S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

06/23/2017 - 00:34

గుంటూరు, జూన్ 22: దేశంలోనే సుందరనగరంగా పేరుగాంచిన విశాఖపట్నం బ్రాండ్ ఇమేజిని ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ దెబ్బతీస్తోందని గిరిజన, సాంఘిక సంక్షేమశాఖ మంత్రి నక్కా ఆనంద్‌బాబు ఆరోపించారు.

06/23/2017 - 00:34

విజయవాడ, జూన్ 22: విశాఖలో జరిగిన వైఎస్ జగన్ సభలో, ఆయన సమక్షంలోనే ఖాదర్ బాషా అనే వ్యక్తి వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనలో జరిగిన భూకబ్జాలను బట్టబయలు చేశారని టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు విమర్శించారు. లోకేష్‌పై బురద జల్లే ప్రయత్నంలో జగన్ తనపైనే బురద వేయించుకున్నారని గురువారం ఒక ప్రకటనలో కళా ఎద్దేవా చేశారు.

06/23/2017 - 00:33

విజయవాడ, జూన్ 22: రాష్ట్రాన్ని దోచుకొని 11 కేసుల్లో ఎ1, ఎ2 నిందితులుగా ఉన్న వాళ్లా ప్రజలకు మేలు చేసేది.. ప్రతిపక్ష పార్టీ జిమ్మిక్కులను విశాఖ ప్రజలు నమ్మే పరిస్థితి లేదని డిప్యూటీ సిఎం కెఈ కృష్ణమూర్తి విమర్శించారు. కిరాయి మనుషులను తరలిస్తూ మహాధర్నా పేరుతో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ డ్రామాలు చేస్తున్నారని గురువారం ఒక ప్రకటనలో విమర్శించారు.

06/23/2017 - 00:33

అమరావతి, జూన్ 22: కులాలతో పెనవేసుకున్న ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రెండు ప్రధాన కులాల ఉద్యమాలతో వేడెక్కనున్నాయి. రాష్ట్ర జనాభాలో అతిపెద్ద కాపువర్గం బీసీ రిజర్వేషన్ల డిమాండుతో మహాపాదయాత్రకు సిద్ధమవుతుండగా, తమ చిరకాల వాంఛితమైన వర్గీకరణ డిమాండ్‌తో మందకృష్ణ మాదిగ నేతృత్వంలో మాదిగలు భారీ బహిరంగసభకు సమాయాత్తమవుతున్నారు.

06/23/2017 - 00:32

విజయవాడ, జూన్ 22: హైదరాబాద్‌లో ఉన్న ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఎపిపిఎస్‌సి) కార్యాలయాన్ని విజయవాడకు తరలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గురువారం ఉత్తర్వులను జారీ చేసింది. ఇందుకోసం నగరంలోని ఎంజి రోడ్డులో కొత్తగా నిర్మించిన ఆర్ అండ్ బి భవనంలో 45 వేల చదరపు అడుగుల స్థలాన్ని రెండేళ్ల లీజ్‌కు తీసుకుంది. ఇందులో ఎపిపిఎస్‌సి కార్యాలయం ఏర్పాటు చేస్తారు.

06/23/2017 - 00:31

అమరావతి, జూన్ 22: రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారిన ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావును బ్రాహ్మణ కార్పొరేషన్ నుంచి అవమానకర రీతిలో తొలగించడాన్ని ఆ సామాజికవర్గానికి చెందిన ఐఏఎస్, ఐపిఎస్, మాజీ అధికారులు జీర్ణించుకోలేకపోతున్నారు. చివరకు రాష్ట్ర గవర్నర్ కూడా కృష్ణారావును ఆ విధంగా తొలగించాల్సింది కాదన్న అభిప్రాయం వ్యక్తం చేసినట్టు సమాచారం.

06/23/2017 - 00:30

విజయవాడ, జూన్ 22: బదిలీల తీరుపై ఆందోళనకు దిగిన ఉపాధ్యాయ సంఘ నేతలతో గురువారం రాత్రి విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు నివాసంలో జరిగిన చర్చలు సఫలమయ్యాయ. ప్రధానంగా వెబ్ కౌనె్సలింగ్ రద్దుకు మంత్రి అంగీకరించారు. దీంతో శుక్రవారం తలపెట్టిన చలో అమరావతి కార్యక్రమాన్ని ఉపాధ్యాయ సంఘాలు విరమించుకున్నాయ. రాత్రి 10 గంటలకు ప్రారంభమైన చర్చలు 12 గంటల వరకు కొనసాగాయ.

06/23/2017 - 00:29

విజయవాడ, జూన్ 22: పాఠశాలలు పునఃప్రారంభమైనప్పటికీ ఉపాధ్యాయుల బదిలీలు ముగియకపోగా, ఇందుకు సంబంధించిన మార్గదర్శక సూత్రాలు నేటికీ ఓ కొలిక్కి రాకపోవటంతో రాష్ట్ర వ్యాప్తంగా 61వేల 528 పాఠశాలల్లో పనిచేసే లక్షా 88వేల మంది ఉపాధ్యాయుల్లో గందరగోళ పరిస్థితి నెలకొంది. దీనికి తగ్గట్లుగా ఉపాధ్యాయులు రోడ్డెక్కిన ప్రతిసారీ ప్రభుత్వం ఒక్కో సవరణతో జీవో జారీ చేస్తున్నది.

06/23/2017 - 00:28

గుంటూరు, జూన్ 22: బ్రాహ్మణులు రాజకీయంగా ఎదగడం ఓర్చుకోలేని ప్రతిపక్ష జగన్మోహనరెడ్డి బ్రాహ్మణ సమాజంలో ఎమ్మెల్యే కోన రఘుపతిని శకునిగా వాడుకుంటూ చిచ్చుపెడ్తున్నారని బ్రాహ్మణ కార్పొరేషన్ గుంటూరు జిల్లా కో-ఆర్డినేటర్ సిరిపురపు శ్రీ్ధర్ ఆరోపించారు.

06/23/2017 - 00:28

విజయవాడ, జూన్ 22: మానస సరోవర్ యాత్రకు వెళ్లిన 21 మంది రాష్టవ్రాసులు నేపాల్‌లో చిక్కుకున్నారు. సమాచారం తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించి, ఢిల్లీలోని ఎపి భవన్ అధికారులతో గురువారం మాట్లాడారు. తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని అక్కడి అధికారులను ఆదేశించారు. ఖాట్మాండ్‌లోని భారత రాయబార కార్యాలయం అధికారులతో ఎపి భవన్ అధికారులు సంప్రదింపులు జరిపారు.

Pages