S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

08/06/2016 - 07:15

విశాఖపట్నం, ఆగస్టు 5: దేశంలోనే డిజిటల్ వ్యాలీగా విశాఖను తీర్చిదిద్దనున్నట్టు రాష్ట్ర ఐటి శాఖ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి ప్రకటించారు. ఉద్యోగాలకు కొదవ లేదని, సాంకేతికి పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకున్న ప్రతిభావంతులు పరిశ్రమకు కావాలన్నారు.

08/06/2016 - 07:14

విజయవాడ, ఆగస్టు 5: వృత్తి నైపుణ్య శిక్షణ, విస్తృత ప్రచారాలతో మల్బరీ తోటల పెంపకాన్ని గణనీయంగా వృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు రైతులకు ఆర్థికంగా చేయూతనిస్తోంది. మల్బరీ తోటల పెంపకం, పట్టుగూళ్ల అభివృద్ధి, నేత, అల్లికలు వంటి అంశాల్లో సమగ్ర శిక్షణ ఇస్తోంది. నాబార్డు, రిక్వీ, ఆర్మా వంటి సంస్థల సహకారంతో అధిక ఉత్పత్తి సాధనకు కృషి చేస్తోంది.

08/06/2016 - 07:14

విశాఖపట్నం, ఆగస్టు 5: రాష్ట్రంలో తెలుగు భాషను చంపే ప్రయత్నం జరుగుతోందని లోక్‌నాయక్ ఫౌండేషన్ అధ్యక్షుడు, మాజీ ఎంపి డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఆరోపించారు. శుక్రవారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు. రాష్ట్రంలో 4000 ప్రాథమిక పాఠశాలలను తెలుగు మీడియం నుంచి ఇంగ్లీషు మీడియంలోకి మార్చేందుకు ప్రభుత్వం నిర్ణయించడం దుర్మార్గమని వ్యాఖ్యానించారు.

08/06/2016 - 06:29

విజయవాడ, ఆగస్టు 5: కృష్ణా పుష్కరాలు.. రహదారుల విస్తరణ పేరిట విజయవాడ నగరంలో ఎడాపెడా పురాతన ఆలయాలను తొలగించడంపై దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు క్షమాపణ చెప్పారు. తొలగించిన కొన్ని ప్రధాన ఆలయాలను ప్రభుత్వ ఖర్చుతోనే పునఃప్రతిష్ఠ చేస్తామని ఆయన శుక్రవారం హామీ ఇచ్చారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా జీవో జారీ చేస్తామన్నారు.

08/06/2016 - 06:26

విజయవాడ, ఆగస్టు 5: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నగరంలో అంతర్జాతీయ స్థాయి విద్యా సంస్థల స్థాపనకు సింగపూర్‌కు చెందిన యునైటెడ్ వరల్డ్ కాలేజ్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏసియా ఫౌండేషన్ (యుడబ్ల్యుసిఎస్‌ఇఎఎఫ్) ముందుకు వచ్చింది. ఏపిసిఆర్‌డిఎ కార్యాలయంలో శుక్రవారం ఫౌండేషన్ ప్రతినిధులు సిఆర్‌డిఏ అధికారులతో జరిపిన సమావేశంలో విద్యాసంస్థల ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేశారు.

08/05/2016 - 17:59

శ్రీశైలం: భారీగా వరదనీరు వస్తుండటంతో శ్రీశైలం ప్రాజెక్టు జలకళను సంతరించుకుంటోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 835 అడుగులకు నీటిమట్టం చేరుకుంది. జలాశయంలోకి ప్రస్తుతం 2,61,212 క్యూసెక్కుల నీరు వస్తుండగా, 16,732 క్యూసెక్కుల నీటిని కిందికి విడుదల చేస్తున్నారు.
శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నాగార్జునసాగర్‌కు 16,732 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది.

08/05/2016 - 16:39

విజయవాడ: ఎపికి ప్రత్యేకహోదా ఇవ్వడంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరికి నిరసనగా టిడిపి ఎమ్మెల్యే బోండా ఉమా ఆధ్వర్యంలో శుక్రవారం ఇక్కడ ఆ పార్టీ కార్యకర్తలు, నేతలు వినూత్న రీతిలో ఆందోళన చేపట్టారు. చెవిలో పూలు పెట్టుకుని కార్లు, బైక్‌లను వారు శుభ్రం చేశారు. హోదా విషయంలో బిజెపి తీరు సరిగా లేదని వారు విమర్శించారు.

08/05/2016 - 15:42

విజయవాడ: కృష్ణా పుష్కరాలకు అత్యాధునిక సాంకేతికతతో భద్రత, నిఘా ఏర్పాటు చేస్తున్నామని, 17,500 మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని విజయవాడ పోలీసు కమిషనర్‌ గౌతమ్‌ సవాంగ్‌ శుక్రవారం తెలిపారు. 19 మంది ఐపీఎస్‌ అధికారులు భద్రతను పర్యవేక్షిస్తారని, 1300 సీసీ కెమెరాలతో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తామని , మరిన్ని బలగాలు కావాలని కేంద్రాన్ని కోరినట్లు వెల్లడించారు.

08/05/2016 - 13:00

రాజమహేంద్రవరం: రాజమహేంద్రవరంలోని ధవళేశ్వరం బ్యారేజీ వద్ద నీటి మట్టం 10 అడుగులకు పెరిగింది. దీంతో ఇరిగేషన్ అధికారులు 175 గేట్లను స్వల్పంగా ఎత్తి 4లక్షల47వేల క్యూసెక్కుల నీటిని సముద్రంలో విడుదల చేస్తున్నారు. ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరికి వరద ఉధృతి పెరిగింది.

08/05/2016 - 12:00

తిరుమల:ఇకపై 90 రోజులు ముందుగానే శ్రీవారి సేవా టికెట్లను అందజేయనున్నట్లు, ఆన్‌లైన్‌లో సేవా టికెట్లు అందుబాటులో ఉంచనున్నట్లు టీటీడీ ఈవో సాంబశివరావు శుక్రవారం ఉదయం తెలిపారు. నమూనా ఆలయంలో ఉదయం7 నుంచి 9వరకు భక్తులకు అనుమతి ఇస్తున్నామన్నారు. రాగి డాలర్లను నమూనా ఆలయం వద్ద విక్రయిస్తామని చెప్పారు. 40కోట్లతో బర్డ్‌ ఆస్పత్రిని అభివృద్ధి చేయనున్నట్లు ఈవో ప్రకటించారు.

Pages