S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

06/26/2017 - 02:55

విజయనగరం, జూన్ 25: రాష్ట్రం లో అమరావతి నుంచి అనంతపూర్ వరకు ఆరులేన్ల రహదారి నిర్మాణానికి కేంద్రం అనుమతులు మంజూరయ్యాయని రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి సిహెచ్ అయ్యన్నపాత్రుడు వెల్లడించారు. కేంద్రం రూ.27వేల కోట్లు ఖర్చు చేయడానికి ముందుకు వచ్చిందన్నారు. ఇక్కడ జెడ్పీ అతిథి గృహంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

06/26/2017 - 02:54

చిత్తూరు, జూన్ 25: రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా ఎంటర్‌ప్రైజెస్ (ఎంఎస్‌ఎంఇ)కి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి ఎన్ అమరనాథ్‌రెడ్డి తెలిపారు. ఆదివారం చిత్తూరు జిల్లా పూతలపట్టులో ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ రాష్ట్రంలో వ్యవసాయ రంగం తరువాత ఎంఎస్‌ఎంఇ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుందన్నారు.

06/26/2017 - 02:53

విజయవాడ, జూన్ 25: మహాత్మా గాంధీ ఆశయాల్లో మద్యపాన నిషేధం ఒకటి. అయితే దాన్ని అమలు చేస్తే ప్రభుత్వాలకు కొంత ఆదాయం తగ్గుతుంది. ఆ ఆర్థిక లోటును భర్తీ చేయటానికి మహామేధావి చక్రవర్తుల రాజగోపాలాచారి రూపాయికి దమ్మిడీ అమ్మకం పన్నును విధించారు. దేశంలో అదే తొలి అమ్మకం పన్ను. అయితే కాలం గడిచిన కొద్దీ పాలకులు పన్నుల శాతం అనూహ్యంగా పెంచేశారు.

06/26/2017 - 02:20

విజయవాడ, జూన్ 25: రాష్టవ్య్రాప్తంగా ఈదుల్ ఫితర్ జరుపుకుంటున్న ముస్లిం సోదర, సోదరీమణులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ముస్లింల కోసం తమ ప్రభుత్వం అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని ఈసందర్భంగా పేర్కొన్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని 12 లక్షల ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫాను అందించామన్నారు.

06/26/2017 - 01:41

కాకినాడ, జూన్ 25: బ్యాంకులతో సంబంధం లేకుండా నేరుగా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా షెడ్యూల్డు కులాల లబ్ధిదారులకు రుణాలందించే ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది. ఈ మేరకు తూర్పు గోదావరి జిల్లా ప్రభుత్వ యంత్రాంగం అర్హులకు నేరుగా రుణాలు అందించే ప్రక్రియను ప్రారంభించింది. బ్యాంకర్ల నిర్లక్ష్యం కారణంగా ఎస్సీ కార్పొరేషన్‌కు సంబంధించిన రుణాలు మంజూరు కావడం లేదన్న విమర్శలు ఇటీవలి కాలంలో వెల్లువెత్తుతున్నాయి.

06/26/2017 - 01:41

కర్నూలు, జూన్ 25: కర్నూలు జిల్లాలోని నంద్యాల శాసనసభా స్థానానికి ఉపఎన్నిక అనివార్యమని తేలడంతో నియోజకవర్గంలో ఎన్నికల సమయంలో పెద్దఎత్తున నగదు ప్రభావం ఉంటుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఉపఎన్నికల్లో విజయాన్ని భూమా, శిల్పా కుటుంబాలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఓట్ల కొనుగోలుకు ఎంత ఖర్చయినా పెట్టే అవకాశాలు ఉన్నాయని అధికారులు సైతం అనుమానిస్తున్నారు.

06/26/2017 - 01:41

విజయవాడ, జూన్ 25: ‘పదవి ఇచ్చిన ముఖ్యమంత్రిపైనే తప్పుడు ప్రచారం చేయడం భావ్యమేనా?’ అంటూ రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఐవైఆర్ కృష్ణారావును తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయ కార్యదర్శి ఎవి రమణ ప్రశ్నించారు. కార్పొరేషన్ చైర్మన్ హోదాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడటం ఎంతవరకూ సమంజసంమని నిలదీశారు.

06/26/2017 - 01:40

విశాఖపట్నం, జూన్ 25: వాయువ్య బంగాళాఖాతంలో పశ్చిమ బెంగాల్, ఒడిశా తీరాన్ని ఆనుకుని ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో కోస్తా అంతటా ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. కోస్తాలో ఒకటి, రెండుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. వర్షాలు మరో రెండు రోజులు కొనసాగుతాయన్నారు.

06/26/2017 - 01:39

విజయవాడ, జూన్ 25: నంద్యాల ఉప ఎన్నికకు మాజీ మంత్రి శిల్పా మోహన్‌రెడ్డిని తమ పార్టీ అభ్యర్థిగా వైకాపా ప్రకటించింది. నంద్యాల నియోజకవర్గ సమన్వయకర్తగా ఆయనను నియమిస్తూ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్లు ఆదివారం పార్టీ అధికారిక ప్రకటనలో తెలిపింది.

06/26/2017 - 01:38

మడకశిర, జూన్ 25: బట్టలు ఉతకడానికి వెళ్లి ప్రమాదవశాత్తూ తోడికోడళ్లు నీటికుంటలో పడి మృతిచెందిన సంఘటన ఆదివారం అనంతపురం జిల్లా మడకశిర మండలం సి.కొడిగేహల్లి గ్రామంలో చోటుచేసుకుంది. సి.కొడిగేహల్లి గ్రామానికి చెందిన అన్నదమ్ములైన నరసింహమూర్తి, కొల్లారప్ప భార్యలు అరుణ (25), సింధు (22).

Pages