S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

05/13/2017 - 06:09

రాజానగరం, మే 12: గోదావరి జిల్లాల్లో ఉన్నత విద్యాభివృద్ధి లక్ష్యంతో నెలకొల్పిన ఆదికవి నన్నయ యూనివర్సిటీ (అక్నూ) ప్రస్తుతం విసి, రిజిస్ట్రార్ల మధ్య విభేదాలతో సతమతమవుతోంది. వర్శిటీలో ఆటోమేషన్ వ్యవహారమై తలెత్తిన విభేదాల నేపథ్యంలో ప్రస్తుత రిజిస్ట్రార్ తన పదవికి రాజీనామా చేయడంతో వ్యవహారం ఉత్కంఠగా మారింది.

05/13/2017 - 06:00

విశాఖపట్నం, మే 12: రైల్వే బోర్డు చైర్మన్ ఎకె మిట్టల్ శుక్రవారం విశాఖ వచ్చారు. బోర్డు చైర్మన్ చాలా కాలం తరువాత విశాఖకు వచ్చారు. ఈ సందర్భంగా రైల్వే అధికారులతో ఆయన కొద్దిసేపు భేటీ అయ్యారు. చైర్మన్‌ను ఎంపీలు హరిబాబు, అవంతి శ్రీనివాస్, ప్రజా ప్రతినిధులు, వివిధ సంస్థలు, సంఘాల నాయకులు కలిసి వినతిపత్రాలు సమర్పించారు.

05/13/2017 - 05:54

విజయవాడ, మే 12: అమెరికాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి పర్యటన ముగిసింది. శుక్రవారం మధ్యాహ్నానికి ఢిల్లీ చేరుకున్న సిఎం, రాత్రికి విజయవాడ చేరుకున్నారు. ప్రముఖ ఐటి కంపెనీల సిఇఒలతో, పారిశ్రామివేత్తలతో వరుస భేటీలతో అక్కడ బిజీబిజీగా గడిపారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వివిధ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. కొన్ని సంస్థలు ఒప్పందాలు చేసుకునేందుకు ముందుకు రావడం గమనార్హం.

05/13/2017 - 05:54

హైదరాబాద్, మే 12: మణుగూరు-సికింద్రాబాద్, డోర్నకల్-్భద్రాచలం రోడ్ పాసింజర్ రైళ్ల వేగం పెంచడం వల్ల ఆయా రైళ్ల సమయాల్లో మార్పులు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ నెల 22 నుంచి ఈ మార్పులు అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. మణుగూరులో 22.15 గంటలకు బయలుదేరాల్సిన పాసింజర్ రైలు 23.45 గంటలకు బయలుదేరుతుంది.

05/13/2017 - 05:53

కాకినాడ, మే 12: త్వరలో జరగనున్న రాష్టప్రతి ఎన్నికల్లో దేశంలోని లౌకిక పార్టీలన్నీ ఏకమై మతతత్వ పార్టీని నిరోధించాలని ప్రదేశ్ కాంగ్రెస్ (పిసిసి) కమిటీ అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి పిలుపునిచ్చారు. ఇప్పటి వరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లౌకికతత్వానికి కట్టుబడివుందని అనుకున్నా ఆ పార్టీ అధినేత జగన్ ఇటీవల ప్రధాని మోదీని కలిసి తన నిజ స్వరూపాన్ని బయటపెట్టారన్నారు.

05/13/2017 - 05:48

విజయవాడ, మే 12: త్వరలో అమల్లోకి రానున్న జిఎస్‌టి చట్టానికి అనుగుణంగా డీలర్లు తమ వ్యాపార లావాదేవీలను ఆన్‌లైన్‌లోనే నిర్వహించాలని విజయవాడ వాణిజ్య పన్నులశాఖ డిప్యూటీ కమిషనర్ వి రఘునాథ్ స్పష్టం చేశారు. జిఎస్‌టి చట్టం ద్వారా పన్నుల వ్యవస్థలో భారీ మార్పులు వస్తాయని ఈ మార్పుల వల్ల వర్తక వాణిజ్య వర్గాలు, వినియోగదారులకు ఎంతో మేలు జరుగుతుందని ఆయన వెల్లడించారు.

05/13/2017 - 05:45

అమరావతి, మే 12: రాష్ట్రంలో తెలుగుదేశం-్భరతీయ జనతా పార్టీ మధ్య ఇక పథకాల ప్రచార యుద్ధానికి తెరలేవనుంది. అందుకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) వేదిక కానుంది. కేంద్రం రాష్ట్రానికి కేటాయించిన నాలుగు లక్షల ఇళ్లపై రెండు పార్టీలు పేటెంట్ కోసం రాజకీయ వ్యూహానికి పదును పెడుతున్నాయి.

05/13/2017 - 01:10

అమరావతి, మే 12: ఆగర్భ రాజకీయ శత్రువుల్లా వ్యవహరిస్తున్న తెలుగుదేశం-వైస్సార్ కాంగ్రెస్ పార్టీ వైరం ఇప్పుడు విదేశాలకూ పాకింది. ఇది పరాకాష్ఠకు చేరి డలాస్‌లో పర్యటిస్తోన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును, ఎర్రచందనం స్మగ్లర్లను చంపించినందుకు అరెస్టు చేయాలన్న డిమాండ్‌పై రాజకీయాలకు అతీతంగా ఆక్షేపణ వ్యక్తమవుతోంది.

05/13/2017 - 01:09

విజయవాడ, మే 12: రాష్ట్రంలో కరవు పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేసేందుకు వీలుగా వివిధ సంస్థలతో సాంకేతిక కమిటీని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు శుక్రవారం జారీ చేసింది. రాష్ట్రంలో ఇప్పటికే 301 మండలాలను కరవు మండలాలుగా ప్రకటించారు. ఇప్పటికే ప్రభుత్వం ఏర్పాటు చేసిన డ్రౌట్ మానిటరింగ్ సెల్ కరవు పరిస్థితులను గమనిస్తోంది.

05/13/2017 - 01:08

ఖమ్మం, మే 12: రైతు సమస్యలను పరిష్కరించాలని, పంటలకు గిట్టుబాటుధర కల్పించాలని డిమాండ్ చేస్తూ టిడిపి ఆధ్వర్యంలో రైతు పోరుయాత్ర పేరుతో శనివారం ఖమ్మంలో భారీ ధర్నా చేపట్టనున్నారు. గత నెల 28వ తేదీన ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో జరిగిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించగా నాటి నుంచి టిడిపి ఇతర పార్టీలతో కలిసి ప్రతిరోజూ ఆందోళనలు చేస్తూనే ఉన్నది.

Pages