S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

06/22/2017 - 03:30

కర్నూలు, జూన్ 21: రాయలసీమలో అపారమైన వనరులు ఉన్నాయి. వాటిని సద్వినియోగం చేసుకుంటే శరవేగంగా అభివృద్ధి సాధించగలుగుతామని సిఎం చంద్రబాబు అన్నారు. బుధవారం కర్నూలు జిల్లాలో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.

06/22/2017 - 03:30

విజయవాడ, జూన్ 21: టీచర్ల బదిలీల మార్గదర్శకాల్లో ప్రభుత్వం మరోసారి మార్పులు చేసింది. 2017, ఏప్రిల్ 30 నాటికి రెండేళ్ల సర్వీసు పూర్తిచేసుకున్న ఉపాధ్యాయులు సైతం ఈ నెల 23లోపు బదిలీ దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం జీవో నెం.28 జారీ చేసింది. దీని ప్రకారం వందలాది మంది ఉపాధ్యాయులకు అవకాశం లభించింది.

06/22/2017 - 02:40

విజయవాడ, జూన్ 21: మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థల్లో ఏళ్ల తరబడి ఆడిటింగ్ నిర్వహించడం లేదు. 13 కార్పొరేషన్లు, పలు మున్సిపాలిటీల్లో కొన్ని సంవత్సరాలుగా ఆడిటింగ్ జరగాల్సి ఉంది. వేల కోట్ల రూపాయలకు సంబంధించి తగిన రికార్డులు సమర్పించకపోవడం, నిధుల దుర్వినియోగం, నిబంధనలు అతిక్రమించి నిధులు ఖర్చు చేయడం, బకాయిల వసూలు చేయకపోవడం వంటి అంశాలు పురపాలక శాఖ పాలన తీరును తెలియచేస్తోంది.

06/22/2017 - 02:39

విజయవాడ, జూన్ 21: ఉపాధ్యాయుల బదిలీలలో వెబ్ కౌనె్సలింగ్ విధానాన్ని రద్దు చేయాలని, ప్రతిభ ఆధారిత పాయింట్లను తీసివేయాలని, పాఠశాలల మూసివేతను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ఫ్యాప్టో, జాక్టో పిలుపు మేరకు బుధవారం రాష్టవ్య్రాప్తంగా 13 జిల్లాల డిఇఓ కార్యాలయాలను వేలాది మంది ఉపాధ్యాయులు దిగ్బంధనం చేశారు.

06/22/2017 - 02:39

విజయవాడ, జూన్ 21: వివిధ నియోజకవర్గాల్లోని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖ మంత్రి, టిడిపి విజయవాడ పార్లమెంటరీ పార్టీ ఇన్‌చార్జి నారా లోకేష్ తెలిపారు. వెలగపూడి సచివాలయంలో విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.

06/22/2017 - 02:38

విజయవాడ, జూన్ 21: ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధుల వినియోగంలో నిర్లక్ష్యం చూపొద్దని, ప్రభుత్వ పథకాలు సకాలంలో లబ్ధిదారులకు అందేలా చూడాలని సాంఘిక, సంక్షేమశాఖ మంత్రి నక్కా ఆనందబాబు స్పష్టం చేశారు. సచివాలయం మూడో బ్లాక్‌లోని తన కార్యాలయంలో 12 శాఖల అధికారులతో ఆయన బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. మూడేళ్లలో ప్రభుత్వం కేటాయించిన నిధులు, పనులు జరిగిన తీరును ఆయా శాఖల అధికారులను అడిగి తెలుసుకున్నారు.

06/22/2017 - 02:38

విజయవాడ (క్రైం), జూన్ 21: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి, బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఐవైఆర్ కృష్ణారావుపై సోషల్ మీడియాలో వచ్చిన అసభ్యకర పోస్టింగ్‌లపై బ్రాహ్మణ సంఘాలు ఒక్కసారిగా భగ్గుమంటున్నాయి. తెలుగుదేశం పార్టీకి చెందిన కార్యకర్తలే ఈ పోస్టింగ్‌లు పెట్టినట్టు ఆయా సంఘాలు ఆరోపిస్తున్నాయి.

06/22/2017 - 02:37

గుంటూరు, జూన్ 21: రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావును రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి తొలగించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య ఆధ్వర్యంలో బుధవారం గుంటూరు నగరంలోని శంకర్‌విలాస్ సెంటర్‌లో ధర్నా, రాస్తారోకో జరిపారు.

06/22/2017 - 02:14

విజయవాడ, జూన్ 21: మైనార్టీలు ప్రధాని నరేంద్ర మోదీ వెంటే ఉన్నారని భారతీయ జనతాపార్టీ మైనార్టీ మోర్చా జాతీయ అధ్యక్షుడు అబ్దుల్ రషీద్ అన్సారీ పేర్కొన్నారు.

06/21/2017 - 02:50

విజయవాడ, జూన్ 20: హజ్ యాత్ర కోసం విజయవాడ, కడపలలో హజ్‌హౌస్‌లు, కర్నూలులో మినీ హజ్ హౌస్‌లు నిర్మిస్తున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తెలిపారు. ఇమామ్ వౌజమ్‌లకు ఒక్కొక్కరికి 5వేలు, మూడువేల రూపాయల చొప్పున ఇస్తున్నామని అన్నారు. దేశంలో ఎక్కడా ఇలాంటివి ముస్లింలకు అందటం లేదని చెప్పారు. మంగళవారం రాత్రి విజయవాడ పంజాసెంటర్‌లో ఏర్పాటైన ఆత్మీయ ఇఫ్తార్ విందులో చంద్రబాబు పాల్గొన్నారు.

Pages