S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

08/09/2016 - 17:39

విజయవాడ: మరికొద్ది రోజుల్లో కృష్ణా పుష్కరాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో విజయవాడ నగరం కొత్త అందాలు సంతరించుకుంది. రాత్రి సమయంలో నగరంలోని పలు ప్రాంతాలు విద్యుద్దీపాలతో కాంతులీనుతోంది. ప్రకాశం బ్యారేజీ, ఇంద్రకీలాద్రి, స్వరాజ్య మైదానంలో వేంకటేశ్వర స్వామి నమూనా ఆలయాలను విద్యుద్దీప తోరణాలతో నయనానందకరంగా అలంకరించారు. ఆ కాంతులు కృష్ణానదిలో ప్రతిబింబిస్తున్నాయి.

08/09/2016 - 17:38

గుంటూరు: ఎపికి ప్రత్యేక హోదా విషయంలో అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను దారుణంగా మోసం చేస్తున్నాయని కాంగ్రెస్ నాయకుడు, మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. పరిపాలనాదక్షుడిగా చెప్పుకుంటున్న సిఎం చంద్రబాబు ప్రత్యేక హోదా కోసం చిత్తశుద్ధితో కృషి చేయడం లేదన్నారు. హోదా సాధించేందుకు ఎన్‌డిఎ ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ ఒత్తిడి తెస్తుందని ఆయన తెలిపారు.

08/09/2016 - 17:36

చెన్నై: అనారోగ్యంతో కన్నుమూసిన సినీనటి జ్యోతిలక్ష్మి అంత్యక్రియలు చెన్నైలోని కన్మమ్మాపేట స్మశానవాటికలో మంగళవారం ముగిశాయి. జ్యోతిలక్ష్మిని కడసారి చూసేందుకు సినీ ప్రముఖులు, ఆమె అభిమానులు తరలివచ్చారు. జ్యోతిలక్ష్మి అల్లుడు బాలాజీ ఆమె పార్థివదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు.

08/09/2016 - 11:46

విజయవాడ: భారత స్వాతంత్య్ర సంగ్రామాన్ని క్విట్ ఇండియా ఉద్యమం కీలక మలుపుతిప్పిందని ఎపి సిఎం చంద్రబాబు అన్నారు. క్విట్ ఇండియా డే సందర్భంగా ఆయన సమరయోధులకు మంగళవారం నివాళులర్పించారు. అమరవీరుల త్యాగాల ఫలితంగానే నేడు మనం స్వేచ్ఛను అనుభవిస్తున్నామని, వారి స్ఫూర్తితో ముందుకు సాగాలన్నారు.

08/09/2016 - 04:49

రాజమహేంద్రవరం, ఆగస్టు 8: గోదావరి తీరంలో అంత్య పుష్కర స్నానాలకు భక్త జనం వరదలా పొంగింది. సోమవారం తూర్పు గోదావరి జిల్లా పరిధిలోని వివిధ స్నాన ఘట్టాల్లో పుణ్య స్నానాలకు భక్తులు పోటెత్తారు. సుమారు 1.32 లక్షల మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. ఒక వైపు గోదావరి నదికి వరద పోటెత్తగా, మరో వైపు పుణ్య స్నానాలకు భక్త జనం జిల్లా వ్యాప్తంగా తరలివచ్చారు.

08/09/2016 - 04:47

విజయవాడ, ఆగస్టు 8: కృష్ణా పుష్కరాల్లో ప్రధానంగా పవిత్ర స్నానమాచరించే వారికోసం కోట్లాది రూపాయలతో నిర్మితమైన స్నాన ఘట్టాలు విద్యుత్ కాంతులతో ధగద్ధగాయమానంగా వెలుగులీనుతున్నాయి. వీటిని అందమైన టైల్స్‌తో తీర్చిదిద్దటంతో తిలకించేందుకు పెద్దసంఖ్యలో ప్రజలు తరలివస్తూ మెట్లపై కూర్చుని గ్రూప్ ఫొటోలు దిగుతున్నారు.

08/09/2016 - 04:45

సింహాచలం, ఆగస్టు 8: భక్తుల సేవే భగవంతుడి సేవగా భావించి భక్తితో, బాధ్యతతో విధులు నిర్వహించాలని స్వచ్ఛంద సేవకులకు దేవస్థానం కార్యనిర్వహణాధికారి కె. రామచంద్రమోహన్ పిలుపునిచ్చారు. దేవాలయాల్లో స్వచ్ఛంద సేవకుల భాగస్వామ్యాన్ని పెంచాలన్న ప్రభుత్వ లక్ష్యం మేరకు సింహాచలం దేవస్థానం ప్రయోగాత్మకంగా తొలిసారిగా నృసింహ సేవాదళం పేరుతో ఒక వ్యవస్థ ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది.

08/09/2016 - 04:42

న్యూఢిల్లీ, ఆగస్టు 8: అనంతపురం జిల్లాకు ప్రధాన మంత్రి పసల్ బీమా పథకాన్ని విస్తరించాలని టిడిపి సభ్యుడు జెసి దివాకర్ రెడ్డి లోక్‌సభలో డిమాండ్ చేశారు. సోమవారం లోక్‌సభ జీరో అవర్‌లో ఈ అంశాన్ని ప్రస్తావించారు. అనంతపురం కరవుబాధిత ప్రాంతం, ఇక్కడ వర్షపాతం కూడా చాలా తక్కువ అని చెబుతూ జిల్లా రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు ప్రధాన మంత్రి పంటల బీమా పథకాన్ని ఈ జిల్లాలో వెంటనే అమలు చేయాలన్నారు.

08/09/2016 - 04:39

రాజమహేంద్రవరం, ఆగస్టు 8: కృష్ణా పుష్కరాల సందర్భంగా ఈ నెల 12 నుంచి 23వ తేదీ వరకు విజయవాడ తదితర ప్రాంతాలకు ప్రయాణీకుల సౌకర్యార్థం 275ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎ రామకృష్ణ వెల్లడించారు. సోమవారం రాజమహేంద్రవరంలో ఆయన విలేఖర్లతో మాట్లాడారు.

08/09/2016 - 04:39

ఖమ్మం (ఖానాపురం హవేలి), ఆగస్టు 8: రాష్ట్రంలో 6,400 కోట్ల రూపాయల వ్యయంతో 320 గురుకులాలు ఏర్పాటు చేసినట్లు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి చెప్పారు.. సోమవారం ఖమ్మం నగరంలో జిల్లా ప్రవాస భారతీయులు (జిల్లా ఎన్‌ఆర్‌ఐ ఫోరం) ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు మోటివేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడుతూ ఏ ప్రభుత్వమూ చేపట్టని పథకాలను తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తోందని చెప్పారు.

Pages