S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

11/24/2017 - 04:26

డక్కిలి, నవంబర్ 23: చెన్నైలో ఆత్మహత్య చేసుకున్న సత్యభామ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థిని దువ్వూరు రాగ వౌనిక (19) అంత్యక్రియలు గురువారం మాటుమడుగులో జరిగాయ. నెల్లూరు జిల్లా డక్కిలి మండలం మాటుమడుగు గ్రామానికి చెందిన దువ్వూరు రాజారెడ్డి వాణిశ్రీ దంపతులకు ఇద్దరు కవల పిల్లలు. వారిలో మొదటి అమ్మాయి రాగవౌనిక. రాజారెడ్డి వ్యాపారరీత్యా హైద్రాబాద్‌లో స్థిరపడ్డారు.

11/24/2017 - 04:26

విశాఖపట్నం, నవంబర్ 23: ఆగ్నేయ బంగాళాఖాతం, దాన్ని ఆనుకుని ఉన్న తూర్పు బంగాళాఖాతంలో గురువారం అల్పపీడనం ఏర్పడినట్టు విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలియచేశారు. దీని ప్రభావం తెలుగు రాష్ట్రాలపై ప్రస్తుతానికి లేకపోయినా, ఉత్తర కోస్తాలో వచ్చే 24 గంటల్లో తేలికపాటి జల్లులు కురుస్తాయని చెప్పారు.

11/24/2017 - 03:28

విజయవాడ (బెంజిసర్కిల్), నవంబర్ 23: అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నటనకు కచ్చితంగా నంది బహుమతి ఇవ్వాల్సిందేనని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, మాజీ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. మొదటి నుంచీ రైతులకు తీవ్ర అన్యాయం చేస్తున్న బాబు ఇప్పటికీ మారండం లేదని, రైతులకు అన్నింటా అన్యాయం చేస్తూ రైతు వ్యతిరేకిగా మరోసారి నిరూపించుకున్నారని విమర్శించారు.

11/24/2017 - 03:27

అమరావతి, నవంబర్ 23: వైసీపీ అధినేత జగన్‌పై ఉన్న కేసులకు సంబంధించిన అంశాన్ని మళ్లీ జనంలోకి తీసుకెళ్లాలని టీడీపీ నాయకత్వం నిర్ణయించింది. త్వరలో జైలుకు వెళ్లబోయే ఆయనతో ప్రజలు, ఆ పార్టీ కార్యకర్తలు ఉంటారా? అనే ప్రశ్నలతో జనంలోకి వెళ్లాలని పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన పార్టీ నాయకులకు సూచించారు. గురువారం జరిగిన పార్టీ కీలక నేతల సమవేశంలో దీనికి సంబంధించి ఆయన పలు సూచనలు చేశారు.

11/24/2017 - 03:26

విజయవాడ, నవంబర్ 23: రాష్ట్ర మాంసాభివృద్ధి సంస్థ చైర్మన్‌గా అనంతపురానికి చెందిన పేరిమి ప్రకాష్ నాయు డు నియమితులయ్యారు. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సంస్థకు ముగ్గురు డైరెక్టర్లు, మరో ముగ్గుర ఎక్స్ అఫీషియో డైరెక్టర్లతో బోర్డును కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

11/24/2017 - 03:25

నెల్లూరు, నవంబర్ 23: జిల్లా, రాష్టస్థ్రాయిలో సమీక్షలు, వీడియోకాన్ఫరెన్స్‌లు, టెలీకాన్ఫరెన్స్‌లు, సెట్‌కాన్ఫరెన్స్‌లు బాగా పెరిగిపోయాయని వాటి పేరుతో అధికారులను, ఉద్యోగులను వేధించవద్దని ఏపీఆర్‌ఎస్‌ఏ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు కోరారు.

11/24/2017 - 03:24

కాకినాడ, నవంబర్ 23: అన్ని పార్టీలకు సెంటిమెంట్‌గా ఉండే తూర్పు గోదావరి జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసిపి) గ్రూపులతో సతమతమవుతోంది. ఇటీవల జరిగిన కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో ఘోర పరాజయం నుండి పాఠాలను నేర్వకుండా, నేతల గ్రూపు రాజకీయాలతో మరింత దిగజారుతోందనే వాదన పార్టీ శ్రేణుల నుండే వినిపిస్తోంది.

11/24/2017 - 03:21

విజయవాడ, నవంబర్ 23: ప్రపంచంలో ఆర్థిక నేరం ఎక్కడ జరిగినా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పేరు బయటికొస్తోందని, ఆయన వల్ల రాష్ట్రానికి అప్రదిష్ట వస్తోందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, విద్యుత్ శాఖ మంత్రి కళా వెంకట్రావ్ విమర్శించారు. వెలగపూడి సచివాలయంలోని నాలుగో బ్లాక్ పబ్లిసిటీ సెల్‌లో గురువారం ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. జగన్ అవినీతి మూలాలు రోజుకొకటి బయటపడుతున్నాయని ధ్వజమెత్తారు.

11/23/2017 - 01:27

అమరావతి, నవంబర్ 22: ‘పోలవరం నా ఆశ, నా శ్యాస, ప్రాజెక్టు పూర్తికావడం నా జీవిత లక్ష్యం. కేంద్ర సహకారం అందిస్తేనే అది సాధ్యం. 2019 కల్లా ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరాన్ని పూర్తిచేసి తీరతాం అని పోలవరం ప్రాజెక్టు ఆర్‌ఆర్ ప్యాకేజీ కేంద్ర కమిటీ సభ్యులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.

11/23/2017 - 01:27

అమరావతి, నవంబర్ 22: శాసనసభ అన్నా, సభాపతి అన్నా తనకు అపారమైన గౌరవముందని, ఉమ్మడి రాష్ట్రంలో ఎమ్మెల్యేగా చేసిన తనకు సభా సంప్రదాయాలు తెలుసునని వైఎస్సార్సీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. తానెప్పుడూ సభాపతిని గానీ, సభనుగానీ అగౌరవపరచలేదని, కించపరచలేదని స్పష్టం చేశారు. అలా చేసినట్టు ఎవరైనా భావిస్తే క్షమించాల్సిందిగా కోరుతున్నానన్నారు.

Pages