S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

06/02/2017 - 01:31

అమరావతి, జూన్ 1: రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 2 నుంచి 8వ తేదీ వరకు నవ నిర్మాణ దీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభమవుతున్నాయి. ప్రతి ఏటా జూన్ 2న దీక్షా దినోత్సవంగా నిర్వహించుకుంటున్న విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శుక్రవారం ఉదయం 9 గంటలకు విజయవాడ బెంజిసర్కిల్‌లో నవనిర్మాణ దీక్షను ప్రారంభిస్తారు. 11 గంటల వరకు దీన్ని నిర్వహిస్తారు.

06/02/2017 - 01:30

విజయవాడ, జూన్ 1: రాష్ట్రానికి విభజన పేరుతో అన్యాయం చేసిన వారు సిగ్గుపడేలా అభివృద్ధి చేసి చూపిస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. కసి, ఆవేదనతో పట్టుదలతో పని చేయాలని, పట్టుదలతో చేస్తే అభివృద్ధి సాధ్యమన్నారు. వెలగపూడి సచివాలయంలో మంత్రివర్గ సమావేశం తరువాత మీడియా సమావేశంలో గురువారం ఆయన మాట్లాడారు.

06/02/2017 - 02:20

విజయవాడ, జూన్ 1: ఆంధ్రప్రదేశ్ ఫార్మర్స్ మేనేజ్‌మెంట్ ఆఫ్ ఇరిగేషన్ సిస్టం-1997 చట్టంలో భారీ మార్పులు చేస్తూ మంత్రిమండలి తీర్మానించింది. సాగునీటి సంఘాల కాలపరిమితిని ఆరేళ్ల నుంచి ఐదేళ్లకు తగ్గించింది. క్లిష్టతరంగా ఉన్న ఎన్నికల ప్రక్రియను సరళీకృతం చేసింది. చేతులు ఎత్తి ఆమోదం తెలిపే విధానం ప్రవేశపెట్టే సవరణకు ఆమోదం తెలిపింది.

06/01/2017 - 03:23

విజయవాడ, మే 31: రాష్ట్రంలోని వివిధ దేవాలయాల్లో వృథాగా పడివున్న వెండి వస్తువులను బంగారంగా మార్పిడి చేయాలని రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ నిర్ణయించింది. వెండి డిపాజిట్ల వల్ల ఆదాయం లేకపోగా, అదనంగా భద్రతకు నిధులు ఖర్చు చేయాల్సి వస్తుండటంతో ప్రభుత్వం ఈమేరకు నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని వివిధ ఆలయాల్లో దాతలిచ్చిన వెండి వస్తువులు వృథాగా ఉంటున్నాయి.

06/01/2017 - 04:48

విజయవాడ, మే 31: వచ్చే 15 నెలల్లో రాష్ట్రంలో 1.93 లక్షల ఇళ్లు నిర్మించాలని నిర్ణయించినట్టు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. వీటిలో కనీసం 10 శాతం ఇళ్లలో 2019 సంక్రాంతికి గృహ ప్రవేశాలు చేయించాలన్నదే సిఎం చంద్రబాబు దృఢ సంకల్పమని వివరించారు. పట్టణాభివృద్ధి సంస్కరణలపై మంత్రుల కమిటీ భేటీ అనంతరం ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు.

06/01/2017 - 03:19

అమరావతి, మే 31: నవ నిర్మాణ దీక్ష జూన్ 2, మహా సంకల్పం జూన్ 8న, వాటిమధ్య ఐదు రోజుల్లో జరిగే అన్ని దీక్షలను విజయవంతం చేయాలని సిఎం చంద్రబాబు కోరారు. బుధవారం తన నివాసం నుంచి టెలికాన్ఫరెన్స్‌లో మంత్రులు, జిల్లాల కలెక్టర్లు, అధికారులు, ప్రజాప్రతినిధులతో మాట్లాడారు. ప్రతి జిల్లాలో, నియోజకవర్గంలో జరిగే సభలను తాను స్వయంగా పరిశీలిస్తానని, విశే్లషిస్తానని చెప్పారు.

06/01/2017 - 03:16

రాజమహేంద్రవరం, మే 31: గోదావరి డెల్టాలో ఖరీఫ్‌కు 15 రోజులు ముందుగానే సాగు చేపట్టేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఇందులో భాగంగా కాటన్ బ్యారేజీ నుంచి 15 రోజులు ముందుగానే, జూన్ ఒకటో తేదీ నుంచి డెల్టా కాలువలకు నీటిని విడుదల చేస్తున్నారు. వ్యవసాయ శాఖ ఈ ఏడాది కొత్తగా ఖరీఫ్ కార్యాచరణ చేపట్టింది. రాష్ట్ర విభజన తర్వాత ఏడాదికి మూడు పంటలు చొప్పున సాగు విధానానికి శ్రీకారం చుట్టారు.

05/31/2017 - 08:59

విశాఖపట్నం, మే 30: విశాఖలో వేల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ, ప్రైవేటు భూములను తినేశారు. అత్యంత భధ్రంగా ఉంచాల్సిన భూముల రికార్డులు టాంపరింగ్‌కు గురయ్యాయి. జిల్లాలోని చాలా రెవెన్యూ కార్యాయాల్లో భూముల రికార్డులను మాయం చేశారు. రాష్ట్రంలో భూ రికార్డులను తారుమారు చేయడంలో చేయితిరిగిన ఓ వ్యక్తి సిసిఎల్‌ఆర్‌లోనూ విశాఖ భూముల రికార్డులు తారుమారు చేసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

05/31/2017 - 08:58

విజయవాడ, మే 30: పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడిగానే కాకుండా పర్యాటక రంగానికి ప్రాణనాడిగా మలిచేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సిఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. పోలవరం ప్రాజెక్టు, పరిసర ప్రాంతాల్లోని పట్టిసీమ, ధవళేశ్వరం, పాపికొండలు, చిన్నచిన్న దీవులు ఆకర్షణగా నిలుస్తాయన్నారు. వీటిని పర్యాటకులు వీక్షించేలా సౌకర్యాలు కల్పించి, అభివృద్ధి చేయాలని సూచించారు.

05/31/2017 - 08:31

విజయవాడ, మే 30: రాష్ట్రంలో వేలాది పల్లెలకు మార్గదర్శనం చేసే విధంగా తూర్పుగోదావరి జిల్లా మోరి గ్రామాన్ని స్మార్ట్ విలేజ్ వర్శిటీగా తీర్చిదిద్దాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఈ గ్రామాన్ని భవిష్యత్తులో గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు నమూనాగా తీర్చిదిద్దాలన్నారు. వెలగపూడి సచివాలయంలో మంగళవారం మోరీ స్మార్ట్ విలేజ్ ప్రాజెక్టుపై సమీక్ష నిర్వహించారు.

Pages