S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

10/29/2017 - 03:27

విజయవాడ, అక్టోబర్ 28: వారసత్వాన్ని ప్రతిబింబించేలా రాజధాని అమరావతి డిజైన్లు రూపొందిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. తెలుగువారి అత్మగౌరవం, ఆత్మవిశ్వాసం ఈ భవనాల్లో కనబడే విధంగా తీర్చిదిద్దుతున్నారని తెలిపారు. ఈ భవనాలు చూడగానే ‘ నా తల్లి.. నా జన్మభూమి’ అన్న అనుభూతి కలిగే విధంగా ప్రజల ఆకాంక్షలకు, ఆలోచనలకు అనుగుణంగా రాజధానిని రూపూందిస్తున్నామన్నారు.

10/29/2017 - 03:26

విజయవాడ, అక్టోబర్ 28: పోలవరం ప్రాజెక్టు సహా రాష్ట్భ్రావృద్ధిని ప్రతిపక్ష నేత అడ్డుకుంటున్నారని, ఆయన అజెండా ఏమిటో చెప్పాలని వైకాపా అధినేత జగన్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలా? వద్దా? అని ప్రశ్నించారు. ఇప్పుడు పూర్తి చేయకపోతే, పోలవరం ప్రాజెక్టును ఎప్పటికీ పూర్తి చేయలేమన్నారు. ఇది పూర్తి చేయలేకపోతే అది దారుణ చరిత్రగా మిగిలిపోతుందని వ్యాఖ్యానించారు.

10/29/2017 - 03:23

పెందుర్తి(సబ్బవరం) అక్టోబర్ 28: కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో 222 ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖామంత్రి కామినేని శ్రీనివాస్ వెల్లడించారు. పెందుర్తిలో సుమారు 4.43కోట్ల రూపాయల వ్యయంతోనిర్మించిన 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రి భవనాన్ని ఆయన శనివారం ప్రారంభించారు.

10/29/2017 - 03:20

హైదరాబాద్, అక్టోబర్ 28: ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకే తమ పార్టీ శాసనసభ్యులంతా అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉంటున్నామని వైఎస్‌ఆర్‌సిపి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌లో సిఎం చంద్రబాబు నాయుడు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ఆరోపించారు. ఈ వ్యవస్థ నుంచి ప్రజలను కాపాడుకునేందుకే తమ పార్టీ అధినేత వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర చేపట్టారని అన్నారు.

10/29/2017 - 03:19

నెల్లూరు, అక్టోబర్ 28: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో సోమశిల జలాశయం కింద ఈ ఏడాది ఖరీఫ్‌లో సాగుకు 4.92 లక్షల ఎకరాలకు సాగునీరు అందివ్వనున్నారు. శనివారం నెల్లూరులో జరిగిన జిల్లా సాగునీటి సలహా మండలి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అయితే వివిధ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, సాగునీటి సంఘాధ్యక్షుల నుండి వచ్చిన విజ్ఞప్తి మేరకు ఈ పరిధి మరి కొంత పెంచే అవకాశం లేకపోలేదు.

10/29/2017 - 03:18

కర్నూలు/నంద్యాల టౌన్, అక్టోబర్ 28: సిఐడి డిఎస్పీ హరినాథ్‌రెడ్డి అక్రమాస్తులపై రాయలసీమ జిల్లాల్లో ఎసిబి అధికారులు శనివారం ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. కర్నూలు, కడప, అనంతపురం జిల్లాలతో పాటు బెంగళూరులో సోదాలు నిర్వహించారు. హరినాథ్‌రెడ్డి గతంలో నంద్యాలలో డిఎస్పీగా పనిచేశారు. కర్నూలు నగరంలోని కృష్ణానగర్‌లో ఆయన పేర రెండు భవనాలు ఉన్నాయి.

10/29/2017 - 03:18

విజయనగరం, అక్టోబర్ 28: మహిళలపై అసభ్యంగా ప్రవర్తిస్తే వారిని శంకరగిరి మాన్యాలకు పట్టించడం ఖాయమని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి స్పష్టం చేశారు. శనివారం ఆమె జెడ్పీ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ మహిళలపై జరుగుతున్న దాడుల్లో ఎక్కువ మంది ఆటో డ్రైవర్ల వల్లేనని ఇటీవలి సంఘటనలు రుజువు చేస్తున్నాయన్నారు.

10/29/2017 - 03:17

శాంతీపురం, అక్టోబర్ 28: ముగ్గురు ఆడపిల్లలకు జన్మనిచ్చిందని అక్కసుతో ప్రతిరోజు భర్త, అత్తల వేధింపులు భరించలేక ఇద్దరు కవల పిల్లతో కలసి ఓ తల్లి పాలారు నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన శనివారం మండలంలో జరిగింది. మృతుల బంధువుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.

10/29/2017 - 03:15

విజయవాడ, అక్టోబర్ 28: మార్కెట్‌లో జరిగే కల్తీ, ధరల మోసాలపై వినియోగదారులకు అవగాహన కల్పించాలని, అప్పుడే వారు అప్రమత్తమై ఇలాంటి వాటిని అరికట్టే అవకాశం వుంటుందని పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు.

10/28/2017 - 04:10

సింహాచలం, అక్టోబర్ 27: నిత్య చందనాచ్ఛాదితుడైన సింహాచలం శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి వారికి శ్రీచందనం కష్టాలు తప్పడం లేదు. స్వామివారికి అవసరమైన గంధం చెక్కలను సమకూర్చుకోవడం దేవస్థానం అధికారులకు సవాల్‌గా మారుతోంది. ప్రతి ఏటా తమిళనాడు రాష్ట్రం నుండి గంధం చెక్కలను కొనుగోలు చేసుకోవడం సంప్రదాయంగా వస్తోంది. రెండేళ్ల కిందట తమిళనాడు గంధం చెక్కల వ్యవహరంలో అనుకోని అవంతారాలు ఎదురయ్యాయి.

Pages