S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

03/03/2016 - 16:26

విజయవాడ: రైతులు మొదటి పంట వేసిన తర్వాత ఈ ఏడాది జూన్ నాటికి గోదావరి జలాలను పూర్తి స్థాయిలో కృష్ణా నదిలోకి మళ్లించాలని ఎపీ సిఎం చంద్రబాబు అధికారులు ఆదేశించారు. ఆయన గురువారం ఇక్కడ నీటిపారుదల శాఖ అధికారులతో సమావేశమై, ప్రాజెక్టుల వారీగా సమీక్షించారు. పంటలు వేసిన రైతులు ఏ విధంగానూ నష్టపోకుండా సాగునీటిని సకాలంలో అందించాలని ఆయన అన్నారు.

03/03/2016 - 16:26

దిల్లీ: పొగాకు పంటకు కనీస మద్దతు ధర చెల్లించాలని, ఈము పక్షులను పెంచేవారికి రాయితీలు ఇవ్వాలని ఎపీకి చెందిన రైతులు గురువారం ఇక్కడ కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, నిర్మలా సీతారామన్, అరుణ్ జైట్లీలను కలిసి విజ్ఞప్తి చేశారు.

03/03/2016 - 16:24

తిరుపతి: తమ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసే వైకాపా ఎమ్మెల్యేలు టిడిపిలో చేరుతున్నారని హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ అన్నారు. పటిష్టమైన కార్యకర్తలే పునాదిగా ఉన్న తమ పార్టీ ఒక బలమైన వ్యవస్థగా ఎదిగిందన్నారు. తిరుపతిలోని ‘స్విమ్స్’ వైద్య విజ్ఞాన సంస్థ ప్రాంగణంలో ఆయన గురువారం టిడిపి వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.

03/03/2016 - 16:24

దిల్లీ: ఉమ్మడి రాష్ట్రాల హైకోర్టును విభజించి త్వరలోనే ఎపి రాజధాని అమరావతిలో హైకోర్టును ఏర్పాటు చేస్తామని కేంద్ర న్యాయశాఖామంత్రి సదానంద గౌడ హామీ ఇచ్చారు. అనకాపల్లి టిడిపి ఎంపీ అవంతి శ్రీనివాస్ గురువారం మంత్రి గౌడను కలిసి హైకోర్టు విభజనపై విన్నవించారు. దీంతో అమరావతిలోనే హైకోర్టును ఏర్పాటు చేస్తామని మంత్రి ప్రకటించారు.

03/03/2016 - 16:23

హైదరాబాద్: ఎపి అసెంబ్లీ నుంచి తనను ఏడాదిపాటు సస్పెండ్ చేయడంపై వైకాపా ఎమ్మెల్యే, సినీనటి రోజా దాఖలు చేసిన పిటిషన్‌పై గురవారం ఉమ్మడి హైకోర్టు వాయిదా వేసింది. పిటిషన్‌లోని అంశాలను పరిశీలించిన అనంతరం కేసు విచారణను ఈ నెల 8వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు హైకోర్టులోని ఏకసభ్య ధర్మాసనం ప్రకటించింది.

03/03/2016 - 14:25

హైదరాబాద్: ఎపి రాజధాని ప్రాంతంలో భారీ స్థాయిలో భూదందాలు నడుస్తున్నాయని, ఈ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఎందుకు నోరు విప్పడం లేదని వైకాపా ఎమ్మెల్యే రోజా ప్రశ్నించారు. ఆమె గురువారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ, బినామీల పేరిట భూములను కొనడంలో మంత్రులు ముందంజలో ఉన్నారని ఆరోపించారు.

03/03/2016 - 12:02

చిత్తూరు: వి.కోట మండలం కుంబర్లపల్లి వద్ద గురువారం ఉదయం రెండు ఆటోలు ఢీకొని హేమాద్రి అనే ఉపాధ్యాయుడు అక్కడికక్కడే మరణించాడు.

03/03/2016 - 12:02

కడప: ఓబులవారిపల్లె మండలం వై.కోట జంక్షన్ వద్ద గురువారం ఉదయం ఐదుగురు స్మగ్లర్లను పోలీసులు అరెస్టు చేసి, ఐదు లక్షల రూపాయల విలువచేసే ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు.

03/03/2016 - 12:02

తిరుపతి: శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవంలో ఆరో రోజు గురువారం నాడు స్వామివారికి హనుమంత వాహన సేవ అంగరంగ వైభవంగా జరిగింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామిని సందర్శించుకొన్నారు.

03/03/2016 - 12:00

కాకినాడ: పెద్దాపురంలోని బి.సి బాలికల హాస్టల్‌లో గురువారం ఉదయం ఇంటర్ విద్యార్థిని అనిత సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు యత్నించింది. ఈ విషయాన్ని వెంటనే గమనించిన సహచర విద్యార్థినులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం కాకినాడ ఆస్పత్రిలో చేర్పించారు. విద్యార్థిని ఆత్మహత్యా యత్నానికి కారణాలు తెలియరాలేదు.

Pages