S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

05/31/2017 - 08:31

విజయవాడ, మే 30: రవాణా, పోలీస్ శాఖ తనిఖీలు నిర్వహించడంతో పాటు చాలాదూరం నుంచి వాహనాలు నడుపుతూ వచ్చినవారు రిఫ్రెష్ అవ్వడానికి వీలుగా ముఖం శుభ్రం చేసుకునేందుకు కాసిన్ని నీళ్లు, వీలైతే వేడివేడి తేనీరు అందించే ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. ఏపీని రహదారి ప్రమాదాలు లేని రాష్ట్రంగా నిలిపేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కోరారు.

05/30/2017 - 04:05

విశాఖపట్నం, మే 29: తెలంగాణాలో కెసిఆర్ ప్రజా వ్యతిరేక విధానాలపై నిరంతర పోరాటం చేస్తున్న టిటిడిపికి ఒక్క అవకాశం ఇవ్వాలని తెలంగాణ ప్రజలకు, లోటు బడ్జెట్ ఉన్నా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న చంద్రబాబును మరోసారి గెలిపించాలని ఏపి ప్రజకు తెలంగాణ నేత రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. మహానాడు వేదిక మీద సోమవారం సాయంత్రం అభిమానులను ఉర్రూతలూగించే ప్రసంగం చేశారు.

05/30/2017 - 03:37

విశాఖపట్నం, మే 29: తెలుగుదేశం పార్టీ సంప్రదాయకంగా నిర్వహించుకునే మూడురోజుల మహానాడు సదస్సు ముగిసింది. విశాఖ ఆంధ్రాయూనివర్శిటీ మైదానంలో జరుగుతున్న మహానాడు ప్రతినిధుల సదస్సు విజయవంతమైంది. సోమవారంతో ముగిసిన సదస్సు కార్యకర్తల్లో స్ఫూర్తినింపగా, నాయకుల గౌరవాన్ని పెంచింది. 34 తీర్మానాలు, 94 మంది నేతల ప్రసంగాలతో హుషారుగా సాగింది.

05/30/2017 - 03:36

విశాఖపట్నం, మే 29: రాష్ట్రంలో కాపులకు రిజర్వేషన్లు కల్పించటం ద్వారా బిసి రిజర్వేషన్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ విఘాతం రాకుండా చూస్తానని టిడిపి జాతీయ అధ్యక్షుడు, సిఎం చంద్రబాబు అన్నారు. మహానాడు మూడోరోజైన సోమవారం సంక్షేమం, సామాజిక, ఆర్థిక, రాజకీయ వికాసం అన్న అంశంపై ప్రవేశపెట్టిన తీర్మానంపై చంద్రబాబు మాట్లాడుతూ కాపులను బిసిల్లో చేర్చే అంశంపై ఏర్పాటు చేసిన కమిషన్ త్వరలోనే నివేదిక ఇస్తుందని అన్నారు.

05/30/2017 - 03:28

రాజమహేంద్రవరం, మే 29: తూర్పు గోదావరి జిల్లాలో సీతానగరం మండలం పురుషోత్తపట్నం వద్ద నిర్మిస్తున్న ఎత్తిపోతల పథకం భూసేకరణ వ్యవహారం రోజురోజుకు జఠిలంగా మారుతోంది. ప్రభుత్వం చెల్లిస్తున్న ధరకు తమ భూములిచ్చేది లేదని రైతులు స్పష్టం చేయడంతో బలవంతంగా భూములను స్వాధీనం చేసుకునేందుకు రంగం సిద్ధంచేశారు. దీంతో అక్కడ నిర్వహించ తలపెట్టిన పనులను రైతులు అడ్డుకుంటున్నారు.

05/29/2017 - 08:21

విశాఖపట్నం, మే 28: కోట్లాది రూపాయల మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణలో అభివృద్ధి మచ్చుకైనా కనిపించడం లేదని, లోటు బడ్జెట్ ఉన్నా, ఏపిలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు విరివిగా జరుగుతున్నాయని, మీ రాష్ట్రాన్ని చూస్తే, మాకు ఈర్ష్య కలుగుతోందని తెలంగాణ టిడిపి అధికార ప్రతినిధి అరవిందకుమార్ గౌడ్ అన్నారు.

05/29/2017 - 08:20

అమరావతి, మే 28: ప్రముఖ సినీ నటి, తెలుగుదేశం పార్టీ మహిళా నేత కవిత తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధమవుతున్నారు. పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో సినిమాలను కూడా వదులుకుని, పార్టీకి పనిచేసిన తనను అధికారంలోకి వచ్చిన తర్వాత పక్కకుపెట్టి అవమానిస్తున్నారంటూ ఆమె గత కొంతకాలం నుంచీ బహిరంగంగానే ఆవేదన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.

05/29/2017 - 01:59

కార్యకర్తలను అక్కునజేర్చుకున్న చంద్రన్న

అన్న బాటలో అధినేత పేద తమ్ముళ్ల కుటుంబాలకు ఆర్థిక సాయం
కార్యకర్తల మధ్యకు నడిచి వెళ్లిన ముఖ్యమంత్రి

05/29/2017 - 01:58

విశాఖ పట్నం, మే 28: తెలుగుదేశం వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు యుగపురుషుడని, తెలుగు జాతి జీవించి ఉన్నంత కాలం, తెలుగువారి గుండెల్లో ఎన్టీఆర్ చిరస్థాయిగా మిగిలిపోతారని, అందుకే ఆయనకు భారతరత్న ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వానికి మరోసారి విజ్ఞప్తి చేశారు.

05/29/2017 - 01:56

విశాఖపట్నం, మే 28: రాష్ట్రంలో రైతులు, కౌలు రైతుల కోసం ప్రత్యేక చట్టం తీసుకువస్తున్నట్టు సిఎం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఆదివారం మహానాడులో వ్యవసాయరంగంపై ప్రవేశపెట్టిన తీర్మానంపై చంద్రబాబు మాట్లాడుతూ వ్యవసాయ రంగాన్ని అన్ని విధాలా ఆదుకుంటానని అన్నారు. కేంద్ర, రాష్ట్ర పాలకులు వ్యవసాయంపై శ్రద్ధ చూపాలని ఆయన కోరారు.

Pages