S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

10/28/2017 - 03:21

కాకినాడ సిటీ, అక్టోబర్ 27: నాటు తుపాకులతో హత్యలు, కిడ్నాప్‌లకు పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల ముఠాను తూర్పు గోదావరి జిల్లా పోలీసులు చాకచక్యంగా అరెస్టుచేశారు. ఈ ముఠాలో ఇద్దరు మాజీ నక్సల్స్ కూడా ఉండటం విశేషం. జిల్లా కేంద్రం కాకినాడలో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశలో జిల్లా ఎస్పీ విశాల్ గున్ని వివరాలు తెలిపారు.

10/28/2017 - 03:19

విజయవాడ, అక్టోబర్ 27: జగన్ పాదయాత్ర నిర్ణయం, అసెంబ్లీ బహిష్కరణ నిర్ణయం రెండూ పథకం ప్రకారం వేసిన ఎత్తుగడలేనని ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. నవంబర్‌లో అసెంబ్లీ శీతాకాల సమావేశం ఉంటుందని జగన్‌కు ముందే తెలుసు.. అలాగే సిబిఐ కోర్టులో కేసుల పెండింగ్ గురించి ముందే తెలుసు.. తెలిసి కూడా ఈ రెండింటినీ ఎగ్గొట్టేందుకే జగన్మోహనరెడ్డి ఈ ఎత్తుగడ వేశారని శుక్రవారం ఒక ప్రకటనలో యనమల పేర్కొన్నారు.

10/28/2017 - 00:27

హైదరాబాద్, అక్టోబర్ 27: విజయవాడలో జరుగనున్న సభలో పాల్గొనేందుకు ప్రొఫెసర్ కంచ ఐలయ్యకు ఎపి పోలీసులు అనుమతివ్వలేదు. శనివారం విజయవాడలో జరగనున్న సభకు తప్పకుండా హాజరుకావాలని సిద్ధమవుతున్న కంచ ఐలయ్యకు శుక్రవారం ఎపి పోలీసులు తార్నాకలోని ఆయన నివాసానికి వచ్చి నోటీసులు అందజేశారు. ఇంటి నుంచి బయటకు వస్తే అరెస్టు చేస్తామని, ఆయన నివాసం వద్ద ఎపి తెలంగాణ పోలీసులు మఫ్టీలో తిష్టవేశారు.

10/28/2017 - 00:26

విజయవాడ (క్రైం), అక్టోబర్ 27: వివాదాస్పద రచయిత కంచె ఐలయ్యను సమర్థిస్తున్న వర్గం, ఆయన వ్యతిరేక వర్గం ఒకేచోట, ఒకేరోజు సభలు ఏర్పాటు చేసుకునేందుకు ఉద్యుక్తులవుతున్న తరుణంలో విజయవాడలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సర్వత్రా ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. శాంతి భద్రతల దృష్ట్యా పోలీసులు మాత్రం ఈ రెండు వర్గాలకు అనుమతి ఇచ్చేందుకు నిరాకరించారు.

10/28/2017 - 00:25

న్యూఢిల్లీ, అక్టోబర్ 27: పోలవరం, వంశధార ప్రాజెక్టుల నిర్వాసితులకు న్యాయం చేయకపోతే జాతీయ స్థాయిలో ఉద్యమిస్తామని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ పేర్కొన్నారు. శుక్రవారం నాడు నారాయణ ఢిల్లీలో విలేఖరులతో మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వమే నిర్మించాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టుల నిర్వాసితుల అంశాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదని ఆయన ఆరోపించారు.

10/28/2017 - 00:24

విజయవాడ, అక్టోబర్ 27: అటవీశాఖ అధికారుల పనితీరు గురించి తన వద్ద సమగ్ర సమాచారం ఉందని, అధికారులంతా బాధ్యతాయుతంగా పనిచేసి శాఖకు మంచిపేరు తేవాలని రాష్ట్ర పర్యావరణ, అడవులు, శాస్త్ర, సాంకేతికశాఖ మంత్రి శిద్దా రాఘవరావు అన్నారు. శుక్రవారం ఉదయం వెలగపూడి సచివాలయంలోని మంత్రి తన కార్యాలయంలో అటవీశాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. వనం-మనంలో ఇప్పటివరకు సుమారు 23 కోట్ల మొక్కలు నాటినట్టు తెలిపారు.

10/28/2017 - 00:24

విజయవాడ, అక్టోబర్ 27: ముంబయి పర్యటనలో భాగంగా రియలన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీతో రాష్ట్ర ఐటి శాఖ మంత్రి లోకేష్ భేటీ అయ్యారు. రాష్ట్భ్రావృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేపడుతున్న వివిధ కార్యక్రమాలను, రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అనువైన వాతావరణం, తదితర అంశాలు వివరించారు. ఐటికి సంబంధించి తీసుకువచ్చిన విధానాలను వివరించారు. రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు.

10/28/2017 - 00:23

విజయవాడ, అక్టోబర్ 27: కోర్టుకు వెళ్తూ, పాదయాత్ర చేసి ప్రజలకు ఏం సందేశం ఇస్తారంటూ ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. విదేశీ పర్యటన ముగించుకుని వెలగపూడి సచివాలయానికి శుక్రవారం వచ్చిన ఆయన మీడియాతో కొద్దిసేపు ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు.

10/27/2017 - 04:02

విజయవాడ (క్రైం), అక్టోబర్ 26: సంచలన రచయిత కంచె ఐలయ్యకు విజయవాడలోని జింఖానా గ్రౌండ్స్‌లో ఈ నెల 28న ఆంధ్రప్రదేశ్‌లో దళిత సంఘాల జెఏసి తలపెట్టిన సన్మాన సభకు, అదే రోజు అక్కడే ఆర్యవైశ్య, బ్రాహ్మణ సంఘాల ఐక్యవేదిక తలపెట్టిన ఆత్మీయ సదస్సుకు పోలీసులు అనుమతి నిరాకరించారు. జింఖానా గ్రౌండ్స్‌లో దళిత సంఘాల జెఏసి ఆధ్వర్యాన కోమటోళ్లు స్మగ్లర్లు పుస్తక రచయిత కంచె ఐలయ్యకు సన్మానం జరపాలని నిర్ణయించారు.

10/27/2017 - 04:01

విజయవాడ, అక్టోబర్ 26: టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఇంధన శాఖ మంత్రి కళా వెంకట్రావును ఆయన నివాసంలో రాష్ట్ర టిడిపి నాయకులు పరామర్శించారు. గత కొంత కాలంగా సైనసైటీస్‌తో ఇబ్బంది పడుతున్న మంత్రి ఇటీవలే శస్తచ్రికిత్స చేయించుకున్నారు. ప్రస్తుతం కోలుకుంటున్న కళా వెంకట్రావును గురువారం విజయవాడలోని ఆయన నివాసంలో టిడిపి నాయకులు పరామర్శించి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు.

Pages