S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

07/15/2017 - 01:33

నెల్లూరు, జూలై 14: నెల్లూరులోని శ్రీతల్పగిరి రంగనాథస్వామి దేవస్థాన ఆలయ కార్యనిర్వాహణాధికారి శ్రీనివాసులరెడ్డి ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నాడంటూ ఏసిబి అధికారులు శుక్రవారం నెల్లూరులోని ఆయన నివాసంతో పాటు మరో ఐదు ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు.

07/15/2017 - 01:32

శ్రీకాకుళం, జూలై 14: వైకాపా అధినేత జగన్మోహన్‌రెడ్డి అధికారం కోసం అర్రులు చాస్తున్నారని టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు, విద్యుత్ శాఖ మంత్రి కిమిడి కళావెంకటరావు విమర్శించారు. ఎన్నికల ముందు మెనిఫెస్టో విడుదల చేసే ఆచారం ఉందని, అయితే రెండేళ్ళ ముందుగానే మేనిఫెస్టో విడుదల చేయడంలో పార్టీ విలువలు, ఉద్దేశ్యం ఏమిటని కళా ప్రశ్నించారు.

07/15/2017 - 01:32

అమరావతి, జూలై 14: అభ్యుదయ కవితా పితామహుడు గురజాడ అప్పారావు రచించిన కన్యాశుల్కం నాటకం ప్రదర్శన 125 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా జాతీయ ఉత్సవాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే నెల 26, 27 తేదీల్లో నిర్వహించే కన్యాశుల్కం నూట పాతికేళ్ల జాతీయ ఉత్సవాలకు విశాఖపట్నం వేదిక కానుంది. 1892లో తొలిసారి ప్రదర్శించిన కన్యాశుల్కం నాటకం సరిగ్గా ఈ ఏడాది 125 ఏళ్లు పూర్తిచేసుకుంది.

07/15/2017 - 00:20

నెల్లూరు, జూలై 14: ఎంతో విలువైన ఎర్ర చందనంను ఇక్కడి స్మగ్లర్ల నుండి కొనుగోలు చేస్తూ విదేశాలకు తరలిస్తున్న అంతర్జాతీయ ముఠాను నెల్లూరు జిల్లా పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ పి హెచ్ డి రామకృష్ణ శుక్రవారం నెల్లూరులో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వివరించారు. ఆయన తెలిపిన సమాచారం మేరకు..

07/15/2017 - 00:19

విజయనగరం, జూలై 14: ఇక్కడి రాజీవ్ గాంధీ స్టేడియంలో ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ అక్టోబర్ 6న నిర్వహించనున్నట్టు ఆర్మీ రిక్రూటింగ్ ఆఫీసర్ కల్నల్ శశాంక్ వర్మ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆర్మీలో సుమారు 400 నుంచి 500 ఖాళీలు ఉన్నాయన్నారు. వాటిని భర్తీ చేసేందుకు ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు.

07/15/2017 - 00:19

అనంతపురం, జూలై 14: అనంతపురం జిల్లాలో ఈ ఏడాది ముందస్తుగా ఖరీఫ్ వేరుశెనగ పంటకు రక్షక తడులిచ్చి కాపాడుతామని మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం అనంతపురంలో రెయిన్‌గన్ల వినియోగంపై నిర్వహించిన జిల్లా స్థాయి వర్క్‌షాప్‌లో మంత్రులు మాట్లాడారు.

07/15/2017 - 00:18

తిరుపతి, జూలై 14: తిరుపతి రైల్వే డివిజన్ ఏర్పాటు సాధ్యం కాదని దక్షిణమధ్య రైల్వే బోర్డు చైర్మన్ ఎకె మిట్టల్ తేల్చి చెప్పారు. శుక్రవారం తిరుపతికి విచ్చేసిన ఆయన తిరుపతి రైల్వేస్టేషన్లో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ గుంతకల్ డివిజన్ పనితీరు బాగుందని ఈక్రమంలో తిరుపతి రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాల్సిన అవసరం కనిపించడంలేదని అన్నారు.

07/15/2017 - 00:17

అమరావతి, జూలై 14: నిస్సహాయ స్థితిలో తన సాయం కోసం వచ్చిన పలువురి బాధలు విని ముఖ్యమంత్రి చంద్రబాబు చలించిపోయారు. విజయవాడకు చెందిన మొక్కపాటి శ్రీనివాసరావుకు న్యూరోసర్జన్ చేయాల్సిన శస్తచ్రికకిత్సను ఆర్థోపెడీషియన్ చేశారు. శస్త్ర చికిత్స వికటించడంతో మూడేళ్లుగా శ్రీనివాసరావు మంచానికే పరిమితమయ్యారు. ఆయన భార్య అనూరాధ శుక్రవారం సచివాలయంలో ముఖ్యమంత్రి సందర్శకుల వేళలో బాబును కలిశారు.

07/15/2017 - 00:16

విజయవాడ, జూలై 14: తమ కార్పొరేషన్‌కు 14 సంవత్సరాల తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని కల్లుగీత కోపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ తాతా జయప్రకాష్ నారాయణ చెప్పారు. సచివాలయం 4వ బ్లాక్ పబ్లిసిటీ సెల్‌లో శుక్రవారం మధ్యాహ్నం ఆయన మీడియాతో మాట్లాడారు. 2003-04 ఆర్థిక సంవత్సరం తరువాత మళ్లీ ఇప్పుడు మాత్రమే విడుదల చేశారన్నారు.

07/15/2017 - 00:16

విజయవాడ, జూలై 14: కార్పొరేట్ విద్యాసంస్థలకు లబ్దిచేకూర్చే ఏపి సెల్ఫ్ ఫైనాన్స్‌డ్ ఇండిపెండెంట్ స్కూల్స్ యాక్ట్-2017ను తక్షణమే ఉపసంహరించుకోవాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పెనుమల్లి మధు ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. ఈ బిల్లు ద్వారా కార్పొరేట్ విద్యా సంస్థలను నియంత్రించకపోగా వాటిని మరింత బలోపేతం చేసే ప్రమాదం ఉందన్నారు.

Pages