: అమరావతిలో రాజధాని నిర్మాణంలో జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్‌జీటీ) నిబంధనలు కచ్చితంగా పాటించాల్సిందేనని మేథావులు అభిప్రాయపడ్డారు.

11/30/2017 - 01:28

విజయవాడ, నవంబర్ 29: నార్మన్ ఫోస్టర్ బృందం సమర్పించిన సచివాలయ ఆకృతులను శాసనసభలో గురువారం ప్రదర్శించనున్నారు. వీటిపై ఎమ్మెల్యేల అభిప్రాయాలను తెలుసుకుందాని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. నార్మన్ ఫోస్టర్ బృందం అందచేసిన సచివాలయ ఆకృతులపై వెలగపూడి సచివాలయంలో సిఆర్‌డిఎ అధికారులతో బుధవారం సీఎం చాలాసేపు చర్చించారు. ఆ బృందం అందచేసిన మూడు ఆప్షన్లను పరిశీలించారు.

Pages