S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

11/23/2017 - 01:06

విజయవాడ, నవంబర్ 22: ఆగస్టు నెల నుండి పెండింగ్‌లో ఉన్న మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల, ఔట్‌సోర్సింగ్ సిబ్బంది జీతాల ఫైలు ఆర్థిక శాఖ వద్ద ఉందని ఆంధ్రప్రదేశ్ మోడల్ స్కూల్స్ టీచర్స్ ఫెడరేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్ మురళీమోహన్, ఎన్ బోసుబాబులు ఒక ప్రకటనలో తెలిపారు.

11/23/2017 - 01:06

బేతంచెర్ల, నవంబర్ 22: వైసీపీ అధినేత వైఎస్.జగన్మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర బుధవారం 200 కిలోమీటర్లు దాటింది. ఈనెల 6వ తేదీ కడప జిల్లా ఇడుపులపాయ నుంచి పాదయాత్ర ప్రారంభించిన జగన్ చాగలమర్రి వద్ద కర్నూలు జిల్లాలోకి ప్రవేశించారు. అక్కడే వంద మైలురాయి దాటారు. బుధవారం 15వ రోజు బేతంచెర్ల మండలం ముద్దవరం గ్రామంలోకి ప్రవేశించగానే పాదయాత్ర 200 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది.

11/23/2017 - 00:56

ఖాజీపేట, నవంబర్ 22: కడపలోని వాణిజ్య పన్నులశాఖలో సీటీఓగా పనిచేస్తున్న టి.రమేష్‌కుమార్‌రెడ్డి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. ట్రాన్స్‌ఫోర్ట్ యజమాని నుంచి బుధవారం రూ.70 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ నాగరాజు అదుపులోకి తీసుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. రమేష్‌కుమార్‌రెడ్డి కడప నగరంలోని వాణిజ్య పన్నులశాఖలో సీటీఓగా పనిచేస్తున్నారు.

11/23/2017 - 00:53

కాకినాడ, నవంబర్ 22: సార్వత్రిక ఎన్నికల సమరం దగ్గరపడే కొద్దీ రిజర్వేషన్ల కుంపటి రాజుకుంటోంది. వివిధ కులాల రిజర్వేషన్ల జాబితాల్లో మార్పులు చేర్పులు చేస్తామని, మరికొన్ని కులాలను బిసిలుగా గుర్తిస్తామని 2014 ఎన్నికల్లో టిడిపి అధినేత చంద్రబాబు హామీలిచ్చారు. నేడు హామీల అమలు ముఖ్యమంత్రి చంద్రబాబుకు కత్తిమీద సాముగా తయారయ్యింది. చంద్రబాబు ఆయా వర్గాలకు రిజర్వేషన్లకు సంబంధించి హామీనిచ్చి నాలుగేళ్లవుతోంది.

11/23/2017 - 00:09

విజయవాడ, నవంబర్ 22: వ్యవసాయ రంగంలో అత్యుత్తమ విధానాలకు, ఆవిష్కరణలకు రైస్ కాన్‌క్లేవ్ వేదిక కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆకాంక్షించారు. విజయవాడలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రెండు రోజులపాటు జరగనున్న ఇండియా రైస్ కాన్‌క్లేవ్‌ను ఆయన బుధవారం ప్రారంభించారు.

11/23/2017 - 00:08

విజయవాడ (క్రైం), నవంబర్ 22: నకిలీ విత్తనాలతో నష్టపోయామంటూ కృష్ణాజిల్లా రైతులు చేపట్టిన ‘్ఛలో అసెంబ్లీ’ని పోలీసులు అడ్డుకున్నారు. విజయవాడకు తరలివచ్చిన రైతులు వెలగపూడి అసెంబ్లీకి బయలుదేరే సమయంలో వారిని నగర పోలీసులు రైల్వేస్టేషన్‌లోనే అడ్డుకున్నారు. పలువురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు స్టేషన్‌కు తరలించారు. దీంతో అరెస్టులను నిరసిస్తూ..

11/23/2017 - 00:07

విజయవాడ(బెంజిసర్కిల్), నవంబర్ 22: ప్రతిపక్షం లేని అసెంబ్లీ సమావేశాలు సజావుగా జరుగుతున్నాయిని అధికార పక్షం భావిస్తున్న తరుణంలో సొంత పార్టీ శాసన సభ్యుడు రాజీనామాకు సిద్ధపడటం బుధవారం అసెంబ్లీ లాబీల్లో తీవ్ర కలకలం రేపింది. శాసన సభ్యుడినైన తన విజ్ఞప్తిని అధికారులు ఖాతరు చేయడం లేదంటూ కన్నీటి పర్యంతమైన కృష్ణాజిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తన శాసన సభ్యత్వానికి రాజీనామా చేసేందుకు సిద్దపడ్డారు.

11/23/2017 - 00:07

విజయవాడ, (పటమట) నవంబర్ 22: రాష్ట్ర విభజన జరిగి, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఈ మూడు సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్‌లో రెండంకెల వృద్ధి రేటు సాధించగలగామని రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. బుధవారం ఉదయం శాసనసభలో 344 నిబంధన క్రింద ఎపీలో ‘రెండంకెల వృద్ధి రేటు’పై ప్రత్యేక చర్చ జరిగిన అనంతరం యనమల మాట్లాడుతూ భారతదేశ వృద్ధి రేటు కంటే ఏపీలో వృద్ధిరేటు ఎక్కువగా వుందన్నారు.

11/23/2017 - 00:06

పుట్టపర్తి, నవంబర్ 22: నేటితరం విద్యార్థులు సవాళ్లను ఎదుర్కొని ముందుకు సాగాలని లండన్‌కు చెందిన షెఫెల్డ్ యూనివర్శిటీ ప్రొఫెసర్ ఆంటోని ఆర్‌వెస్ట్ పేర్కొన్నారు. పుట్టపర్తి సత్యసాయి బాబా జయంతి ఉత్సవాల్లో భాగంగా బుధవారం సత్యసాయి డీమ్డ్ యూనివర్శిటీ 36వ స్నాతకోత్సవం ఘనంగా జరిగింది.

11/23/2017 - 00:05

విశాఖపట్నం, నవంబర్ 22: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ టీడీపీ కార్యకర్తలా అసెంబ్లీని నిర్వహిస్తున్నారని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ ఆరోపించారు. విశాఖలో బుధవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ నాయకుడు అంబటి రాంబాబుపై హక్కుల తీర్మానం చేయడం అర్ధరహితమని మండిపడ్డారు.

Pages