S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

07/04/2017 - 00:23

విజయవాడ, జూలై 3: హైకోర్టు తాజాగా తీర్పుఇచ్చిన సదావర్తి సత్రం భూముల వ్యవహారంలో ఆసక్తికర వివాదం తెరపైకి వచ్చింది. కోర్టు తాజా తీర్పుపై భూమి హక్కుదారు మందాల సంజీవరెడ్డి తన అభ్యంతరం వ్యక్తం చేశారు. తాము రూ.22.44 కోట్లకు వేలంలో 43 ఎకరాలను స్వంతం చేసుకున్నామని వాటికి ధర నిర్ణయించడానికి మంత్రులు ఎవరని ఆయన ప్రశ్నించారు. భూమి తీసుకోమని ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డికి ఎలా చెబుతారని ప్రశ్నించారు.

07/04/2017 - 00:23

విజయవాడ, జూలై 3: అధికారులకు ముందు చూపు లేకపోవడం వల్లే రాష్ట్రంలో మద్యం దుకాణాల ఏర్పాటుకు సంబంధించి కష్టాలు వచ్చాయని రాష్ట్ర ఆబ్కారీ శాఖ మంత్రి జవహర్ వ్యాఖ్యానించారు. వెలగపూడి సచివాలయంలో ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పు పక్కాగా అమలు చేస్తున్నందు వల్ల దుకాణాల ఏర్పాటులో సమస్యలు వస్తున్నాయని తెలిపారు.

07/04/2017 - 00:20

చిత్తూరు, జూలై 3: చిత్తూరు జిల్లా పోలీసులకు మోస్ట్ వాంటెడ్‌గా ఉన్న అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ కర్నాటకకు చెందిన హాజీ నాజిర్‌ను అరెస్టుచేసి, కారుతోపాటు నాలుగు ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకొన్నట్లు చిత్తూరు టాస్క్ ఫోర్సు డిఎస్పీ గిరిధర్ తెలిపారు. డిఎస్పీ కథనం మేరకు బెంగళూరు నగరానికి చెందిన హజీ నాజర్ (48) గత నాలుగేళ్లుగా దేశంలోనే ఎర్రచందనం అక్రమ రవాణాలో కీలకపాత్ర వహిస్తున్నట్లు చెప్పారు.

07/04/2017 - 00:20

గార్లదినె్న, జూలై 3: అనంతపురం జిల్లా గార్లదినె్న మండలం రామదాస్‌పేట గ్రామం వద్ద జాతీయరహదారిపై సోమవారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మరో ఆరుగురికి గాయాలయ్యాయి. శ్రీశైల మల్లన్న దర్శనానికి వెళ్లిన తమిళ కుటుంబం తిరుగుప్రయాణంలో ప్రమాదం బారిన పడింది.

07/04/2017 - 00:19

గుంటూరు, జూలై 3: గుంటూరు జిల్లాలోని పలు మండలాల్లో సోమవారం మధ్యాహ్నం భూ ప్రకంపనలు సంభవించాయి. జిల్లాలోని వినుకొండ, శావల్యాపురం మండల గ్రామాల్లో మధ్యాహ్నం 12.05 గంటలకు ఒక్కసారిగా ఇళ్లలోని సామాన్లు కదలటంతో పాటు ఎలక్ట్రానిక్ గృహోపకరణాల నుంచి వెలుగులు ప్రసరించి ఆగిపోవటంతో భయంతో స్థానికులు రోడ్లపైకి పరుగులు తీశారు. రెండు సెకన్ల పాటు భూమి కంపించింది.

07/04/2017 - 00:19

విజయవాడ, జూలై 3: పదోన్నతుల్లో తమకు అన్యాయం జరుగుతోందంటూ ఆర్థిక శాఖ ఉద్యోగులు సచివాలయంలో సోమవారం ఆందోళనకు దిగారు. సచివాలయ ఉద్యోగుల సహకార సంఘం ఆవరణలో ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మురళీకృష్ణ తమను పట్టించుకోవడం లేదని, దీంతో తమకు పదోన్నతుల్లో అన్యాయం జరుగుతోందంటూ ఆరోపించారు. మురళీకృష్ణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

07/04/2017 - 00:18

అమరావతి, జూలై 3: దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా జాతీయ ఉపాధి హామీ పథకం (నరేగా) కింద 13 కోట్ల పని దినాల మేండేట్‌ను ఆంధ్రప్రదేశ్‌లో సాధించామని, ఈ కృషిలో భాగస్వాములైన అధికార యంత్రాంగం, ప్రజా ప్రతినిధులు అందరికీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అభినందనలు తెలిపారు.

07/04/2017 - 00:18

నెల్లూరు, జూలై 3: నెల్లూరు నగర నడిబొడ్డున సోమవారం భారీ చోరీ జరిగింది. 57 సవర్ల బంగారు ఆభరణాలను గుర్తు తెలియని వ్యక్తులు దోచుకున్నారు. పోలీసులు తెలిపిన సమాచారం మేరకు నగరంలోని చంద్రవౌళినగర్‌లో శ్రీశైలం బాలసుబ్రహ్మణ్యం విజయమ్మ దంపతులు గత కొనే్నళ్లుగా నివసిస్తున్నారు. బాలసుబ్రహ్మణ్యం జిల్లాలోని జొన్నవాడ శ్రీ కామాక్షితాయి దేవస్థానంలో అర్చకత్వం నిర్వహిస్తుంటారు.

07/03/2017 - 03:56

రాజమహేంద్రవరం, జూలై 2: గోదావరి నదిలోకి కొద్ది కొద్దిగా వరద జలాలు చేరుతూ ఇన్‌ఫ్లోస్ సజావుగా ఉండటంతో ధవళేశ్వరం బ్యారేజి నుంచి ఆదివారం 37,362 క్యూసెక్కుల జలాలను సముద్రంలోకి విడిచిపెట్టారు. పట్టిసీమకు 8,500 క్యూసెక్కుల జలాలను గోదావరి నుంచి తోడారు. రోజూ ఇంచుమించు ఇదే స్థాయిలో పట్టిసీమకు గోదావరి జలాలను తోడుతున్నారు.

07/03/2017 - 03:54

పాడేరు, జూలై 2: విశాఖ మన్యంలో ఆంత్రాక్స్ క్రమేణా విస్తరిస్తోంది. ఒక గ్రామంలో ప్రారంభమైన ఈ వ్యాధి లక్షణాలు మిగిలిన ప్రాంతాలకు వ్యాపిస్తుండడంతో గిరిజనులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అరకులోయ మండలం కోడిపుంజువలస గ్రామానికి చెందిన మరో ఇద్దరికి, అరకులోయ సమీపాన పద్మాపురం గ్రామానికి చెందిన గిరిజనుడికి ఆంత్రాక్స్ లక్షణాలకు గురై కె.జి.హెచ్.లో చేరారు.

Pages