S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

05/05/2017 - 08:35

విజయవాడ, మే 4: మద్దతు ధర లేదంటూ రోడ్డెక్కిన మిర్చి రైతును ఆదుకుంటామన్న రాష్ట్ర ప్రభుత్వ తీరు ప్రచారార్భాటంగానే మారింది. లక్షల సంఖ్యలో మిర్చి టిక్కీలు మార్కెట్ యార్డుల్లో మూలుగుతుంటే, కొనుగోళ్లు మాత్రం నత్తనడకన సాగుతున్నాయి. మిర్చి రైతును ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరతో గడచిన రెండు వారాల్లో కేవలం 24 మంది రైతులకే లబ్ధి చేకూరింది.

05/04/2017 - 08:22

సూళ్లూరుపేట, మే 3: పొరుగు దేశాలకు సైతం పరస్పర సమాచార వ్యవస్థను మెరుగుపరిచేందుకు సౌత్ ఆసియా శాటిలైట్ (ఎస్‌ఎఎస్) పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నిర్దేశానికి అనుగుణంగా ఇస్రో ప్రత్యేక ఉపగ్రహాన్ని రూపొందించి, ప్రయోగానికి సర్వం సిద్ధం చేసింది.

05/04/2017 - 08:21

విజయవాడ, మే 3: ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే రెండు సంవత్సరాలలో ఆరు లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పెట్టుకుని దాన్ని సాధించేందుకు అహర్నిశలు పనిచేస్తున్నట్లు ఐటి, కమ్యూనికేషన్లు, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి నారా లోకేష్ చెప్పారు. విజయవాడ గన్నవరం మేధా టవర్స్‌లో బుధవారం ఏడు ఐటి కంపెనీలను ఆయన ప్రారంభించారు.

05/03/2017 - 03:55

అమరావతి, ఏప్రిల్ 2: ‘పార్టీలో క్రమశిక్షణ గతంలో మాదిరిగా ఉండటం లేదు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. నోరు పారేసుకుంటున్నారు. సమయపాలన పాటించడం లేదు. ప్రధానితో మీటింగంటే నేను అరగంట ముందే వెళ్తా. హాల్ బయటకు వచ్చిన తర్వాత డిన్నర్‌కు వెళ్లినా పద్ధతి ప్రకారం నాకు కేటాయించిన సీట్లో కూర్చుంటా. కానీ మీకు మీటింగులంటే లెక్కలేదు. పార్టీ అధ్యక్షుడంటే లెక్కలేదు.

05/03/2017 - 03:01

విజయవాడ, మే 2: స్థానిక సంస్థల అభివృద్ధికి అలుపెరగని కృషి చేస్తామని శాసనమండలి సభ్యులు చిక్కాల రామచంద్రరావు, అంగర రామ్మోహనరావు తెలిపారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన చిక్కాల రామచంద్రరావు, అంగర రామ్మోహనరావు శాసనమండలి సభ్యులుగా మంగళవారం ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు. అసెంబ్లీలోని బిఎసి సమావేశం గదిలో వారిద్దరితో శాసనమండలి చైర్మన్ చక్రపాణి ప్రమాణ స్వీకారం చేయించారు.

05/03/2017 - 02:59

విజయవాడ, మే 2: నీరు - ప్రగతి 90 రోజుల ఉద్యమంలో ఎన్ని చెక్‌డ్యాంలు నిర్మించి వాటి ద్వారా ఎంత నీరు నిలుపుతారో వాళ్ళే మా హీరోలని జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చెప్పారు.

05/03/2017 - 02:58

విజయవాడ, మే 2: చట్టసభల్లో బిసిలకు 50 శాతం రిజర్వేషన్ బిల్లును వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశపెట్టాలనే డిమాండ్‌పై దేశవ్యాప్త ఉద్యమానికి తెలుగు రాష్ట్రాల నుంచే నాంది పలుకుతున్నామని బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, శాసనసభ్యుడు ఆర్.కృష్ణయ్య తెలిపారు. ఈ రిజర్వేషన్ల విషయమై ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఐదారుసార్లు, తెలంగాణ శాసనసభలో ఒకసారి ఏకగ్రీవ తీర్మానం చేశారన్నారు.

05/03/2017 - 02:28

విజయవాడ, మే 2: టెక్నాలజీని ఉపయోగించి బిసిల అభ్యున్నతికి చర్యలు తీసుకుంటామని రాష్ట్ర బిసి సంక్షేమ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. వెలగపూడి సచివాలయంలో చేతివృత్తులకు సంబంధించి 12 ఫెడరేషన్ల సభ్యులు బిసి నేత డి రామారావు నేతృత్వంలో మంగళవారం మంత్రిని కలిసి సన్మానించారు.

05/03/2017 - 02:26

గుంటూరు (పట్నంబజారు), మే 2: గోవులు, బ్రాహ్మణులు సంతోషంగా ఉంటేనే ఆ రాజ్యం సుభిక్షంగా ఉంటుందని పురాణ ఇతిహాసాల కాలం నుండి యుగయుగాల నానుడి అని తూర్పుగోదావరి జిల్లా తుని తపోవనం పీఠాధిపతులు సచ్చిదానంద సరస్వతీ స్వామీజీ అన్నారు. మంగళవారం స్వామి గుంటూరులోని బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ కార్యాలయాన్ని సందర్శించారు.

05/03/2017 - 02:23

కాకినాడ, ఏప్రిల్ 2: సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం అమలుచేస్తున్న ఏక గవాక్ష విధానం (సింగిల్ విండో) ఆశించిన ఫలితాలను ఇస్తోంది. వివిధ యూనిట్ల ఏర్పాటుకు ఏకగవాక్ష పద్ధతిలో అనుమతులు జారీ చేస్తుండటంతో పారిశ్రామిక ప్రగతి జోరందుకుంది. సింగిల్ విండో విధానం అమలుతో ఔత్సాహిక పరిశ్రమదారులు యూనిట్ల స్థాపనకు ముందుకు వస్తున్నారు.

Pages