S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

11/29/2017 - 04:18

కాకినాడ, నవంబర్ 28: కాకినాడ పోర్టు నుండి ఓ కార్పొరేట్ కంపెనీకి ఆయిల్‌ను తరలించడానికి నిర్మించిన పైపులైన్‌కు కన్నంపెట్టి దోపిడీకి పాల్పడుతున్న ఆరుగురు నిందితులను పోలీసులు మంగళవారం అరెస్టుచేశారు. కీలక నిందితుడు పరారీలో ఉన్నాడు. ఈ దోపిడీ వెనుక కాకినాడకు చెందిన ఓ వంట నూనెల వ్యాపారి, టిడిపి నేత హస్తం ఉన్నట్టు తెలుస్తోంది. పోర్టుకు సమీపంలో ఎన్‌సిఎస్ అనే కంపెనీ ఉంది.

11/29/2017 - 04:06

అమరావతి, నవంబర్ 28: రాష్ట్రంలో వీలైనన్ని విమాన సర్వీసులను నడపడం ద్వారా ఎయిర్ కనెక్టివిటీ పెంచడానికి ప్రయత్నించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో విమానాశ్రయాల అభివృద్ధి, కొత్త విమానాశ్రయాల ఏర్పాటు, విమానయాన సర్వీసుల పెంపుపై నిర్దిష్ట కాలవ్యవధిలో పనులు పూర్తిచేసేలా కార్య ప్రణాళికను సిద్ధం చేయాలని చెప్పారు.

11/29/2017 - 04:04

అమరావతి, నవంబర్ 28: రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో పాటు విద్య, వైద్యం వంటి ముఖ్య రంగాల్లో మెరుగైన ఫలితాలను సాధించేందుకు యూనిసెఫ్ అవసరమైన ప్రత్యేక ప్రణాళికలతో తగిన సాంకేతిక సహకారం అందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్ కోరారు.

11/29/2017 - 04:03

విశాఖలో ఇటీవల నిర్వహించిన అంతర్జాతీయ అగ్రిటెక్ భాగస్వామ్య సదస్సు సత్ఫలితాలిస్తోంది. వ్యవసాయాన్ని ఆధునిక బాట పట్టించి, దానికి సాంకేతికత జోడించి లాభసాటిగా మార్చాలన్న కొత్త ఆవిష్కరణలతో సాగిన నాటి సదస్సుపై పలు సంస్థలు స్పందించాయి.

11/29/2017 - 04:00

అమరావతి, నవంబర్ 28: గ్రామీణులకు సురక్షిత తాగునీరు అందించడం ద్వారా మలేరియా, డెంగ్యూ లాంటి వ్యాధుల వ్యాప్తిని అరికట్టేందుకు మంత్రి నారా లోకేష్ ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేశారు. టెక్నాలజీని ఉపయోగించి గ్రామాల్లో నివసిస్తున్న ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని మంత్రి లోకేష్ లక్ష్యంగా పెట్టుకున్నారు.

11/29/2017 - 02:57

రాజమహేంద్రవరం, నవంబర్ 28: తూర్పు మన్యం సరికొత్త పంటల సాగుకు ప్రయోగ క్షేత్రంగా మారింది. తాజాగా ఇక్కడ యాపిల్ సాగు చేపట్టారు. ఇప్పటి వరకు అరకు ప్రాంతానికే పరిమితమైన యాపిల్ సాగు ఇపుడు తూర్పు కనుమల్లో కూడా చేపట్టారు. మారేడుమిల్లి ప్రాంతంలో ఆదివాసీ రైతులతో ప్రయోగాత్మకంగా యాపిల్ సాగు చేపట్టారు. విదేశీ అవసరాలకు అనుగుణంగా కొన్ని బహుళజాతి సంస్థలకు ప్రయోగశాలగా దశాబ్దాలుగా తూర్పు మన్యం దోహద పడుతోంది.

11/29/2017 - 02:53

ఆదోని, నవంబర్ 28: నరేంద్రమోదీ పాలనలో దేశం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతోందని లోక్‌సత్తా జాతీయ నేత జయప్రకాష్ నారాయణ అన్నారు. ప్రతి సంవత్సరం వంట నూనెలు, కందిపప్పు దిగుమతి చేసుకోవడం వల్ల రూ.1.40 లక్షల కోట్లు రైతులకు నష్టం చేకూరుతోందన్నారు.

11/29/2017 - 02:51

శ్రీకాళహస్తి, నవంబర్ 28: చిత్తూరు జిల్లా ఏర్పేడు - వెంకటగిరి జాతీయ రహదారిపై ఎంపేడు వద్ద మంగళవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు.శ్రీ కాళహస్తి మండలం వాగవేడు గ్రామానికి చెందిన ముగ్గురు విద్యార్థులు మోటార్‌సైకిల్‌పై నెల్లూరు జిల్లా వెంకటగిరికి వెళుతుండగా ఈ ఎంపేడు గ్రామం వద్ద ముందుగా వెళుతున్న లారీని తప్పించబోయి ఎదురుగా వచ్చిన లారీ ఢీకొన్నారు.

11/29/2017 - 02:49

అమరావతి, నవంబర్ 28: తెలుగుదేశం పార్టీ లో ఉన్న అతికొద్దిమంది సీనియర్ నాయకుల్లో ఒకరైన ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు తన మనసులోని మాటను మరోసారి బయటపెట్టారు. అవకాశం ఇస్తే రాజ్యసభకు వెళ్లాలని ఉందని చెప్పారు. మంగళవారం తన చాంబర్‌లో ఆయన మీడియాతో కొద్దిసేపు ముచ్చటించారు. రాజ్యసభ ఎన్నికలపై చర్చ జరిగిన సందర్భంగా మిమ్మల్ని రాజ్యసభకు పంపించే అవకాశాలున్నాయా? అని ప్రశ్నించగా.. ‘నాకూ వెళ్లాలనే ఉంది.

11/29/2017 - 02:49

ద్వారకాతిరుమల, నవంబర్ 28: మెగా ఫ్యామిలీకి ప్రేక్షకుల ఆదరాభిమానాలే నంది అవార్డులని యువ హీరో సాయిధర్మతేజ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకాతిరుమల వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని ‘జవాన్’ చిత్ర యూనిట్ మంగళవారం సందర్శించింది. చిత్ర హీరో సాయిధర్మతేజ, హీరోయిన్ మెహరిన్, దర్శకుడు బిఎస్వీ రవి, నిర్మాత కృష్ణ క్షేత్రంలో సందడిచేశారు.

Pages