S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

11/01/2017 - 03:36

విజయవాడ, అక్టోబర్ 31: సర్దార్ వల్లభాయి పటేల్ జయంతిని పురస్కరించుకుని రాష్ట్రీయ ఏక్తా దివస్, భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతిని పురస్కరించుకుని రాష్ట్రీయ సంకల్ప్ దివస్‌లను మంగళవారం దేశవ్యాప్తంగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల మేరకు వెలగపూడి సచివాలయం మొదటి బ్లాకు సమావేశ హాలులో ఈ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు.

11/01/2017 - 02:03

విశాఖపట్నం, అక్టోబర్ 31: ఈస్ట్రన్ నేవల్ కమాండ్ (ఈఎన్‌సి) అధిపతిగా వైస్ అడ్మిరల్ కరంబీర్ సింగ్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకూ ఈఎన్‌సిగా పనిచేసిన బిస్త్ మంగళవారం పదవీ విరమణ చేశారు. ఆయన స్థానంలో కరంబీర్ సింగ్ నియమితులయ్యారు. విశాఖలోని తూర్పు నౌకాదళ ప్రధాన కార్యాలయంలో మంగళవారం సంప్రదాయబద్ధంగా జరిగిన కార్యక్రమంలో సింగ్ బాధ్యతలు చేపట్టారు.

11/01/2017 - 02:01

న్యూఢిల్లీ, అక్టోబర్ 31: సంక్షేమ పథకాలకు ఆధార్‌ను అనుసంధానం చేయాలని బిజెపి ప్రభుత్వం ఓ పక్క ప్రయత్నాలు చేస్తుంటే అదే పార్టీకి చెందిన సీనియర్ నేత, ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి దానికి భిన్నంగా స్పందించారు. ప్రభుత్వ పథకాలకు ఆధార్‌ను లింక్ చేయడం వల్ల జాతి భద్రతకు ముప్పుగా పరిణమిస్తుందని స్వామి ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర నిర్ణయం ముమ్మాటికి దేశ భద్రతకు చేటేనని మంగళవారం ఆయన స్పష్టం చేశారు.

11/01/2017 - 02:05

అనంతగిరి, అక్టోబర్ 31: కొత్తవలస-కిరండోలు రైలు మార్గంలో పునరుద్ధరణ పనులు చురుగ్గా జరుగుతున్నాయి. ఈ నెల 6న కెకెలైన్‌లో 67/18 కిలోమీటర్ వద్ద కప్పిలవలస జలపాతం నుంచి పెద్ద బండరాయి పడడంతో రైల్వే వంతెన పూర్తిగా దెబ్బతిని ఈ మార్గంలో రైళ్ల రాకపోకలను పూర్తిగా నిలిపివేసారు. ఈ వంతెన పునరుద్ధరణ ఏ విధంగా చేపట్టాలని రైల్వే యంత్రాంగం వారం రోజుల పాటు కసరత్తు చేపట్టింది.

11/01/2017 - 01:59

న్యూఢిల్లీ, అక్టోబర్ 31: ఉద్యోగాలు, ఉపాధి కల్పనే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్‌లో టూరిజం అభివృద్ధికి అన్ని చర్యలు చేపడుతున్నామని రాష్ట్ర పర్యటక, సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రి భూమా అఖిలప్రియ పేర్కొన్నారు. ఢిల్లీ పర్యాటనలో భాగంగా ఉపరాష్టప్రతి వెంక య్య నాయుడు, కేంద్ర మంత్రులు మహేశ్ శర్మ, అల్ఫో న్సో కన్నన్‌తనమ్‌లను కలిసినట్టు అఖిలప్రియ చెప్పారు.

11/01/2017 - 01:58

కాకినాడ, అక్టోబర్ 31: భారీ, మధ్యతరహా పరిశ్రమల్లో సంభవించే ప్రమాదాలను అరికట్టడానికి ఆఫ్‌లైన్ ఎమర్జెన్సీ ప్లాన్ అమలుకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధమవుతోంది. రాష్ట్రంలో పారిశ్రామికంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న తూర్పుగోదావరి జిల్లాలో ఈ ప్రణాళిక అమలుకు అధికారులు రంగం సిద్ధంచేస్తున్నారు. ఇందు కు అత్యవసర సామగ్రి నిధి (ఎక్విప్‌మెంట్ బ్యాంకులు) ఏర్పాటుచేయనున్నారు.

11/01/2017 - 01:58

మారేడుమిల్లి, అక్టోబర్ 31: తూర్పు గోదావరి జిల్లా మారేడుమిల్లి మండలం గుజ్జుమామిడివలస-కుండాడ రహదారిలో మంగళవారం శిథిల కల్వర్టు కూలిన ఘటనలో ఒక లారీ బోల్తాపడి గిరిజన మహిళ మృతిచెందింది. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలిలావున్నాయి... మారేడుమిల్లి మండలం గుజ్జుమామిడి వలస, కుండాడ రహదారిలోని కల్వర్టు శిధిల స్థితికి చేరుకుంది.

11/01/2017 - 01:57

విశాఖపట్నం, అక్టోబర్ 31: శ్రీలంకకు ఆనుకుని బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని విశాఖపట్నం వాతావరణ హెచ్చరిక కేంద్రం మంగళవారం రాత్రి పేర్కొంది. దీని ప్రభావంతో దక్షిణకోస్తాలో ఒకటి రెండుచోట్ల వర్షాలు పడే అవకాశం ఉందని, తమిళనాడులో భారీ వర్షాలు, ఏపీలో నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఒక మోస్తారు వర్షలు పడే అవకాశాలున్నట్టు ఈ కేంద్రం వివరించింది.

11/01/2017 - 01:56

హైదరాబాద్, అక్టోబర్ 31: ఆంధ్ర జీవనాడి పోలవరం ప్రాజెక్టును ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కమిషన్లు ఇచ్చే పాడి ఆవులా చూస్తున్నారని వైకాపా అధికార ప్రతినిధి పార్ధసారథి ధ్వజమెత్తారు. మంగళవారం ఇక్కడ ఆయన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ రూ.16వేల కోట్ల పోలవరం ప్రాజెక్టు అంచనాలను రూ. 50 వేల కోట్లకు పైగా పెంచారని ఆరోపించారు. తాజాగా మరో రెండు నుంచి మూడు వేల కోట్లు నిర్మాణ వ్యయం పెరుగుతుందంటున్నారన్నారు.

11/01/2017 - 01:56

హైదరాబాద్, అక్టోబర్ 31: సదావర్తి భూములపై తమిళనాడు ప్రభుత్వం, వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన రెండు పిటిషన్లను హైకోర్టు విచారించి, ఈ వ్యవహారంపై కౌంటర్ అఫిడవిట్‌ను వచ్చే రెండు వారాల్లోగా దాఖలు చేయాలని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. చెన్నైలో ఏపి వేలం వేసిన 84 ఎకరాల సదావర్తి భూముల్లో తమిళనాడు ప్రభుత్వానికి చెందిన ప్రభుత్వ భూములు ఉన్నాయని కోర్టుకు తెలిపింది.

Pages