S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

05/25/2016 - 17:57

విజయవాడ: కొంతమంది ఆడిస్తున్న నాటకంలో కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం కీలుబొమ్మలా మారారని మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయంలో కాపులకు రిజర్వేషన్ల గురించి ముద్రగడ ఎందుకు ప్రశ్నించలేదన్నారు. కాపుగర్జన సందర్భంగా తునిలో విధ్వంసకాండకు వైకాపా ప్రోత్సాహం ఉందన్నారు. ఉద్యమాల పేరిట కాపులకు ముద్రగడ అన్యాయం చేస్తున్నారన్నారు.

05/25/2016 - 17:57

విజయవాడ: ఇటీవల కాపుగర్జన సందర్భంగా తుని వద్ద జరిగిన విధ్వంసకాండలో వైకాపా హస్తం ఉందని ఎపి హోం మంత్రి చినరాజప్ప అన్నారు. కాపుగర్జన రోజున వైకాపా నేత భూమన కరుణాకరరెడ్డితో కాపునేత ముద్రగడ మాట్లాడారని తాను చాలెంజ్ చేస్తున్నానని హోం మంత్రి చెప్పారు. సిఐడి నివేదిక వచ్చాక నిందితులపై చట్టపరంగా చర్యలు తప్పవన్నారు.

05/25/2016 - 17:56

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ సీటు కోసం మిత్రపక్షమైన బిజెపి నుంచి ఎలాంటి ప్రతిపాదన రాలేదని టిడిపి యువనేత నారా లోకేష్ బుధవారం తెలిపారు. ఎపిలో ఖాళీ అవుతున్న రాజ్యసభ సీట్లను తెలంగాణ ప్రాంత నేతలకు ఇచ్చే అవకాశం లేదన్నారు. రాజ్యసభ సీట్లకు ఎంపిక గురించి పార్టీ పాలిట్‌బ్యూరో సమావేశం నిర్ణయిస్తుందన్నారు.

05/25/2016 - 17:55

కాకినాడ: కాపునేత ముద్రగడ పద్మనాభం అదే పనిగా రాస్తున్న లేఖల్లో వైకాపా అధినేత జగన్ మాటలు ధ్వనిస్తున్నాయని ఎపి డిప్యూటీ సిఎం నిమ్మకాయల చినరాజప్ప వ్యాఖ్యానించారు. జగన్ చెప్పే విషయాలను ముద్రగడ లేఖల్లో చూస్తున్నామని దీంతో కాపుగర్జన సందర్భంగా జరిగిన విధ్వంసానికి వైకాపా నేతలకు సంబంధం ఉందన్న అనుమానం ఎవరికైనా కలుగుతుందన్నారు.

05/25/2016 - 16:53

హైదరాబాద్: ఎపికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ కేంద్రాన్ని కోరుతూ టిడిపి మహానాడులో తీర్మానం చేయాలని కాంగ్రెస్ నేత కెవిపి రామచంద్రరావు సిఎం చంద్రబాబుకు లేఖ రాశారు. బిజెపితో పొత్తుకంటే ప్రత్యేక హోదా కోసం ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన కోరారు. హోదా వల్ల ప్రయోజనం ఉండదని చంద్రబాబు మాట్లాడడం సరికాదన్నారు.

05/25/2016 - 16:52

గుంటూరు: ఎపికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ జూన్ 2న అన్ని నియోజకవర్గాల్లో ఆందోళన చేపడతామని ప్రత్యేకహోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ బుధవారం తెలిపారు. సమితి అధ్యక్షుడిగా మళ్లీ ఎన్నికైన సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ, ఆగస్టు9 సామూహిక నిరసన దినాన్ని పాటిస్తామన్నారు. తాము చేపట్టే ఆందోళనలకు అన్ని రాజకీయ పక్షాలూ మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు.

05/25/2016 - 15:21

అనంతపురం: పట్టణంలోని ఓ వస్త్ర దుకాణంలో నకిలీ వెయ్యి రూపాయలను మార్చేందుకు ప్రయత్నించిన ఇద్దరిని పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. బిహార్‌కు చెందిన షేక్ ముజాహిల్ అలీ, జార్ఖండ్‌కు చెందిన అన్వర్ షేక్ దుస్తులను కొనుగోలు చేసిన ఇచ్చిన వెయ్యి రూపాయల నోట్లు నకిలీవని దుకాణం యజమాని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. నిందితులిద్దరూ అంతర్రాష్ట్ర ముఠాలో సభ్యులని పోలీసులు తెలిపారు.

05/25/2016 - 15:19

విజయవాడ: వచ్చే నెల 27లోగా ప్రభుత్వ ఉద్యోగులంతా అమరావతికి తరలివెళ్లాలని ఎపి సర్కారు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. కార్యాలయాల తరలింపు కోసం ప్రభుత్వ లేదా ప్రైవేటు భవనాలను అనే్వషించాలని, వాటి అద్దెలను కృష్ణా, గుంటూరు కలెక్టర్లు నిర్ణయిస్తారని, కనీసం మూడేళ్ల కాలానికి భవనాలను లీజుకు తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

05/25/2016 - 15:18

కడప: ఐపిఎల్ మ్యాచ్‌ల సందర్భంగా బెట్టింగ్‌లు నిర్వహిస్తున్న ఇద్దరు క్రికెట్ బుకీలను స్థానిక పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. వీరి నుంచి సుమారు 3.50 లక్షల నగదు, కొన్ని సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

05/25/2016 - 15:18

తిరుపతి: పట్టణంలోని ఓ హోటల్‌లో బుధవారం నాడు వంట మాస్టార్ల మధ్య వివాదం ముదిరి కార్మికులు పరస్పరం దాడులకు దిగారు. ఈ సందర్భంగా ముగ్గురు హోటల్ కార్మికులు గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే ఆస్పత్రికి తరలించి పోలీసులు కేసు నమోదు చేశారు.

Pages