S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

03/03/2016 - 05:21

హైదరాబాద్: అమరావతిని రాజధానిగా అధికారికంగా ప్రకటించకముందే టిడిపికి చెందిన నేతలు, మంత్రులు నాలుగువేల ఎకరాలను బినామీ పేర్లతో కొనుగోలు చేసిన ఉదంతంపై కేంద్రప్రభుత్వం న్యాయ విచారణ జరిపించాలని, ఈ విషయంలో ఉదాసీన వైఖరిని ప్రదర్శించరాదని వైకాపా సీనియర్ నేత బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు.

03/03/2016 - 05:20

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఎపిఐఓటి) పాలసీ 2016-20 కి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలియచేసింది. బుధవారం విజయవాడలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు ఆమోదం లభించిందని ఐటి శాఖ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేస్తూ, 2020 వరకు ఎపిని ఐఓటి హబ్‌గా తీర్చిదిద్దాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని వివరించారు.

03/03/2016 - 05:18

విజయవాడ: రాష్ట్రంలో మరో మూడేళ్లపాటు యథేచ్ఛగా అధికారంలో కొనసాగేందుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ శాసనసభలో 88 సీట్లు అవసరం కాగా మిత్రపక్ష బిజెపి నల్గురు సభ్యులు, మరో ఇద్దరు ఇండిపెండెంట్ సభ్యులతో కల్సి అధికార వర్గ టిడిపికి 106 మంది సభ్యుల బలం ఉన్నప్పటికీ సిఎం చంద్రబాబు మాత్రం బరితెగించి వలసలను పోత్స్రహిస్తూ నగ్నంగా నడిరోడ్డుపైనే రాజకీయ వ్యభిచారం సాగిస్తున్నారంటూ పిసిసి అధికార ప్రతినిధి డా.ఎన్.తులసిరెడ్

03/03/2016 - 04:35

ఫిరంగిపురం: ఉరి వేసుకుని బి ఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఫిరంగిపురంలో సంచలనం రేకెత్తించింది. సేకరించిన వివరాల ప్రకారం గుంటూరు జిల్లా, ఫిరంగిపురంలోని సెయింట్ జేవియర్ ఫార్మసీ కళాశాలలో బి ఫార్మసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న అనంతపురం జిల్లా, అంబుదూర్ మండలం, కూరాకుల గ్రామానికి చెందిన మల్లవరపు సుమలత (21) బుధవారం తెల్లవారు ఝామున ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

03/03/2016 - 04:30

శ్రీశైలం: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం శ్రీశైల మహాక్షేత్రంలోని శ్రీ భ్రమరాంబమల్లికార్జున స్వామి వారు హంస వాహనంపై భక్తులకు దర్శనం ఇచ్చారు. ముందుగా స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను అక్క మహాదేవి అలంకరణ మండపంలో ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక పూజాధికాలు నిర్వహించారు. అలాగే మేళతాళాల నడుమ మంగళ హారతులు ఇచ్చి స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను గ్రామోత్సవానికి తీసుకెళ్లారు.

03/03/2016 - 04:29

విశాఖపట్నం: ముఖ్యమంత్రి చంద్రబాబు మాటలు నమ్మి మోసపోయాం .. కాపు రిజర్వేషన్లు, కాపు కార్పొరేషన్‌కు నిధులకోసం మరోసారి రోడ్డెక్కి ఉద్యమబాట పట్టాల్సిన పరిస్థితులు కల్పిస్తున్నారంటూ కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అన్నారు.

03/03/2016 - 04:22

హైదరాబాద్: ఆలస్యంగా మేల్కొన్న వైకాపా నేతలు అవిశ్వాస అస్త్రాన్ని ప్రయోగించడం ద్వారా ఫిరాయింపుదారుల వలసలకు అడ్డుకట్టవేశారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలు మరో రెండు రోజుల్లో ప్రారంభం కానుండటంతో శాసనసభ వేదికగా ఫిరాయింపుదార్లకు బుద్ధి చెప్పాలని భావిస్తున్న వైకాపా రాష్ట్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టనుంది.

03/03/2016 - 06:08

విజయవాడ: రాష్ట్రంలోని 157 ఇసుక రీచ్‌లనుంచి తక్షణమే ప్రజలందరికీ ఉచితంగా ఇసుక పంపిణీ చేయాలని బుధవారం సిఎం క్యాంపు కార్యాలయంలో సిఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. విశాఖలోని శ్రీ దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయానికి కులపతిగా హైకోర్టు చీఫ్ జస్టిస్‌ను నియమించాలని కూడా సమావేశం నిర్ణయించింది.

03/02/2016 - 23:51

విజయవాడ: వైఎస్సార్ కాంగ్రెస్ నుండి అధికారపక్ష తెలుగుదేశం పార్టీలోకి శాసనసభ్యుల వలస అప్రతిహతంగా సాగుతోంది. సిఎం చంద్రబాబు నివాస గృహంలో కర్నూలు జిల్లా కోడుమూరు వైకాపా ఎమ్మెల్యే మణిగాంధీ బుధవారం చంద్రబాబు సమక్షంలో పచ్చకండువా వేసుకున్నారు. ఆయనవెంట కర్నూలు జిల్లా తెలుగుదేశం అధ్యక్షుడు శిల్పా చక్రపాణిరెడ్డి తదితర నేతలు పార్టీలో చేరారు.

03/02/2016 - 19:54

విజయవాడ:కాపు సామాజికవ వర్గానికి బిసి రిజర్వేషన్ల వ్యవహారంపై ప్రభుత్వం కృతనిశ్చయంతో చర్యలు తీసుకుంటున్నా, గడువులోగానే స్పందిస్తున్నా ముద్రగడ మళ్లీ ఉద్యమానికి సిద్ధపడతామనడం, చంద్రబాబుకు వ్యతిరేకంగా మాట్లాడటాన్ని మంత్రులు తప్పుబట్టారు. ఈ విషయాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లారు. ముద్రగడ వ్యవహారశైలి వైకాపాకు అనుకూలంగా ఉందంటూ వారు బాబుకు చెప్పారు.

Pages