S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

11/27/2017 - 00:34

కుప్పం, నవంబర్ 26: తన కుమారుడు లోకేష్‌ను ఎమ్మెల్యేగా గెలుపించుకోలేని అసమర్ధుడు చంద్రబాబు నాయుడని వైకాపా రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, నగరి ఎమ్మెల్యే రోజా విమర్శించారు. ఆదివారం చిత్తూరు జిల్లా గుడుపల్లి రైల్వే క్రాస్‌రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన రోడ్‌షోలో ఆమె మాట్లాడారు.

11/26/2017 - 03:52

క్రిష్ణగిరి, నవంబర్ 25: తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో నేడు లంచం లేనిదే ఏ పనీ జరగడం లేదని వైసీపీ అధినేత వైఎస్.జగన్మోహన్‌రెడ్డి ఆరోపించారు. పెన్షన్ కావాలంటే లంచం, రేషన్‌కార్డు కావాలంటే లంచం, ఇళ్లు కావాలంటే లంచం, చివరకు మరుగుదొడ్డి కావాలన్నా లంచం ఇవ్వాల్సిందేనన్నారు. వ్యవస్థ మొత్తం లంచాలమయంగా మారిందన్నారు.

11/26/2017 - 03:47

విశాఖపట్నం, నవంబర్ 25: సాధారణ రోజుల్లోనూ రైళ్ళకు డిమాండ్ పెరిగిపోతోంది. పండుగలు, పెళ్ళిళ్ళు, వేసవి సెలవుల్లోనే కాకుండా ఏడాది పొడవునా పెరుగుతున్న రద్దీని తట్టుకునేందుకు ఈస్ట్‌కోస్ట్‌రైల్వే ప్రత్యేక రైళ్ళను పట్టాలెక్కిస్తోంది. ఇలా ప్రవేశపెట్టిన ప్రత్యేక రైళ్ళల్లో కొన్నింటిని కొనసాగించాల్సి వస్తోంది.

11/26/2017 - 03:46

విజయవాడ, నవంబర్ 25: కృష్ణానదీ యాజమాన్య బోర్డు ఆదేశాల మేరకు నాగార్జున సాగర్ ఎడమ కాలువకు ప్రస్తుతం సరఫరా జరుగుతున్న సాగర్ జలాలను డిసెంబర్ ఐదో తేదీ వరకు విడుదల చేసేలా నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఖమ్మంలోని ఎన్‌ఎస్‌సి టేకులపల్లి సర్కిల్ కార్యాలయంలో శనివారం సాయంత్రం జరిగిన కీలక సమావేశంలో ఈ మేర కృష్ణా, ఖమ్మం జిల్లా అధికారుల మధ్య ఓ అవగాహన కుదిరింది.

11/26/2017 - 03:44

పామూరు, నవంబర్ 25: కోతికి భయపడి ఓ విద్యార్థి ప్రాణాలు కోల్పోయిన సంఘటన ప్రకాశం జిల్లా పామూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారం మధ్యాహ్నం జరిగింది. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సీనియర్ ఇంటర్ చదువుతున్న సిఎస్ పురానికి చెందిన బండారు వెంకటేష్ (17) భోజనానంతరం తినుబండారాలు తింటుండగా ఓ కోతి వచ్చింది. ఆ కోతిని చూచి భయానికి గురైన అతడు పరిగెత్తుతుండగా బల్ల అంచు తలకు తగిలి తీవ్ర గాయాలయ్యాయి.

11/26/2017 - 03:43

విశాఖపట్నం, నవంబర్ 25: ప్రతిష్ఠాత్మక విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ముడి సరకు కష్టాలు వేధిస్తున్నాయి. కేకే లైన్‌లో తరచూ సంభవిస్తున్న ఇబ్బందుల కారణంగా ఉక్కుకు బైలడిల్లా నుంచి ముడి ఇనుము సరఫరాలో తీవ్ర అవరోధం ఏర్పడుతోంది. సాలీనా 6.3 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన ఉక్కు కర్మాగారంలో మూడు బ్లాస్ట్ ఫర్నెస్‌లు పనిచేస్తున్నాయి.

11/26/2017 - 02:54

కాకినాడ, నవంబర్ 25: దేశంలోనే అతి పెద్ద చమురు క్షేత్రాల్లో ఒకటైన ఒఎన్‌జిసి (కెజి బేసిన్)లో అనేక అక్రమాలు జరుగుతున్నాయని, ఈ సంస్థ మరో ఈస్ట్ ఇండి యా కంపెనీ మాదిరిగా అవతరించిందని కాకినాడ, అమలాపురం పార్లమెంట్ సభ్యులు తోట వెంకట నరసింహం, పండుల రవీంద్రబాబు ఆరోపించారు. ఒఎన్‌జిసిలో పెద్దఎత్తున అవినీతి జరుగుతోందని ధ్వజమెత్తారు.

11/26/2017 - 02:52

కర్నూలు, నవంబర్ 25: వైకాపా అధినేత జగన్ ఇస్తున్న హామీ లు చాంతాడును మించుతున్నాయి. ఆయన హామీల జాబితా రోజురోజుకూ పెరుగుతూపోతోంది. ఇడుపులపాయలో ప్రారంభించిన ప్రజా సంకల్పయాత్ర 200 కిలోమీటర్లు ముగించుకుని కర్నూలు జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. పాదయాత్రలో భాగంగా తనతో ఎవరు కలిసినా వారి సమస్య విని తాను ముఖ్యమంత్రి అయిన వెంటనే పరిష్కరిస్తానని హామీ ఇస్తున్నారు.

11/26/2017 - 02:52

భీమునిపట్నం, నవంబర్ 25: అగ్రిగోల్డ్ పరిహారం కోసం పేరు నమోదు చేసుకోవడానికి వచ్చిన ఒక వృద్ధుడు క్యూలో నిలబడలేక పోలీస్ స్టేషన్ ఆవరణలో మృతి చెందిన వైనమది. భీమి లి సిఐ బాలసూర్యారావు అందించిన వివరాల ప్రకారం విశాఖ జిల్లా భీమిలి మండలం చిప్పా డ దరి పాతపాలేనికి చెందిన జీరు పోలయ్య (50) అనే వృద్ధుడు తన కుమార్తె చిట్టితల్లి పేరున 2003లో అగ్రిగోల్డ్‌లో రూ.5 వేలు డిపాజిట్ చేశాడు.

11/26/2017 - 02:49

కర్నూలు, నవంబర్ 25: విశాఖపట్టణం జిల్లా పాడేరు శాసనసభ్యురాలు గిడ్డి ఈశ్వరితో వైసీపీ అధినేత జగన్ శనివారం ఫోన్‌లో మాట్లాడారు. ఆమె వైకాపాను వీడి తెలుగుదేశం పార్టీలో చేరనున్నారన్న వార్తల నేపథ్యంలో జగన్ పాదయాత్ర ప్రారంభానికి ముందే కర్నూలు జిల్లా వెల్దుర్తి సమీపంలోని జాతీయ రహదారి పక్కనే ఏర్పాటు చేసిన రాత్రి బస ప్రాంతం నుంచి ఆమెతో మాట్లాడినట్లు పార్టీవర్గాల ద్వారా తెలిసింది.

Pages