S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

11/09/2018 - 04:47

కాకినాడ: మాజీ ఎమ్మెల్యే గాదం కమలాదేవి (86) గురువారం తెల్లవారుజామున చికిత్స పొందుతూ కాకినాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆమెకు ముగ్గురు కుమారులు రమేష్, మహేష్, హరేష్, కుమార్తె అనూరాధ ఉన్నారు. కమలాదేవి 1972లో కాంగ్రెస్ పార్టీ తరపున పామర్రు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. ఈమె పిఏసీ ఛైర్మన్, టీటీడీ సభ్యురాలిగా బాధ్యతలు నిర్వర్తించారు.

11/09/2018 - 02:20

విజయవాడ, నవంబర్ 8: తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థుల ఎంపిక చివరి దశకు చేరిందని, ఒకటి, రెండు రోజుల్లో అభ్యర్థులను ప్రకటిస్తామని టీటీడీపీ నేత రావుల చంద్రశేఖర రెడ్డి తెలిపారు. తెలంగాణ టీడీపీ నేతలు ఎల్ రమణ, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, తదితరులతో కలిసి పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడితో గురువారం రావుల సమావేశమై అభ్యర్థుల ఎంపికపై చర్చించారు.

11/09/2018 - 02:18

గుంటూరు, నవంబర్ 8: రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు నిరంకుశ, నియంత పాలన కొనసాగిస్తున్నారని దీనిని అంతమొందించేందుకు ప్రజలతో కలిసి ప్రతిఘటిస్తామని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, ఎంపీ జీవీఎల్ నరసింహారావు పేర్కొన్నారు. ప్రశాంత వాతావరణంలో తమ ఎమ్మెల్యే పైడికొండల మాణిక్యాలరావును పరామర్శించేందుకు వెళుతున్న తమను పోలీసులు అడ్డగించడంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

11/09/2018 - 02:16

విజయవాడ, నవంబర్ 8: ఈ నెల 10, 11 తేదీల్లో అంతర్జాతీయ కవి సమ్మేళనాన్ని విజయవాడలో భారీ స్థాయిలో నిర్వహిస్తున్నామని మా లక్ష్మీ సంస్థల చైర్మన్ యార్లగడ్డ హరిశ్చంద్ర ప్రసాద్ తెలిపారు. గురువారం నాడిక్కడ ఆయన మీడియాతో మాట్లాడుతూ 16 దేశాల నుంచి 20 మంది, దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి 134 మంది మొత్తం 150 మంది కవులు పాల్గొంటున్నారని అన్నారు.

11/09/2018 - 02:15

విజయవాడ, నవంబర్ 8: కర్నాటక ఉప ఎన్నికల ఫలితాలు చంద్రబాబు నాయకత్వ పటిమ ఏమిటో మోదీకి తెలిసోచ్చేలా చేశాయని శాసనమండలిలో ప్రభుత్వ విప్ బుద్దా వెంకన్న అన్నారు.

11/09/2018 - 02:15

విజయవాడ (ఇంద్రకీలాద్రి) నవంబర్ 8: ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీకనకదుర్గమ్మ సన్నిధిలో అమ్మవారి భవానీదీక్షలు ఈనెల 19వ తేదీన ప్రారంభమై డిసెంబర్ 29వ తేదీతోపరిసమాప్తం కానున్నట్లు దేవస్థానం ఈవో వి కోటేశ్వరమ్మ ఒక ప్రకటనలో తెలిపారు. కనకదుర్గమ్మ సన్నిధిలో అర్ధ మండల దీక్షలు మార్గశిర శుద్ధ విదియ నుండి మార్గశిర శుద్ధ షష్టి.. డిసెంబర్ 9వ తేదీ నుండి 13వ తేదీ వరకు జరుగుతాయి.

11/09/2018 - 02:14

విజయవాడ, నవంబర్ 8: జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ భారతీయ జనతా పార్టీకి అధికార ప్రతినిధిగా పని చేస్తున్నారని, ఆ పార్టీ ఎంపీ జీవీఎల్‌కు డూపుగా నటిస్తున్నారంటూ టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య ఎద్దేవా చేశారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో గురువారం జరిగిన విలేఖర్ల సమావేశంలో వర్ల రామయ్య మాట్లాడుతూ బీజేపీకి అద్దెమైకులా మారిన పవన్ ఆ పార్టీ పల్లవినే వల్లెవేస్తున్నారన్నారు.

11/09/2018 - 02:13

విజయవాడ, నవంబర్ 8: కరవు తీవ్రత, సహాయ చర్యలు చేపట్టడంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ సీపీఎం ఆధ్వర్యంలో ఈ నెల 12న రాయలసీమ జిల్లాలో జరగనున్న రాస్తారోకోలకు సీపీఐ మద్దతు తెలియజేస్తున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో తీవ్ర కరవు పరిస్థితి నెలకొందని, రాష్ట్రం మొత్తం మీద దాదాపు 60 శాతం ప్రాంతం దుర్భిక్షంగా మారిందని అన్నారు.

11/09/2018 - 02:13

విజయవాడ, నవంబర్ 8: పెద్దనోట్ల రద్దు జరిగి రెండు సంవత్సరాలయిన సందర్భంగా కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వ నియంతృత్వ చర్యలకు వ్యతిరేకంగా, మోదీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 9న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కాంగ్రెస్ నిరసన కార్యక్రమాలను చేపడుతోంది. ఈ విషయాన్ని పీసీసీ ప్రధాన కార్యదర్శి జంగా గౌతమ్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.

11/09/2018 - 02:12

విజయవాడ, నవంబర్ 8: ఈ నెల 15న ప్రభుత్వ కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు తలపెట్టిన సమ్మె వాయిదా పడింది. రాష్ట్ర జేఏసీ సమావేశం అనంతరం సమ్మె ఎప్పుడు నిర్వహించేది తెలియజేస్తామని సంఘం చైర్మన్ ఏవీ నాగేశ్వరరావు, సెక్రటరీ జనరల్ ఎం బాలకాశి ఓ ప్రకటనలో తెలిపారు.

Pages