S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

11/29/2017 - 02:47

పుట్టపర్తి, నవంబర్ 28: ఆర్టీసీ బస్సు అదుపుతప్పి బావిలోకి దూసుకెళ్లింది. అయితే మోటారు పైపు తగులుకుని గట్టుపై నిలిచిపోయింది. దీంతో బస్సులోని 81 ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ సంఘటన అనంతపురం జిల్లా పుట్టపర్తి సమీపంలో మంగళవారం జరిగింది.

11/29/2017 - 02:38

విజయవాడ, నవంబర్ 28: శాసనసభ సమావేశాల్లో తొలిరోజు నుంచి విధిగా హాజరవుతూ వస్తున్న రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ మంగళవారం గైర్హాజరయ్యారు. దీంతో నాలుగు ప్రశ్నలను వాయిదా వేయాల్సి వచ్చింది. కోస్తా ప్రాంతాల్లో రక్షిత నీటి సరఫరా, భూగర్భ డ్రైనేజీ నీటి శుద్ధి, గిరిజన గ్రామాలకు రోడ్డు సౌకర్యం, పంచాయతీరాజ్ సంస్థలు బలోపేతం..

11/29/2017 - 01:00

అమరావతి, నవంబర్ 28: అనంతపురం జిల్లా ఓడిచెరువు మండలం తంగేడికుంట గ్రామంలో ఉన్న 6వేల ఎకరాల శోత్రియం భూములకు పట్టాలివ్వడానికి ప్రభుత్వం నిర్ణయించిందని చీఫ్ విప్ పల్లె రఘునాథరెడ్డి వెల్లడించారు. సచివాలయంలోని నాలుగో బ్లాక్ పబ్లిసిటీ సెల్‌లో మంగళవారం ఆయన విలేఖరులతో మాట్లాడారు. తంగేడికుంట గ్రామంలో 9,999 ఎకరాల్లో శోత్రియం భూములు ఉన్నాయన్నారు.

11/29/2017 - 00:58

గుంటూరు, నవంబర్ 28: దళిత, బీసీ ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వం కావాలని వేధిస్తోందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, పార్టీ గుంటూరు జిల్లా పరిశీలకులు బొత్స సత్యనారాయణ ఆరోపించారు. రోజురోజుకూ దళిత ఉద్యోగులపై దాడులు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పొన్నూరు పీహెచ్‌సీలో ఉద్యోగిగా పనిచేస్తున్న రవికుమార్ ఆత్మహత్యే ఇందుకు నిదర్శనమని అన్నారు.

11/29/2017 - 00:49

విశాఖపట్నం, నవంబర్ 28: పబ్లిక్, ప్రైవేట్ పార్ట్నర్‌షిప్ విధానంలో చేపట్టిన హైదరాబాద్ మెట్రో ప్రాజెక్ట్ ప్రపంచంలోనే అది పెద్ద మెట్రోగా గణతికెక్కింది. పదేళ్ల నుంచి ఎదురు చూస్తున్న మెట్రో రైలు నేడు ప్రజల ముందుకు వచ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా ఉంటే, ఈ ప్రాజెక్ట్‌ను చూసి ఆంధ్ర ప్రాంత ప్రజలు తెలంగాణ ప్రజల ఆనందంలో పాలుపంచుకునేవారు.

11/29/2017 - 00:08

కుప్పం, నవంబర్ 28: చిత్తూరు జిల్లా కుప్పం, గుడుపల్లి మండలంలోని అటవీ సరిహద్దు ప్రాంతాల్లో నివాసమున్న ప్రజలు సాయంత్రం 6 నుండి ఉదయం 7గంటల వరకు ఇళ్లల్లో నుండి బయటకు రావద్దని సిఎం పిఏ మనోహర్ సూచించారు.

11/29/2017 - 00:07

పాడేరు, నవంబర్ 28: వైసీపీ నాయకత్వం తనకు నమ్మకద్రోహం చేసినందునే పార్టీని వీడాల్సి వచ్చిందని పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి స్పష్టం చేసారు. రాజధాని అమరావతి నుంచి మంగళవారం ఆమె టెలిఫోన్‌లో ‘ఆంధ్రభూమి’తో మాట్లాడుతూ గత మూడున్నరేళ్లుగా తాను పార్టీకి ఎంతో విధేయతగా వ్యవహరిస్తూ గిరిజన ప్రాంతంలో పార్టీ పటిష్టతకు శక్తి వంచన లేకుండా కృషి చేశానన్నారు.

11/29/2017 - 00:06

రాయదుర్గం, నవంబర్ 28: హిందూధర్మాన్ని రక్షించడమే ధ్యేయంగా విశ్వహిందూ పరిషత్ ముందడుగు వేస్తోందని వీహెచ్‌పీ అంతర్జాతీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి రాఘవులు తెలిపారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో మంగళవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ దేశంలో నిర్లక్ష్యానికి గురవుతున్న హిందూధర్మాన్ని రక్షించేందుకు వీహెచ్‌పీ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు.

11/29/2017 - 00:06

విశాఖపట్నం, నవంబర్ 28: పోలవరం ప్రాజెక్టుకు ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాహు, కేతువుల్లాంటి వారని పీసీసీ ఉపాధ్యక్షుడు తులసి రెడ్డి మండిపడ్డారు. విశాఖ నగరంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ కేవలం కమిషన్ల కోసమే ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలు తీసుకున్నారని ఆరోపించారు.

11/29/2017 - 00:03

కర్నూలు, నవంబర్ 28: దేశంలోనే మొట్టమొదటి సారిగా కర్నూలు జిల్లాలో అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో భూసార పరీక్షలు నిర్వహించడానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ప్రస్తుత రబీ సీజన్ ముగిసిన వెంటనే డ్రోన్‌లను ప్రవేశపెట్టి జిల్లాలో భూసార పరీక్షలను నిర్వహించడానికి ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్లు అధికారవర్గాలు వెల్లడిస్తున్నాయి.

Pages