S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

10/28/2017 - 04:09

విశాఖపట్నం, అక్టోబర్ 27: ప్రపంచంలోని ఎతె్తైన పర్వతాల్లో ఒకటైన ఆఫ్రికాలోని కిలిమంజారో పర్వత శిఖరాన్ని విశాఖకు చెందిన పదేళ్ల బాలిక కామ్య అధిరోహించింది. విశాఖలోని తూర్పు నౌకదళంలో పనిచేస్తున్న కమాండర్ ఎస్.కార్తికేయన్ కుమార్తె కామ్య తన తల్లి లావణ్య కార్తికేయన్‌తో కలిసి ఆఫ్రికాలోని 5685 మీటర్లు/18652 అడుగుల ఎత్తులో ఉన్న వౌంట్ కిలిమంజారోను అధిరోహించింది.

10/28/2017 - 04:08

నెల్లూరు రూరల్, అక్టోబర్ 27: ప్రైవేటు విద్యా సంస్థలు తమ పేరుప్రతిష్ఠలు పెంచుకోవడం ఒక సంస్థలో చదువుతున్న ప్రతిభావంతులైన విద్యార్థులను మాయమాటలతో తమ సంస్థల్లో చేర్చుకోవడం పరిపాటిగా జరుగుతున్న విషయమే. అయితే ఒక నెల రోజుల క్రితం నెల్లూరు నారాయణ, శ్రీచైతన్య విద్యా సంస్థల మధ్య పోలీసు కేసుల వరకు వెళ్లింది.

10/28/2017 - 04:06

భీమవరం, అక్టోబర్ 27: రాష్ట్రంలో వెనుకబడిన తరగతుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్న జన్మభూమి కమిటీలను రద్దుచేయాలని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో శుక్రవారం జరిగిన బిసి చైతన్య మహాసభ డిమాండుచేసింది. బిసి కులానికి చెంది, చాయ్‌వాలాగా పేరొందిన ప్రధాని నరేంద్రమోదీ ఆధ్వర్యంలో త్వరలో పార్లమెంటు ఆమోదం పొందనున్న బిసి కమిషన్ బిల్లుతో బిసిల జీవితాల్లో మార్పులు చోటుచేసుకుంటాయని మహాసభ పేర్కొంది.

10/28/2017 - 04:05

డోన్, అక్టోబర్ 27: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన రూ. 5.5 కోట్ల నగదు భారీ దోపిడీ కేసులో ప్రధాన నిందితుడైన గజదొంగ భీంసింగ్ శుక్రవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందాడు. కర్నూలు జిల్లా డోన్ వద్ద గత నెల జరిగిన రూ.5.5 కోట్ల నగదు చోరీ కేసులో భీంసింగ్ ప్రధాన నిందితుడు.

10/28/2017 - 03:26

సీలేరు, అక్టోబర్ 27: మావోయిస్టులు మరోసారి పేట్రేగి ఆంధ్రా- ఒడిశా సరిహద్దు చిత్రకొండ సమీపంలోని ఎస్సార్ పైప్‌లైన్‌ను శుక్రవారం పేల్చివేసారు. దీంతో ఒడిశా, ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రాల పోలీసు ఉన్నతాధికారులు అప్రమత్తం అయ్యారు. మావోయిస్టులు వారి ఉనికిని చాటుకునేందుకు పలు సంఘటనలకు పాల్పడుతున్న నేపథ్యంలో పోలీసులు మరింత అప్రమత్తమై భద్రతా చర్యలు కట్టుదిట్టం చేస్తున్నారు.

10/28/2017 - 03:26

ముంచంగిపుట్టు, అక్టోబర్ 27: అటు ఒడిశా, ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు విద్యుత్ సరఫరా చేస్తున్న మాచ్‌ఖండ్ విద్యుత్ కేంద్రంలో శుక్రవారం సాయంత్రం ప్రమాదం చోటు చేసుకుంది. కేంద్రంలోని అయిదో నెంబర్ జనరేటర్‌లో షార్ట్‌సర్క్యూట్ జరగడంతో ఒక్కసారిగా కేంద్రంలోని సిబ్బంది ఉలిక్కిపడ్డారు. ఈ ప్రమాదం కారణంగా 124 మెగావాట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగిందని ప్లాంట్ సిబ్బంది పేర్కొన్నారు.

10/28/2017 - 03:25

విశాఖపట్నం, అక్టోబర్ 27: తమిళనాడు, పరిసరాలను ఆనుకుని ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు శుక్రవారం రాత్రి తెలిపారు. దీని ప్రభావంతో తమిళనాడు సహా దక్షిణ కోస్తాలో పలు చోట్ల తేలికపాటి వర్షాలు కురుస్తాయన్నారు. రాష్ట్రంలో మిగిలిన ప్రాంతం అంతా పొడి వాతావరణం ఉంటుందని తెలిపారు.

10/28/2017 - 03:25

వరదయ్యపాళెం, అక్టోబర్ 27: చిత్తూరు జిల్లా వరదయ్యపాళెం మండలంలో ఇటీవల డెంగ్యూ జ్వరంతో మరణాలు పెరిగిపోయాయి. దీనిపై స్థానిక అధికారులు వక్రీకరించి విషజ్వరంగా జిల్లా అధికారులకు నివేదికలు పంపించారు. అయితే మాజీ ఎంపి చింతా మోహన్ ఫిర్యాదును అందుకున్న కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ బృందం నిపుణులు బత్తలవల్ల గ్రామాన్ని సందర్శించి అవి డెంగ్యూమరణాలేనని నిర్ధారించారు.

10/28/2017 - 03:24

భీమవరం,అక్టోబర్ 27: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్ధానంలో అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) శుక్రవారం సోదాలు చేపట్టింది. దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ హోదాలో ఉన్న నల్లం సూర్యచక్రధరరావు అక్రమాలకు పాల్పడ్టారంటూ వచ్చిన ఫిర్యాదులపై ఎసిబి డిఎస్పీ వలవల గోపాలకృష్ణ బృందం దేవస్థానం కార్యాలయంతో పాటు పలు విభాగాల్లో తనిఖీలు చేపట్టింది.

10/28/2017 - 03:24

రావులపాలెం, అక్టోబర్ 27: రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల్లో ఆర్భాటాలు తగ్గించి, ఆధ్యాత్మికత వాతావరణాన్ని పెంపొందించడానికి పూర్ణకుంభ స్వాగతాలను ముఖ్యమంత్రి, పీఠాధిపతులకు పరిమితం చేస్తూ నిర్ణయం తీసుకున్నామని, రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు తెలిపారు. తనతో సహా మంత్రులెవరికీ ఇకపై పూర్ణకుంభ స్వాగతాలు ఉండవన్నారు.

Pages