S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

07/14/2017 - 03:16

అమరావతి, జూలై 13: రాష్ట్రంలోని అన్ని పట్టణాలు, నగరాల్లో ‘ఎన్టీఆర్ నగర్’ నిర్మాణాలు యుద్ధప్రాతిపదికన చేపట్టాలని, పక్కా ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారు. గురువారం తన నివాసం నుంచి పట్టణాల్లో ఇళ్ల నిర్మాణంపై అధికారులు, ప్రజాప్రతినిధులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. మన రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణం దేశానికే నమూనా కావాలన్నారు.

07/14/2017 - 03:15

విశాఖపట్నం, జూలై 13: నవ్యాంధ్రలో విద్యా ప్రమాణాల మెరుగే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. విశాఖ ఆంధ్రా యూనివర్శిటీలో గురువారం జరిగిన కార్యక్రమంలో చైనాకు చెందిన జిఎన్ యూనివర్శిటీతో ఎయు అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.

07/14/2017 - 03:08

అమరావతి, జూలై 13: విద్యుత్ శాఖ వివిధ పద్దుల కింద తీసుకున్న రుణాల వడ్డీ రేట్లు తగ్గించుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్ ఆ శాఖ అధికారులను ఆదేశించారు. గురువారం సచివాలయంలో విద్యుత్ శాఖ అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో విద్యుత్ శాఖ ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్, జెన్కో ఎండి విజయానంద్‌తో సహా పలువురు అధికారులు పాల్గొన్నారు.

07/14/2017 - 03:08

తిరుపతి, జూలై 13: చౌకదుకాణాల ద్వారా సెప్టెంబర్ నుంచి పంచదారను ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నట్లు రాష్ట్ర పౌరసరఫరాలశాఖామంత్రి పత్తిపాటి పుల్లారావు చెప్పారు. గురువారం ఆయన తిరుపతిలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో జిల్లాలోని ఆహారభద్రతా కమిటీ, వినియోగదారులు, గ్యాస్, రేషన్ డీలర్ల అసోసియేషన్లు, తూనికలు, కొలతలు, జిల్లా పౌరసరఫరాలశాఖ పనితీరుపై ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

07/14/2017 - 03:07

ఏలూరు, జూలై 13: రాష్ట్రంలో కాపునేత ముద్రగడ పద్మనాభం తలపెట్టిన పాదయాత్రకు అనుమతి లేదని రాష్ట్ర డిజిపి ఎన్ సాంబశివరావు స్పష్టం చేశారు. ఈపరిస్థితుల్లో యువతరం అప్రమత్తంగా ఉండి కేసుల్లో ఇరుక్కోకుండా భవిష్యత్‌ను కాపాడుకోవాలని ఆయన హితవు పలికారు. ఏలూరు రేంజ్ పరిధిలో శాంతిభద్రతలు, ఇతర అంశాలపై గురువారం పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ఆయన మూడు జిల్లాల పోలీసు అధికారులతో సమావేశమయ్యారు.

07/14/2017 - 03:06

విజయవాడ, జూలై 13: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి రాజధాని రంగంలో నిర్మించనున్న హైకోర్టు భవన డిజైన్ బాగుందని ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రమేష్ రంగనాథన్ సంతృప్తి వ్యక్తం చేశారు. హైకోర్టు చీఫ్ జస్టిస్ రమేష్ రంగనాథన్‌తోపాటు సీనియర్ జడ్జీలకు హైదరాబాద్‌లో గురువారం నార్మన్ ఫోస్టర్స్ ప్రతినిధులు డిజైన్లపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.

07/14/2017 - 03:05

విశాఖపట్నం (జగదాంబ) జూలై 13: టెన్త్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంట్ పరీక్షా ఫలితాలను మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు విశాఖలో గురువారం విడుదల చేశారు. సప్లిమెంట్ పరీక్షలకు 46,605 మంది హాజరుకాగా, 33,221 మంది ఉత్తీర్ణులై 71.37 శాతం సాధించినట్టు తెలిపారు. ఫలితాల్లో 94.38 శాతంతో నెల్లూరు జిల్లా ప్రధమ స్థానంలో నిలవగా, 60.17 శాతంతో కృష్ణా జిల్లా చివరి స్థానంలో నిలిచింది.

07/14/2017 - 03:05

విజయనగరం,, జూలై 13: విశాఖ జిల్లా దాకమర్రి పంచాయతీ పరిధిలోని లెండి కళాశాలకు సమీపంలో గురువారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృత్యువాతపడగా, మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. గురువారం సాయంత్రం 4.45 గంటల సమయంలో లెండి ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన బస్సు విజయనగరం నుంచి విశాఖపట్నం వైపు వెళ్తుండగా, ఎదురుగా వస్తున్న అంబులెన్స్ ఢీకొంది.

07/14/2017 - 03:04

విశాఖపట్నం, జూలై 13: ఉత్తర బంగాళాఖాతంలో 7.6 కిలోమీటర్ల పైన ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు గురువారం రాత్రి తెలిపారు. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో కోస్తాలో అక్కడక్కడ ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

07/14/2017 - 03:04

అనంతపురం అర్బన్, జూలై 13: రద్దయిన పాతనోట్లు మార్పిడి చేసే ముఠాను అనంతపురం జిల్లా పోలీసులు గురువారం అరెస్టు చేశారు. 11 మంది సభ్యుల ముఠా నుంచి రూ.కోటి విలువగల రూ. వెయ్యి, రూ.500 పాట నోట్లు స్వాధీనం చేసుకున్నారు. ముఠాలో ఓ కాంట్రాక్టర్, మరో డాక్టర్, కానిస్టేబుల్ ఉండడం గమనార్హం. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.

Pages