S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

11/01/2017 - 01:55

రాజమహేంద్రవరం, అక్టోబర్ 31: ఇసుక ఉచితమే అయినప్పటికీ మాఫియా మాటున ధర మాత్రం అనుచితంగా మారింది. గోదావరి ఇసుక మాఫియా గుప్పెట చిక్కుకుని కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. మాఫియా చేతిలో ఇసుక రోజువారీ కోట్ల రూపాయల వ్యాపారంగా మారింది. కొన్ని ర్యాంపులకు మాత్రమే అనుమతి ఉండటంతో డిమాండ్‌ను ఆసరా చేసుకుని ఇసుక ధరలకు రెక్క లు వచ్చాయి.

10/31/2017 - 03:45

విజయవాడ, అక్టోబర్ 30: ఎడారి ప్రాంతాలైన దుబాయ్, అబుదాబి అద్భుత ప్రగతి సాధించాయి.. మత్స్యకార గ్రామం సింగపూర్ అభివృద్ధికి చిరునామా అయ్యింది.. అన్ని వనరులు ఉన్న ఆంధ్రప్రదేశ్ మరింత ప్రగతి సాధించాలి.. అందుకు అందరూ సహకరించాలి.. భాగస్వాములు కావాలి.. అభివృద్ధికి మారుపేరుగా ఆంధ్రప్రదేశ్ మారాలి. అధికారులు, ప్రజాప్రతినిధులు సమష్టిగా కృషి చేయాలి.. అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.

10/31/2017 - 03:44

రాజమహేంద్రవరం, అక్టోబర్ 30: పోలవరం ప్రాజెక్టు ఎడమ ప్రధాన కాల్వ ఎలైన్‌మెంట్ పరిధిలోని వంతెన పనులను శరవేగంగా పూర్తిచేయడానికి ప్రత్యేక ఏజెన్సీలకు అప్పగించారు. 2018 నాటికి గ్రావిటీ ద్వారా పోలవరం నీరివ్వాలనే లక్ష్యానికి అనుగుణంగా ఎల్‌ఎంసి పరిధిలో మిగిలిపోయిన పనులపై కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది.

10/31/2017 - 03:42

భీమవరం, అక్టోబర్ 30: రాష్ట్రంలోని ఫించనుదారుల లైఫ్ సర్ట్ఫికెట్లను ప్రభుత్వం డిజిటలైజేషన్ చేయనుంది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను ఖజానా, ఉప ఖజానా కార్యాలయాలకు రాష్ట్ర ఆర్ధిక శాఖ పంపించింది. నవంబర్ 1వ తేదీ నుంచి రాష్ట్రంలో ఉన్న సుమారు 4 లక్షల మంది ఫించనుదారుల లైఫ్ సర్ట్ఫికెట్లు డిజిటలైజేషన్ చేయనుంది. 2018 ఏప్రిల్ 8వ తేదీ వరకు ఖజానా కార్యాలయాల్లో డిజిటలైజేషన్ చేయనున్నారు.

10/31/2017 - 03:40

విశాఖపట్నం, అక్టోబర్ 30: కేంద్రానికి తొత్తులా రాష్ట్రంలో టిడిపి ప్రభుత్వం పాలిస్తోందని వామపక్ష పార్టీలు మండిపడ్డాయి. బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు వామపక్ష పార్టీ కార్యాలయాల్లోకి చొరబడి, దాడులకు తెగబడుతుంటే కనీసం ఖండించేందుకు కూడా ప్రభుత్వం ముందుకు రాకపోవడం దారుణమని విశాఖలో సోమవారం జరిగిన సమావేశంలో ఆరోపించారు.

10/31/2017 - 03:18

విశాఖపట్నం, అక్టోబర్ 30: విశాఖ, తూర్పు గోదావరి జిల్లాల్లో సాగవుతున్న గంజాయి పంటపై ఉక్కుపాదం మోపేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఇందుకోసం మంగళవారం నుంచి ఈ రెండు జిల్లాల్లోని 11 మండలాల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని నిర్ణయించినట్టు ఎక్సైజ్ కమిషనర్ లక్ష్మినరసింహం తెలియచేశారు.

10/31/2017 - 03:17

విజయవాడ, అక్టోబర్ 30: రోడ్డు ప్రమాదాల నివారణ.. ముఖ్యంగా ఆర్టీసీ బస్సుల ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు చెప్పారు. ఈ ప్రమాదాల నివారణకు ఇక కట్టుదిట్టమైన చర్యలు తీసుకోబోతున్నామన్నారు.

10/31/2017 - 03:17

హైదరాబాద్, అక్టోబర్ 30: ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు మనీలాండరింగ్ వ్యవహారాలకు సింగపూరే కేంద్రమని వైఎస్‌ఆర్‌సిపి అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ఆరోపించారు. చంద్రబాబు, ఆయన పరివారమంతా ఆస్తులు అక్కడే కూడ గట్టారని ఆరోపణల మీద ఆరోపణలు గుప్పించారు. చంద్రబాబు వైఖరి చూస్తుంటే రాను రాను సింగపూరే ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటారేమోనని ఎద్దేవా చేశారు.

10/31/2017 - 00:04

విజయవాడ, అక్టోబర్ 30: దేశానికే ఆంధ్రప్రదేశ్ ఆదర్శం కావాలనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యానికి అనుగుణంగా మెప్మా అడుగులు వేస్తోంది. ఇప్పటికే మహిళా పొదుపు సంఘాల్లో ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టిన బాబు విధానాలను దేశవ్యాప్తంగా ప్రచారం చేయడానికి మెప్మా సిద్ధమవుతోంది.

10/31/2017 - 00:03

విజయవాడ, అక్టోబర్ 30: అరుదైన కాన్సర్ వ్యాధితో బాధపడుతున్న మహిళకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆర్థిక సాయం ప్రకటించారు. గుంటూరు జిల్లా చినకాకానికి చెందిన 25 ఏళ్ల ఎస్సీ మహిళ ఈపూరి దివ్య సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి సాయం కోసం అభ్యర్థించగా, ఆమె పరిస్థితి చూసి చలించిన ముఖ్యమంత్రి బోన్ మారో మార్పిడి నిమిత్తం రూ.15 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు.
శ్రీధర్ మృతిపట్ల సంతాపం

Pages