S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

02/10/2019 - 05:00

అమరావతి, ఫిబ్రవరి 9: క్రమశిక్షణ, పట్టుదలతో ఉన్నత శిఖరాలను అధిరోహించి తెలుగుజాతి గుండెల్లో చెరగని ముద్రవేసిన దివంగత ముఖ్యమంత్రి ఎన్‌టీ రామారావు ఓ దార్శనికుడని, భావితరాలకు స్ఫూర్తి అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉద్బోధించారు.

02/10/2019 - 04:57

అమరావతి, ఫిబ్రవరి 9: రాష్ట్రానికి తీరని ద్రోహం చేసిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాక ఓ దుర్దినం..చీకటి రోజని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఆయన అడుగులతో ఏపీ అపవిత్రమవుతుందని విమర్శించారు. విభజన గాయాలపై కారం చల్లేందుకే ప్రధాని వస్తున్నారని మండిపడ్డారు. మోదీ రాకను వ్యతిరేకిస్తూ శాంతియుతంగా రాష్టవ్య్రాప్తంగా నల్ల బ్యాడ్జీలు, నల్లచొక్కాలు ధరించి నిరసనలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.

02/10/2019 - 04:57

గుంటూరు, ఫిబ్రవరి 9: విభజన చట్టం ప్రకారం రూ.1.16 లక్షల కోట్లు ఆంధ్రప్రదేశ్‌కు రావాల్సి ఉండగా కేంద్రం ఇచ్చింది రూ. 15 వేల కోట్లు మాత్రమేనని, ఇవేనా మీరు రాష్ట్రానికి అధికంగా కేటాయించామని చెప్పుకుంటున్న నిధులు అంటూ ప్రధాని నరేంద్ర మోదీని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, మంత్రి కిమిడి కళా వెంకట్రావ్ ప్రశ్నించారు.

02/10/2019 - 04:56

విజయవాడ, ఫిబ్రవరి 9: ప్రధాని నరేంద్రమోదీ గుంటూరు సభలో నిజాలు బయటపెడతారేమోననేది రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు భయమని, ఈ కారణంతోనే మోదీ పర్యటనను అడ్డుకునేందుకు టీడీపీ ప్రయత్నిస్తోందని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు అన్నారు.

02/10/2019 - 04:31

ప్రత్తిపాడు, ఫిబ్రవరి 9: రిజర్వేషన్ తరగతులకు వర్తించే అన్ని సౌకర్యాలు కాపు సామాజిక వర్గానికి అందే వరకూ బీసీ రిజర్వేషన్ కోసం కాపులు చేస్తున్న పోరాటం ఆగదని మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన శనివారం ముఖ్యమంత్రికి లేఖ రాసి తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలోని ఆయన నివాసంలో విలేఖర్లకు అందజేశారు.

02/10/2019 - 04:29

రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 9: రాష్టవ్య్రాప్తంగా ఎన్టీఆర్ నగర్లలో గృహ ప్రవేశాల్లో భాగంగా తూర్పు గోదావరి జిల్లాలో గృహ ప్రవేశాలు శనివారం హడావిడిగా సాగాయి. పసుపూ కుంకుమ మాదిరిగానే ఈ కార్యక్రమం కూడా కోలాహలంగా సాగింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ భయం గుప్పెట ఈ గృహ ప్రవేశాలు ఇంకా వౌలిక సదుపాయాలు కొన్ని చోట్ల పూర్తి కాకుండానే హడావిడిగా సాగినట్టు కన్పిస్తోంది.

02/10/2019 - 04:28

విశాఖపట్నం, ఫిబ్రవరి 9: రాష్ట్రానికి మట్టి,నీరు ఇచ్చి మోసం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 10న రాష్ట్రానికి వస్తున్న నేపథ్యంలో ఖాళీ కుండలతో స్వాగతం పలకాలని ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ పిలుపునిచ్చారు. విశాఖలో శనివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజధాని నిర్మాణం సందర్భంగా ప్రధాని హోదాలో పాల్గొన్న మోదీ చేసిందే, ఆయనకు తిరిగి ఇద్దామన్నారు.

02/10/2019 - 04:27

విజయవాడ (పటమట) ఫిబ్రవరి 9: విజయవాడలోని గుణదల మేరీ మాత మహోత్సవాలు శనివారం ఉదయం వైభవంగా ప్రారంభమయ్యాయి.

02/10/2019 - 04:27

తిరుపతి, ఫిబ్రవరి 9: ఆంధ్రప్రదేశ్‌కు ప్రధాని మోదీ వస్తే అడ్డుకోబోమని, అయితే ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్న మోదీ ఏపీకి రావడానికి సిగ్గులేదా అని మాత్రమే అంటున్నామని రాష్ట్ర పరిశ్రమల శాఖా మంత్రి అమరనాథ్ రెడ్డి అన్నారు.

02/10/2019 - 04:26

తిరుపతి, ఫిబ్రవరి 9: భారతదేశంలోని సర్వర్ల మార్కెట్‌లో రానున్న నాలుగేళ్ల కాలంలో విలువ, వాల్యూమ్ పరంగా భారీగా వృద్ధి జరగనున్న నేపథ్యంలో అత్యున్నత శ్రేణి గ్రీన్‌ఫీల్డ్ సర్వర్లు, స్టోరేజీ ఉత్పత్తులను భారతదేశంలో మొత్తానికి తమ సంస్థ అందించడానికి సిద్ధమవుతోందని ఎక్సాట్రాన్ సీఈఓ సూర్యనారాయణణ్ బీ చెప్పారు.

Pages