S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

09/12/2017 - 01:38

చిత్తూరు, సెప్టెంబర్ 11: రష్యాలోని ఎతె్తైన పర్వతమైన వౌంట్ ఎల్బృస్ చిత్తూరు ఏఎస్పీ రాధిక విజయవంతంగా అధిరోహించి మరో అరుదైన రికార్టును సాధించారు. భారత దేశం నుంచి ఈ పర్వతాన్ని అధిరోహించిన తొలి మహిళా పోలీసు అధికారిగా కీర్తి గడించారు.

09/12/2017 - 01:35

విశాఖపట్నం, సెప్టెంబర్ 11: చేనేత వస్త్రాలకు బ్రాండ్ అంబాసిడర్‌గా సినీ నటి పూనమ్ కౌర్‌ను నియమిస్తున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. విశాఖలో స్నూకర్ పోటీలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి హాజరైన పూనమ్‌కౌర్ మాట్లాడుతూ తను డాక్టర్‌నో, ఇంజనీర్‌నో కావాలనుకున్నానని, అయితే, అనూహ్యంగా ఫ్యాషన్ టెక్నాలజీ రంగంలోకి అడుగుపెట్టానని అన్నారు.

09/11/2017 - 03:53

విజయవాడ, సెప్టెంబర్ 10: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో గృహ నిర్మాణంలో చోటుచేసుకున్న 4150 కోట్ల రూపాయల కుంభకోణంపై ప్రభుత్వం వౌనం వహించడం విమర్శలకు తావిస్తోంది. గృహ నిర్మాణంలో అక్రమాలను వెలుగులోకి తెచ్చిన రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టిన నిధులు రాబట్టడంలో వెనుకంజ వేస్తోంది. గతంలో కాంగ్రెస్ హయాంలో దాదాపు పదేళ్ల కాలంలో ఇందిరమ్మ పథకం కింద భారీ సంఖ్యలో ఇళ్లు నిర్మించారు.

09/11/2017 - 03:51

విజయవాడ, సెప్టెంబర్ 10: దేశ చరిత్రలోనే ఏ రాజకీయ పక్షానికీ అనుబంధం లేకుండా ఏపిఎస్‌ఆర్టీసీలో తిరుగులేని ఘన విజయాలతో వేలాది మంది కార్మికుల అండదండలతో ముందుకు సాగుతున్న నేషనల్ మజ్దూర్ యూనియన్ స్వర్ణోత్సవ వేడుకలు ఈ నెల 12న సాయంత్రం బస్‌స్టేషన్ సమీపంలోని కృష్ణానదీ తీరాన పద్మావతి ఘాట్‌లో వైభవంగా జరుగబోతున్నాయి.

09/11/2017 - 03:50

విజయవాడ, సెప్టెంబర్ 10: సెప్టెంబర్ 14వ తేదీ నాటికి ఉపాధ్యాయుల సర్వీసు రూల్స్ సిద్ధం చెయ్యాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అధికారులను ఆదేశించారు. ఎలాంటి జాప్యం లేకుండా ఉత్తర్వులు విడుదల చెయ్యాలని కూడా నిర్దేశించారు. ఉపాధ్యాయుల ఉమ్మడి సర్వీస్ రూల్స్ ముసాయిదాపై ఆదివారం కమిటీ సమావేశం విద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగింది.

09/11/2017 - 03:49

కాకినాడ, సెప్టెంబర్ 10: రాజకీయాల్లో రాణించాలనుకున్న మహిళలు ఎలా మాట్లాడకూడదో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నేత రోజాను చూసి, ఎలా మాట్లాడాలో బిజెపి నేత పురంధ్రీశ్వరిని చూసి నేర్చుకోవాలని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు సూచించారు. వీరిద్దరి మాటలు చూస్తే ఎలా ప్రవర్తించాలో ప్రజలకు ఇట్టే అర్థమవుతుందని వ్యాఖ్యానించారు.

09/11/2017 - 03:45

విజయవాడ, సెప్టెంబర్ 10: కార్మికుల హక్కులను కాపాడుకోవాలంటే ఐక్య ఉద్యమాలే శరణ్యమని, ఆందోళనల ద్వారానే డిమాండ్లను సాధించుకోగలుగుతామని ఎఐటియుసి జాతీయ కార్యదర్శి అమర్‌జిత్ కౌర్ అన్నారు. రాజ్యాంగబద్ధంగా సంక్రమించిన కార్మికుల హక్కులను కాలరాసేందుకు ప్రభుత్వాలు చేస్తున్న యత్నాలను ప్రతిఒక్కరూ అడ్డుకోవాల్సిన అవసరం ఉందన్నారు. దీనికోసం అన్ని కార్మిక సంఘాలు ఏకం కావాలని ఆమె పునరుద్ఘాటించారు.

09/11/2017 - 03:45

విజయవాడ, సెప్టెంబర్ 10: రైతు రుణమాఫీ ప్రక్రియలోని సాంకేతిక సమస్యల పరిష్కారానికి జిల్లాస్థాయిలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయడంతో పాటు 4, 5 విడతల్లోని రుణమాఫీ నిధులు ఒకేసారి విడుదల చేయాలని కోరుతూ రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో రైతుల సంతకాల సేకరణ జరపనున్నట్లు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి రామచంద్రయ్య, కెవివి ప్రసాద్ ఆదివారం నాడిక్కడ విలేఖరులకు తెలిపారు.

09/11/2017 - 03:44

విజయవాడ, సెప్టెంబర్ 10: హిందీ భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎప్పటిలా ఈ ఏడాది కూడా హిందీ భాషాభివృద్ధికి దక్షిణ భారతం స్థాయిలో విశేష కృషి చేసినవారికి మదనురే ప్రభు విశిష్ట హిందీ సేవా పురస్కార్-2017 అవార్డులను హిందీ సేవాసదన్ వ్యవస్థాపకులు, కార్యదర్శి ఎస్ గైబువల్లి ఆదివారం నాడిక్కడ ప్రకటించారు. ప్రచార విభాగంలో పోలిశెట్టి ఓబయ్యని ఎంపిక చేశారు.

09/11/2017 - 03:43

తిరుపతి, సెప్టెంబర్ 10: కలియుగ ప్రత్యక్ష దైవంగా కీర్తించబడుతున్న శ్రీ వేంకటేశ్వర స్వామివారి వైభవాన్ని, చారిత్రక, పౌరాణిక ప్రాశస్త్యాన్ని చాటిచెప్పే అపురూపమైన ఫొటోలను కలిగి ఉన్నవారు వాటిని ఈనెల 16వ తేదీలోగా తమకు అందించాలని టిటిడి పిఆర్వో డాక్టర్ తలారి రవి ఆదివారం ఒక ప్రకటనలో కోరారు.

Pages