S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

04/21/2016 - 14:52

కడప: వైకాపా అధినేత వైఎస్ జగన్ గురువారం ఉదయం ఒంటిమిట్టలోని కోదండరామాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు జరిపారు. బుధవారం రాత్రి జరిగిన స్వామివారి కల్యాణోత్సవంలో సిఎం చంద్రబాబు దంపతులు, గవర్నర్ నరసింహన్ పాల్గొనగా, ఈరోజు జరిగిన రథోత్సవంలో జగన్ పాల్గొన్నారు.

04/21/2016 - 14:51

విశాఖ: విశాఖ జిల్లా రూరల్ ఎస్పీ కె.ప్రవీణ్ సమక్షంలో గురువారం ఉదయం మావోయిస్టు పార్టీ సభ్యురాలు ఝాన్సీ, మిలీషియా సభ్యులు లక్ష్మయ్య, అప్పారావు లొంగిపోయారు. ఝాన్సీపై పోలీసులు ఇదివరకే 4 లక్షల రూపాయల రివార్డు ప్రకటించారు.

04/21/2016 - 14:51

అనంతపురం: జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రి పరిటాల సునీత ఆధ్వర్యంలో పరిటాల రవీంద్ర ట్రస్టు గురువారం వెంకటాపురంలో నిర్వహించిన సామూహిక వివాహాలకు ఎపి సిఎం చంద్రబాబు హాజరయ్యారు. దాంపత్యబంధంతో ఒక్కటైన 250 జంటలను ఆయన ఆశీర్వదించారు. మంత్రి కామినేని శ్రీనివాస్, ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు, టిడిపి నేత పయ్యావుల కేశవ్ తదితరులు హాజరయ్యారు.

04/21/2016 - 12:20

గుంటూరు: మద్యం తాగిన కొద్ది సేపటికే ఇద్దరు మరణించిన ఘటన అమరావతి మండలం పునుగోడులో గురువారం ఉదయం జరిగింది. ఉదయం ఏడు గంటల ప్రాంతంలో కాటంరాజు (55), నీలయ్య (36) మద్యం సేవించి కాసేపటికే అపస్మారక స్థితిలో పడిపోయారు. స్థానికులు ఆస్పత్రికి తరలిస్తుండగా ఇద్దరూ మరణించారు. వీరు అతిగా తాగడం వల్ల మరణించరా? లేక మద్యంలో కల్తీ జరిగిందా? అనే విషయాలపై అధికారులు విచారణ జరుపుతున్నారు.

04/21/2016 - 12:19

అనంతపురం: ఎపి మంత్రి పరిటాల సునీత ఈరోజు 250 జంటలకు సామూహిక వివాహాలు జరిపిస్తున్నారు. రామగిరి మండలం తిరుమల దేవర ఆలయంలో ఈ కార్యక్రమానికి ఘనంగా ఏర్పాట్లు చేశారు. కరవుతో అలమటిస్తున్న గ్రామీణ ప్రాంత వాసులను ఆదుకోవాలన్న సంకల్పంతో ఉచిత వివాహాలను పరిటాల కుటుంబం ఏటా నిర్వహిస్తోంది.

04/21/2016 - 12:18

కడప: రాష్ట్ర విభజన వల్ల ఎపికి ఎన్నో సమస్యలు ఎదురవుతున్నందున నిధులిచ్చి ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపైనే ఉందని సిఎం చంద్రబాబు అన్నారు. ఆయన గురువారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడుతూ, విభజన చట్టంలోని హామీలన్నీ అమలు చేయాల్సి ఉందన్నారు. ఆ హామీల అమలు కోసం అవసరమైతే కేంద్రంతో రాజీలేని పోరాటం చేస్తామన్నారు.

04/21/2016 - 12:18

కర్నూలు: జిల్లాలోని మంత్రాలయంలో బుధవారం రాత్రి ఓ గర్భిణిపై అత్యాచార యత్నం జరిగింది. ఈ ఘటనపై బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ఆగంతకుడి కోసం గాలిస్తున్నారు.

04/21/2016 - 12:17

అనంతపురం: ఎపి సిఎం చంద్రబాబు గురువారం అనంతపురం జిల్లా పర్యటన సందర్భంగా కదిరి మండలం కె.లోచర్ల వద్ద హంద్రీనీవా సాగునీటి ప్రాజెక్టు పనులను పరిశీలించారు. వచ్చే జూన్‌లోగా పనులను పూర్తి చేయాలని ఇరిగేషన్ అధికారులను ఆయన ఆదేశించారు.

04/21/2016 - 12:16

నెల్లూరు: సైదాపూరు మండలం కొమ్మిపాడు వద్ద గురువారం రోడ్డుపై ఆగి ఉన్న లారీని ఓ కారు ఢీకొనడంతో ఇద్దరు మరణించారు. ఈ ఘటనలో గాయపడిన 8మందిని ఆస్పత్రికి తరలించారు.

04/21/2016 - 10:56

హైదరాబాద్, ఏప్రిల్ 20: పులివెందులకు చివరికి దాహం తీర్చేది చంద్రబాబునాయుడేనని టిడిపి నేత, ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు పేర్కొన్నారు. బుధవారం ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లో ముద్దు కృష్ణమ నాయుడు పాత్రికేయులతో మాట్లాడుతూ 21 మంది ఎమ్మెల్యేలు తమను సంప్రదిస్తున్నారని పేర్కొంటూ వ్యాఖ్యానించిన జగన్ వాస్తవ పరిస్థితిని ఇప్పటికైనా అర్థం చేసుకుని మాట్లాడాలని అన్నారు.

Pages