S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

05/14/2017 - 01:38

అమరావతి, మే 13: ప్రకృతి విపత్తులు, కరవు, భారీ వర్షాల వల్ల పంటలు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం రూ. 1546.62 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ చెల్లించినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వెల్లడించారు. 2014-15 నుంచి 2016-17 మధ్య కాలంలో సంభవించిన హుదుద్ తుపాను, 2014 ఖరీఫ్‌లో వచ్చిన కరవు, ఆకాల వర్షాలు తదితర వైపరీత్యాలతో నష్టపోయిన రైతులకు మొత్తం రూ.

05/14/2017 - 01:38

అమరావతి, మే 13: ఉత్తరాంధ్ర, గ్రేటర్ హైదరాబాద్‌లో జరిగే జనసేన ఎంపిక శిబిరాలు ఈనెల 17 నుంచి ప్రారంభమవుతున్నాయి. 17,18 తేదీల్లో శ్రీకాకుళం, 19,20న విశాఖ జిల్లా, 23,24,25 తేదీల్లో గ్రేటర్ హైదరాబాద్‌లో ఈ శిబిరాలు జరుగుతాయి.

05/14/2017 - 01:37

విశాఖపట్నం, మే 13: కోట్ల రూపాయల హవాలా చేసి, పోలీసులకు చిక్కిన మహేష్‌కు అంత భారీ మొత్తాన్ని ఎవరు ఇచ్చారు? వందల కోట్ల రూపాయలు దేశం దాటించేంత అవసరం ఎవరికుంది? దీని వెనుక పెద్ద మనుషుల హస్తం ఉందన్న కథనాలు వినిపిస్తున్నాయి. పెద్ద నోట్ల రద్దు, తదనంతర పరిణామాల తరువాత బ్లాక్ మనీని ఇతర దేశాలకు తరలించేందుకు అక్కడక్కడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో భాగమే ఇది అని తెలుస్తోంది.

05/14/2017 - 01:36

శ్రీకాకుళం, మే 13:మహేష్ హవాలా రాకెట్‌లో కొందరు ప్రజాప్రతినిధులు కూడా అతనితో చేతులు కలిపినట్టు తెలుస్తోంది. హవాలా మార్గంలో డబ్బును మలేసియా, బ్యాంకాక్, సింగపూర్ దేశాలకు మహేష్ తరలించినట్టు తేలడంతో ఉత్తరాంధ్రనుంచి ఆయా దేశాలకు తరచూ రాకపోకలు సాగించిన వారి వివరాలను కూపీ లాగుతున్నారు. గతంలో కొందరు ప్రజా ప్రతినిధులు ఈ దేశాలకు వెళ్లారన్న సమాచారాన్ని వారు రాబట్టినట్టు తెలుస్తోంది.

05/14/2017 - 01:36

విశాఖపట్నం, మే 13: ప్రధాని నరేంద్రమోదీని జగన్ కలిస్తే టిడిపి నేతలకు ఉలుకెందుకని వైకాపా సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. విశాఖలో శనివారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ జగన్, మోదీ కలయికపై టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు, మంత్రి కళా వెంకటరావు లేఖ రాయడంపై ఆయన మండిపడ్డారు.

05/14/2017 - 01:02

విజయవాడ, మే 13: సచివాలయానికి వచ్చే సందర్శకులు వేసవి తాపానికి గురికాకుండా ఉండేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి వివిధ పనులపై సచివాలయానికి వచ్చే ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులకు చల్లని మజ్జిగ ప్యాకెట్లను ఉచితంగా అందిస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక ఆటోను కూడా ఏర్పాటు చేసింది.

05/14/2017 - 01:01

అమరావతి, మే 13: మడమ తిప్పేదే లేదన్నవారు ఇప్పుడేం చేస్తున్నారు.. హోదా కోసం రాజీనామాలు చేస్తామన్నారు.. ఇప్పుడు మాట్లాడటం లేదని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డినుద్దేశించి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు.

05/14/2017 - 00:58

అమరావతి, మే 13: వైసిపి అధ్యక్షుడు జగన్ రాజకీయాల్లో సైద్ధాంతిక దివాళాకోరుతనంతో తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం ప్రధానమంత్రి నరేంద్రమోదీ కాళ్ల వద్ద మైనార్టీల హక్కులను తాకట్టుపెట్టారని ఏపి స్టేట్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఎండి హిదాయత్ ధ్వజమెత్తారు.

05/14/2017 - 00:57

అమరావతి, మే 13: మీరు పత్రికలకు విడుదల చేసిన వినతిపత్రం అసలు ప్రధానికి ఇచ్చారా.. ఇవ్వకుండానే కేవలం పత్రికలకు విడుదల చేశారా.. అని రాష్ట్ర టిడిపి అధ్యక్షుడు, మంత్రి కళా వెంకట్రావు వైసిపి అధ్యక్షుడు జగన్‌కు శనివారం రాసిన లేఖలో ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన జగన్‌కు కొన్ని ప్రశ్నలు సంధించారు.

05/14/2017 - 00:57

విజయవాడ, మే 13: రాష్ట్ర పునర్విభజన చట్టం 9,10వ షెడ్యూలు ప్రకారం ఉమ్మడి రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని స్థిరాస్తులపై రావాల్సిన వాటా ధనం దాదాపు 35వేల కోట్ల రూపాయలు పైగా రాబట్టుకోటానికి తుది గడువు మరో 40 రోజుల్లో ముగుస్తుంటే దీనిపై ఏ మాత్రం పట్టించుకోని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తూ ఊడిగం చేస్తున్నారంటూ రాజధాని ప్రాంత రైతు, రైతుకూలీల పరిరక్షణ సమితి అధ్యక

Pages