S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

07/16/2016 - 00:10

నంద్యాల, జూలై 15: పట్టణ ప్రాంతాల్లోని పేదలకు వైద్యం అందించేందుకు ఏర్పాటుచేసిన అర్బన్ హెల్త్‌సెంటర్ల (పట్టణ ఆరోగ్య కేంద్రాలు) పేరును పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలుగా మార్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాటి నిర్వహణ బాధ్యతను ఓ ప్రముఖ కార్పొరేట్ ఆసుపత్రికి అప్పగించినట్లు సమాచారం.

07/16/2016 - 00:01

రాజమహేంద్రవరం, జూలై 15: ధవళేశ్వరం బ్యారేజి వద్ద వరద గోదావరి ఉద్ధృతి తగ్గింది. ఎగువ ప్రాంతంలో ఉద్ధృతి తగ్గుముఖం పట్టడంతో ధవళేశ్వరం బ్యారేజి వద్ద కూడా తగ్గుముఖం పట్టింది. గురువారం రాత్రి మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు ఉపసంహరించారు. శుక్రవారం ధవళేశ్వరం బ్యారేజి వద్ద నీటి మట్టం 9 అడుగులకు తగ్గింది. 5,29,591 క్యూసెక్కుల వరద జలాలు సముద్రంలోకి ప్రవహిస్తున్నాయి.

07/15/2016 - 18:24

కర్నూలు: కర్నూలు జిల్లాకు చెందిన మాజీ మంత్రి బైరెడ్డి శేషశయనారెడ్డి గుండెపోటుతో శుక్రవారం మరణించారు. అనారోగ్యంతో ఆస్పత్రిలో చేర్పించగా ఆయన తుదిశ్వాస విడిచారు. నందికొట్కూరు మండలం ముచ్చుమర్రికి చెందిన ఆయన మూడుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి రాష్ట్ర మంత్రిగా సేవలు చేశారు. ఆయన కుమారుడు బైరెడ్డి రాజశేఖరరెడ్డి ప్రస్తుతం రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు.

07/15/2016 - 17:26

అనంతపురం: వైద్యుడి నిర్లక్ష్యం వల్లే ప్రసవ సమయంలో తల్లి, బిడ్డ మృతి చెందారని ఆరోపిస్తూ ప్రైవేటు ఆస్పత్రి వద్ద బంధువులు ఆందోళన చేపట్టారు. నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి నిండు గర్భిణిని ప్రసవం నిమిత్తం శుక్రవారం మధ్యాహ్నం ఆమె బంధువులు ఆస్పత్రికి తీసుకువచ్చారు. ఆమెను తీసుకువచ్చిన చాలా సేపటికి- గర్భంలో శిశువు అడ్డం తిరిగినందున సిజేరియన్ ఆపరేషన్ చేయాలని అక్కడి డాక్టర్ చెప్పారు.

07/15/2016 - 17:26

విజయవాడ: పార్లమెంటు వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో టిడిపి ఎంపీలతో ఆ పార్టీ అధినేత, ఎపి సిఎం చంద్రబాబు శుక్రవారం ఇక్కడ భేటీ అయ్యారు. పార్లమెంటు సమావేశాల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై ఆయన ఎంపీలతో చర్చిస్తున్నారు. ఈరోజు ఆయన దిల్లీ వెళుతున్నందున ఎంపీలను కలుసుకుని వారికి దిశానిర్దేశం చేస్తున్నారు.

07/15/2016 - 17:22

విశాఖ: తరచూ యువతులను వేధిస్తూ పైశాచిక ఆనందం పొందుతున్న నలుగురు పోకిరీరాయుళ్లను గ్రామస్థులు చితకబాదిన ఘటన బుచ్చయ్యపేట మండలం కరక గ్రామంలో శుక్రవారం జరిగింది. యువతుల వెంటపడి వేధిస్తున్న నలుగురు యువకులను గ్రామస్థులు పట్టుకుని అందరి సమక్షంలో దేహశుద్ధి చేశారు. పోకిరీ చేష్టలకు పాల్పడే వారికి ఇలాంటి గుణపాఠం తప్పదని, అమ్మాయిలు కూడా అప్రమత్తంగా నడచుకోవాలని గ్రామపెద్దలు హెచ్చరించారు.

07/15/2016 - 17:22

విజయవాడ: మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌తో ఎపి సిఎం చంద్రబాబు నాయుడు ఈరోజు రాత్రి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఐటి రంగంలోనే కాకుండా మిలిందా అనే సంస్థ ద్వారా బిల్‌గేట్స్ ప్రపంచవ్యాప్తంగా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

07/15/2016 - 17:21

విజయవాడ: నగరంలోని పాత ప్రభుత్వ ఆస్పత్రిలో శిశువు అదృశ్యమై రెండు రోజులు గడిచినా నిందితుల గురించి ఎలాంటి ఆచూకీ లేకపోవడంతో ఎపి ప్రభుత్వం వైద్య సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని యోచిస్తోంది. ప్రసవం జరిగిన తర్వాత తల్లి ఒడి నుంచి గుర్తుతెలియని వ్యక్తులు ఆ శిశువును అపహరించుకుపోయారు. శిశువు ఆచూకీ తెలుసుకునేందుకు పది పోలీసు బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నా ఫలితం కనిపించడం లేదు.

07/15/2016 - 15:07

కాకినాడ: తూర్పు గోదావరి జిల్లా చింతూరు మండలంలోని అటవీ ప్రాంతంలో శుక్రవారం ఉదయం మావోయిస్టులు రెండు మందుపాతరలు పేల్చారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని పోలీసులు తెలిపారు. ఏడుగుర్రాలపల్లి-మల్లంపేట రహదారిపై అమర్చిన రెండు మందుపాతరలను మావోలు పేల్చివేశారు. పోలీసులను టార్గెట్‌గా చేసుకుని వీటిని పేల్చివేసినప్పటికీ ఎలాంటి ప్రాణహాని జరగలేదు.

07/15/2016 - 15:06

విశాఖ: హాస్టళ్లలోని మెస్‌లలో నాణ్యత లేని ఆహారం పెడుతున్నారని ఆరోపిస్తూ ఎయు విద్యార్థులు శుక్రవారం నాడు రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. తమ సమస్యలను వార్డెన్లు పట్టించుకోవడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాణ్యమైన ఆహారం అందించే వరకూ తమ ఆందోళన కొనసాగుతుందని వారు ప్రకటించారు.

Pages