S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

06/21/2017 - 02:08

హైదరాబాద్, జూన్ 20: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఎఐసిసి కార్యదర్శి, మాజీ రాజ్యసభ సభ్యుడు వి.హనుమంత రావు ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును డిమాండ్ చేశారు. నాడు మద్రాసు నుంచి ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణ త్యాగం చేసిన పొట్టి శ్రీరాములుకు తగిన గుర్తింపు ఇవ్వకపోవడం మంచిది కాదని ఆయన మంగళవారం విలేఖరుల సమావేశంలో అన్నారు.

06/21/2017 - 02:08

అనంతపురం సిటీ, జూన్ 20: అనంతపురం జిల్లాలో సర్వశిక్ష అభియాన్‌లో భారీ ఎత్తున అక్రమాలు జరిగాయి. మంజూరైన రూ.4 కోట్లను మళ్లించిన సిబ్బందిపై వేటు పడింది. అంతేగాక ఆమోదం తెలిపిన బడ్జెట్ కన్నా ఎక్కువ నిధులు కాంట్రాక్టర్లకు చెల్లించారు. ఈ అక్రమాలు ఎస్‌ఎస్‌ఏ ఎస్పీడి శ్రీనివాసులు ఆకస్మిక తనిఖీలో వెలుగుచూశాయి. వివరాలు ఇలా ఉన్నాయి.

06/21/2017 - 02:06

గాజువాక (విశాఖ), జూన్ 20: సమరశీల పోరాటాలతోనే ఆదివాసీల హక్కుల పరిరక్షణ సాధ్యం అవుతుందని కేరళ ముఖ్యమంత్రి పి. విజయన్ పేర్కొన్నారు. ఆదివాసీ అధికార్ రాష్ట్రీయ మంచ్ (ఎఎఆర్‌ఎం) 3వ జాతీయ మహాసభలను మంగళవారం స్టీల్‌ప్లాంట్ గురజాడ కళాక్షేత్రంలో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం విదేశీ కార్పొరేట్ బహుళ జాతి సంస్థలకు పట్టం కడుతూ ఆదివాసీల హక్కులను కాలరాస్తోందని విమర్శించారు.

06/21/2017 - 02:04

విశాఖపట్నం, జూన్ 20: అధికార టిడిపి ఇటీవల కాలంలో సెల్ఫ్‌గోల్స్ వేసుకుంటోంది. ముఖ్యంగా ప్రతిపక్ష నాయకుడు జగన్‌ను కట్టడి చేయడానికి ప్రయత్నించి టిడిపి నాలుక కరుచుకుంటోంది. ఒక్క విశాఖపట్నంలోనే జగన్‌ను నియంత్రించే క్రమంలో ఆ పార్టీ విఫలమవుతూ వచ్చింది. దీంతో ప్రజల్లోను, పార్టీ శ్రేణుల్లోను పార్టీ నేతల ప్రతిష్ఠ దిగజారుతోంది.

06/21/2017 - 02:03

భీమవరం, జూన్ 20: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్న వివిధ శాఖల మాదిరిగా పోలీస్ శాఖ కూడా అప్‌డేట్ అవుతోంది. ఆ శాఖ కోసం ఒక ప్రత్యేక యాప్ అందుబాటులోకి వచ్చింది. ‘ఖైజలా’ పేరుతో అందుబాటులోకి వచ్చిన ఈ ప్రత్యేక యాప్‌ను రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిజిపి) నుండి కానిస్టేబుల్ వరకు స్మార్ట్ఫోన్లలో నిక్షిప్తంచేసుకోవాల్సివుంటుంది. వాట్సాప్ మాదిరిగా ‘ఖైజాలా యాప్’ను రూపొందించారు.

06/21/2017 - 02:03

రాజమహేంద్రవరం, జూన్ 20: అఖండ గోదావరి నది ఎడమ గట్టుపై తూర్పు గోదావరి జిల్లా సీతానగరం మండలం పురుషోత్తపట్నం వద్ద నిర్మిస్తున్న పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ఆగస్టు 15న ప్రారంభించాలని ముఖ్యమంత్రి సంకల్పం నెరవేరే సూచనలు కనిపించడంలేదు. ప్రధానంగా ఈ పథకం పైపులైన్ పనులకు వర్షాలు ఆటంకంగా నిలుస్తున్నాయి. దీనికి తోడు పంపుహౌస్ నిర్మాణ పనులకు విఘాతం కలిగేలా జూలైలో నదికి వరద పోటు తగిలేలావుంది.

06/21/2017 - 00:14

అమరావతి, జూన్ 20: రాష్ట్రంలో రెండు బలమైన కులాల విషయంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అనుసరిస్తున్న ద్విపాత్రాభినయం ఆ పార్టీలో గందరగోళానికి కారణమవుతోంది. ఒకవైపు కాపులను బీసీల్లో చేర్చే ఉద్యమంలో పాల్గొని మద్దతు ప్రకటిస్తూనే, మరోవైపు కాపులకు రిజర్వేషన్లను వ్యతిరేకిస్తున్న బీసీలకు అన్యాయం జరుగుతోందంటూ చేస్తున్న ఆందోళనపై పార్టీలో అసంతృప్తి వ్యక్తమవుతోంది.

06/21/2017 - 00:14

విజయవాడ, జూన్ 20: మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు నెలకు కనీసం పదివేల రూపాయల చొప్పున ఆదాయం వచ్చే విధంగా చూడాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి ఆదేశాల మేరకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని మహిళా సాధికారత, శిశు సంక్షేమం, సెర్ప్ శాఖల మంత్రి పరిటాల సునీత తెలిపారు.

06/21/2017 - 00:13

విజయవాడ, జూన్ 20: రాష్ట్ర బ్రాహ్మణ్ కార్పొరేషన్ చైర్మన్ ఐవైఆర్ కృష్ణారావును తొలగించడంపై న్యాయపోరాటం చేస్తామని అఖిల భారత బ్రాహ్మిన్ ఫెడరేషన్ యువజన విభాగం అధ్యక్షుడు ద్రోణంరాజు రవి తెలిపారు. 1983లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే కరణీకాల వ్యవస్థను రద్దు చేసిందని తెలిపారు. అప్పటి నుంచి బ్రాహ్మణులు తెలుగుదేశానికి దూరంగా ఉంటున్నారని గుర్తు చేశారు.

06/21/2017 - 00:12

అమరావతి, జూన్ 20: బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి ఐవైఆర్ కృష్ణారావును ప్రభుత్వం అర్ధంతరంగా తొలగించిన వ్యవహారంలో నాయకత్వ స్వయంకృతమే ఎక్కువగా ఉందన్న అభిప్రాయాలు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి.

Pages