S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

07/23/2017 - 01:21

నంద్యాల, జూలై 22: రాష్ట్రంలో పనిచేస్తున్న జర్నలిస్టులందరికీ మూడు పడకల గదుల ఇళ్లు నిర్మించి ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. కర్నూలు జిల్లా నంద్యాలలో శనివారం జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ జర్నలిస్టులకు ఇళ్ల నిర్మాణం గురించి కొంతమంది తన దృష్టికి తీసుకువచ్చారన్నారు. ప్రతి జర్నలిస్టుకు మూడు పడక గదుల ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

07/23/2017 - 01:20

కడప, జూలై 22: కన్నబిడ్డలు ఆదరించకపోవడంతో దిక్కులేక అనాథాశ్రమంలో చేరిన ఆ అభాగ్యులకు అక్కడా నిరాదరణే ఎదురైంది. సమయానికి భోజనం పెట్టక, తాగేందుకు గుక్కెడు నీళ్లు కూడా ఇవ్వక, రోగాలతో మంచాన పడితే పట్టించుకోకపోవడమేగాక చావచితగొట్టిన నిర్వాహకుల తీరుతో ప్రత్యక్ష నరకాన్ని చవిచూశారు. చివరకు దేవుడి రూపంలో వచ్చిన జిల్లా జడ్జి వారిని ఆ నరకం నుంచి బయటపడేశాడు.

07/22/2017 - 03:00

విజయవాడ/మంగళగిరి, జూలై 21: రాష్ట్రంలో వచ్చే రెండేళ్ల కాలంలో ఐటి, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో యువతకు రెండు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఐటి శాఖ మంత్రి లోకేష్ తెలిపారు. మేడిన్ ఆంధ్ర కార్యక్రమంలో తిరుపతిలో ఏర్పాటుచేసిన సెల్‌కాన్ కంపెనీ తయారుచేసిన స్మార్ట్ఫోన్‌ను వెలగపూడి సచివాలయం తన కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆవిష్కరించారు.

07/22/2017 - 02:57

విజయవాడ, జూలై 21: హైదరాబాద్‌లో ఈనెల 24 తేదీ నుంచి 27 తేదీ వరకు జరుగనున్న ప్రాంతీయ సమగ్ర వాణిజ్య ఒప్పందం ‘ఆర్‌సిఇపి’ సమావేశాల నుంచి భారత ప్రభుత్వం వైదొలగాలని రైతు స్వరాజ్య వేదిక ఆధ్వర్యంలో ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న రైతు, ప్రజా సంఘాల నేతలు డిమాండ్ చేశారు. ఈ సమావేశానికి మాజీ వ్యవసాయశాఖ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు అధ్యక్షత వహించారు.

07/22/2017 - 02:56

మంగళగిరి, జూలై 21: విజయవాడలో మెట్రో రైలుకు ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రానిక్ బస్సులు ప్రవేశపెట్టే ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో ఉందని రాష్ట్ర పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఐటిశాఖామంత్రి నారా లోకేష్ వెల్లడించారు. శుక్రవారం మంగళగిరి ఆటో నగర్ ఐటి పార్కులో ఫై కేర్ ఐటి కంపెనీ ప్రారంభించిన అనంతరం మంత్రి లోకేష్ విలేఖర్లతో మాట్లాడారు.

07/22/2017 - 02:56

ఏలూరు, జూలై 21: ఎలాంటి సందర్భంలోనైనా ఇంతకుముందే బాగుండేదన్న వ్యాఖ్య పశ్చిమగోదావరి జిల్లాలో అధికార తెలుగుదేశం పార్టీకి అతికినట్టు సరిపోతుంది. అధికారంలో లేని పదేళ్లపాటు ఒకే లక్ష్యంతో కలిసి పనిచేసిన పార్టీ నేతలు, కార్యకర్తలు అధికారంలోకి వచ్చాక ఎవరికి వారుగా తయారయ్యారు. అధికారంలోకివచ్చి, మూడేళ్లు దాటుతున్న తరుణంలో పరిస్థితిని సమీక్షించుకుంటే ఇంతకుముందే బాగుండేదన్న అభిప్రాయం వినిపిస్తోంది.

07/22/2017 - 02:55

అమరావతి, జూలై 21: అదేమిటి? సుమిత్రామహాజన్ స్థానంలో ఢిల్లీ మాజీ సీఎం షీలాదీక్షిత్ ఎప్పుడు లోక్‌సభ స్పీకరయిందని కంగారు పడుతున్నారా? అబ్బే.. అదేమీలేదు! సుమిత్ర మహాజన్ నిక్షేపంగా అదే పదవిలో కొనసాగుతున్నారు. షీలాదీక్షిత్‌లో ఇంకా యుపి ఎన్నికల అవమానభారం తొలగిపోలేదు. మరి షీలాదీక్షిత్‌ను లోక్‌సభ స్పీకర్ ఎవరు నియమించారనుకుంటున్నారా? ఇంకెవరు.. రాష్ట్ర రవాణాశాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు!

07/22/2017 - 02:54

విజయవాడ, జూలై 21: రాష్ట్రంలోని వివిధ ఇంజనీరింగ్ కళాశాలల్లో మొదటి విడత ఎంసెట్ కౌనె్సలింగ్ తరువాత 21 వేల సీట్లు భర్తీ కాకుండా మిగిలిపోయాయి. రెండో విడత కౌనె్సలింగ్‌కు సంబంధించి వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియ ప్రారంభమైంది. రాష్ట్రంలోని చాలా ఇంజనీరింగ్ కళాశాలల్లో విద్యాప్రమాణాలు నాసిరకంగా ఉండటంతో కొన్ని కళాశాల్లో చేరేందుకు విద్యార్థులు విముఖత చూపిస్తున్నారు.

07/22/2017 - 02:53

విజయవాడ, జూలై 21: సమగ్ర పాఠశాల ఆరోగ్య కార్యక్రమంలో భాగంగా ‘ఆదివాసీ ఆరోగ్యం’ కార్యక్రమాన్ని గిరిజన సంక్షేమ, గురుకుల విద్యా సంస్థల్లో ఆగస్టు 1వ తేదీ నుండి అమలు చేయనున్నట్లు గిరిజన సంక్షేమశాఖ ప్రత్యేక కమిషనర్ డా.ఎం.పద్మ తెలిపారు.

07/22/2017 - 02:52

విజయవాడ, జూలై 21: మరికొద్ది రోజుల్లో బిసి కమిషన్ తన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించబోతున్న నేపథ్యంలో సందర్శకులతో స్థానిక బిసి కమిషన్ కార్యాలయంలో రద్దీ పెరుగుతోంది. కాపు సంఘాల నేతలు, బిసి సంఘాల నేతలు శుక్రవారం ఒకేసారి బిసి కమిషన్ కార్యాలయానికి చేరుకోటంతో కొద్దిసేపు స్వల్ప ఉద్రిక్తత నెలకొంది.

Pages