S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

06/21/2017 - 02:46

విజయవాడ, జూన్ 20: ప్రభుత్వాసుపత్రుల్లో చికిత్స పొందుతూ మృతి చెందినవారి మృతదేహాలను గౌరవప్రదంగా వారి ఇళ్లకు తరలించడానికి ప్రభుత్వం మహాప్రస్థానం కార్యక్రమాన్ని ప్రారంభించిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ తెలిపారు. సచివాలయం నాలుగో బ్లాక్‌లో ఉన్న పబ్లిసిటీ సెల్‌లో మంగళవారం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

06/21/2017 - 02:43

విజయవాడ, జూన్ 20: బ్రాహ్మణ సామాజికవర్గం అంటే ప్రభుత్వానికి చులకనభావం అని విజయవాడ నగర కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లాది విష్ణు విమర్శించారు. మంగళవారం ఆంధ్రరత్న భవన్‌లో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నీతి నిజాయితీగా బాధ్యతలు నిర్వహిస్తున్న బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ ఐవైఆర్ కృష్ణారావును అకారణంగా పదవి నుంచి తప్పించి, బ్రాహ్మణులపై ముఖ్యమంత్రి తన ప్రేమను చాటుకున్నారని ఎద్దేవా చేశారు.

06/21/2017 - 02:42

విజయవాడ, జూన్ 20: దేశీయ, అంతర్జాతీయ పర్యాటకానికి తోడ్పాటు అందించటంతో పాటుగా రాబోయే ఐదేళ్లలో 25వేల ఉద్యోగావకాశాలను సృష్టించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంగళవారం ఓలా సంస్థతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఎక్స్‌క్లూజివ్ కో బ్రాండెడ్ ఓలా, ఆంధ్రప్రదేశ్ టూరిజం కార్ల మొదటి బ్యాచ్‌ను జెండా ఊపి ప్రారంభించారు.

06/21/2017 - 02:39

విజయవాడ, జూన్ 20: రాష్ట్రంలోని సుబాబుల్ రైతులను ఆదుకుంటామని రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. విజయవాడ పార్లమెంటరీ స్థాయి టిడిపి సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా సుబాబుల్ రైతులు దాదాపు 300 మంది లోకేష్‌ను కలిసి తమ సమస్యను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన మంత్రి తప్పకుండా ఆదుకుంటామని తెలిపారు.

06/21/2017 - 02:39

ఒంగోలు అర్బన్,జూన్ 20: ఆర్ధిక నేరాలకు పాల్పడి డిపాజిటర్ల వద్ద అక్రమంగా నగదు వసూలు చేసి బోర్డు తిప్పేసిన అగ్రిగోల్డ్ చైర్మన్ అవ్వా వెంకటరామారావు, వైస్ చైర్మన్ అవ్వా వెంకటనరసింహరావు, ఇడి ఎహెచ్‌ఎస్‌వి ప్రసాద్‌లతోపాటు మరో తొమ్మిదిమంది డైరక్టర్లు మంగళవారం ఒంగోలులోని జిల్లాకోర్టుకు హాజరయ్యారు.

06/21/2017 - 02:38

విజయవాడ, జూన్ 20: వెలగపూడి సచివాలయంలోని సిఎం బ్లాక్‌లో కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం ప్రారంభించారు. స్టార్ ఆఫ్ ఫంక్షన్‌ను పూజాదికాలతో లాంఛనంగా ఆయన ప్రారంభించారు.

06/21/2017 - 02:34

గుంటూరు, జూన్ 20: అభివృద్ధి అనేది ఏ ఒక్కరో అడ్డుకుంటే ఆగేదికాదు.. నాడు భూ సమీకరణ కింద రైతులు భూములిచ్చారు.. ఇవ్వొద్దని రెచ్చకొట్టారు.. ఇప్పుడు ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణానికి అంకురార్పణ జరిగింది.. ప్రజల విశ్వసనీయత ఉంటే అవరోధాలు ఉండవని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రజలకు తాగునీరు, పౌష్టికాహారం తప్పని సరన్నారు.

06/21/2017 - 02:32

కర్నూలు, జూన్ 20: బికాం, బిటెక్ చదివిన బావబావమరుదులు డాక్టర్ల అవతారమెత్తారు. నకిలీ డాక్టర్ పట్టా సంపాదించి ఏకంగా కార్పొరేట్ ఆసుపత్రులు నిర్మించి చిన్నారులు, అమాయక ప్రజల ప్రాణాలకు వైద్యం చేసి వారి ప్రాణాలతో ఆడుకున్నారు. చివరకు విజిలెన్స్ అధికారులకు చిక్కి కటకటాలపాలయ్యారు. మంగళవారం కర్నూలు విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు జరిపిన దాడులతో ఈ మాయగాళ్ల అసలు రంగు బయటపడింది.

06/21/2017 - 02:30

రాజమహేంద్రవరం, జూన్ 20: ఎపి ఫైబర్‌నెట్ ద్వారా కేబుల్ వ్యవస్థను చేతుల్లోకి తీసుకుని, తద్వారా రాష్ట్రంలో మీడియాను నియంత్రించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోందని మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్‌కుమార్ సందేహం వ్యక్తంచేశారు. తమ పార్టీకి అనుకూలంగా, తమకు నచ్చిన చానెళ్లను ప్రజలపై రుద్దడానికి ప్రయత్నిస్తున్నారన్నారు.

06/21/2017 - 02:28

సూళ్లూరుపేట, జూన్ 20: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో భూ దూర పరిశీలన ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపడానికి సర్వం సిద్ధం చేసింది. ఈ నెల 23న నెల్లూరు జిల్లాలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ థావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి పిఎస్‌ఎల్‌వి-సి 38 రాకెట్ ప్రయోగానికి శాస్తవ్రేత్తలు ఏర్పాట్లు పూర్తిచేశారు.

Pages