S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

11/28/2017 - 03:56

పలాస, నవంబర్ 27: సభ్యసమాజం తలదించుకునే విధంగా నవమాసాలు మోసిన కన్నతల్లిపై అత్యాచారానికి ఒడిగట్టేందుకు యత్నించిన దుర్మార్గుడి వికృత చేష్టలు భరించలేని ఆ మాతృమూర్తి ఓ వ్యక్తి సహాయంతో వాడి తలను, మొండాన్ని వేరుచేసిన సంఘటన ఈ ప్రాంతంలో తీవ్ర సంచలనం రేకెత్తించింది. ఈ ఘటనకు పాల్పడిన నిందితులను పోలీసులు ఎట్టకేలకు పట్టుకొని హత్యకు గురైన కొడుకు తలను సోమవారం స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిర్వహించారు.

11/28/2017 - 03:55

విశాఖపట్నం, నవంబర్ 27: దేశ సంపద యువతను జాగృతం చేయడం ద్వారా జాతికి ఖ్యాతిని తీసుకురావాలన్నదే తన కర్తవ్యమని ఆధ్యాత్మిక గురువు జగ్గీ వాసుదేవ్ అన్నారు. ఇషా ఫౌండేషన్, యునిసెఫ్, ఎపీ ప్రభుత్వం ఉమ్మడి ఆధ్వర్యంలో సోమవారం విశాఖలో నిర్వహించిన గ్రామోత్సవ్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ జాతికి అవసరమైన యువతను కర్తవ్యం వైపు నడిపించాల్సి ఉందన్నారు.

11/28/2017 - 02:01

అమరావతి, నవంబర్ 27: సింగపూర్‌కు 34 మందితో కూడిన రెండో విడత రాజధాని ప్రాంత రైతుల బృందం సోమవారం బయలుదేరింది. సచివాలయంలోని మూడో బ్లాక్ నుంచి బస్సులో బయలుదేరిన రైతుల బృందానికి డిప్యూటీ ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణ సోమవారం పచ్చజెండా ఊపి ప్రారంభించారు.

11/28/2017 - 01:59

విజయవాడ, నవంబర్ 27: పత్తి అమ్ముడుపోలేదని ఏ రైతు బాధపడే పరిస్థితి ఉండకూడదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. నీరు-ప్రగతి, వ్యవసాయం పురోగతిపై వారం వారం నిర్వహించే టెలీకాన్ఫరెన్స్‌లో సోమవారం ఆయన మాట్లాడుతూ మంచి పత్తిలో గుడ్డి పత్తి కలిపి అమ్మే దళారులపై కఠినచర్యలు తీసుకోవాలన్నారు. పత్తి కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడితే కఠినచర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

11/28/2017 - 01:57

గుంటూరు, నవంబర్ 27: కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వైఎస్ రాజశేఖరరెడ్డి దళిత గిరిజనులను ఓటుబ్యాంకుగా వాడుకుని, సంక్షేమానికి దూరం చేశారని గిరిజన, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనందబాబు ధ్వజమెత్తారు.

11/28/2017 - 01:57

గుంటూరు, నవంబర్ 27: బలహీన వర్గాల సంక్షేమాన్ని వైఎస్‌ఆర్ హయాంలో నీరుగారిస్తే, అందుకు భిన్నంగా పాదయాత్రలో ప్రతిపక్ష నేత జగన్ అసత్య ప్రచారం చేయడం విడ్డూరంగా ఉందని రాష్ట్ర బలహీనవర్గాల సంక్షేమ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు విమర్శించారు.

11/27/2017 - 04:17

విజయవాడ, నవంబర్ 26: రాష్ట్ర రాజధాని అమరావతి ప్రాంతంలో పర్యటిస్తుంటే రాష్ట్రంలో రాజ్యాంగబద్ధ పాలన కొనసాగుతున్నదా? లేక పోలీస్ పరిపాలన సాగుతోందా? అనే అనుమానం కలుగుతోందని సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ వీ గోపాల గౌడ అన్నారు. సీఆర్‌డీఏ ఏర్పాటు చట్ట విరుద్ధమని, 33వేల ఎకరాల భూసేకరణ మరింత చట్ట విరుద్ధమని ఆయన విమర్శించారు.

11/27/2017 - 04:12

మంగళగిరి, నవంబర్ 26: నిస్వార్థ సేవకు తెలుగుదేశం ప్రతిరూపమని పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరు గ్రామ పరిధిలో 16వ నెంబర్ జాతీయ రహదారి పక్కన 3.60 ఎకరాల్లో పార్టీ కేంద్ర కార్యాలయ భవన నిర్మాణానికి ఆదివారం ఉదయం ఆయన శంకుస్థాపన చేశారు.

11/27/2017 - 03:41

కాకినాడ, నవంబర్ 26: తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో అపహరణకు గురైన పసికందు ఎట్టకేలకు తిరిగి అమ్మ ఒడికి చేరింది. శిశువును అపహరించిన మహిళా కిడ్నాపర్ పోలీసుల వలకు చిక్కి ప్రస్తుతం ఊచలు లెక్కపెడుతోంది. తీవ్ర కలకలం రేపిన పసికందు కిడ్నాప్ మిస్టరీ తుదకు సుఖాంతం కావడంతో బంధువులు, అధికార వర్గాలు ఊపిరి పీల్చుకున్నాయి.

11/27/2017 - 03:39

అమరావతి, నవంబర్ 26: ఆరుపదుల వయసు దాటిన ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇంకా ఉల్లాసంగా, ఉత్సాహంగానే తన విధులు నిర్వర్తిస్తున్నారు. ఆదివారం మంచిరోజు కావడం, మరో మూడు నెలల వరకూ శుభ ముహూర్తాలు లేకపోవడంతో మూడు ముఖ్యమైన కార్యక్రమాలకు అంకురార్పణ చేశారు. ఉదయం 4.35 గంటలకు తన నివాసం ఆవరణలో సందర్శకుల కోసం నిర్మించిన భవనాన్ని చంద్రబాబు ప్రారంభించారు.

Pages